Coorg Travel : కూర్గ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఇదే పూర్తి గైడ్
Coorg Travel : ఎండాకాలం ప్రయాణాలు చేయాలి అనిపించినా చాలా మందికి ఎక్కడికి వెళ్లాలి అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. అలా కన్ఫ్యూజ్ అయ్యేవారికి కూర్గ్ ఒక పర్ఫెక్ట్ సమ్మర్ డెస్టినేషన్. తొలిసారి వెళ్లినా కూడా చాలా నేచురల్‌గా అనిపిస్తుంది.
కూర్గ్‌లో రోడ్ల పక్కనే కాఫీ ప్లాంటేషన్స్ (coffee plantations), మధ్య మధ్యలో జలపాతాలు, చిన్న ఇళ్లతో కలిసి ఒక కామ్ అండ్ ఫ్రెష్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. మార్నింగ్‌లో వీచే గాలి కాఫీ ఘుమఘుమలను మోసుకొచ్చే మెసెంజర్‌లా మారిపోతుంది.
సమ్మర్లో (summer destination) కూడా మీరు ఇలాంటి అనుభవాలనే సొంతం చేసుకోవచ్చు
సందర్శనీయ స్థలాలు | Places To Visit in Coorg
అబ్బే ఫాల్స్ దగ్గర నీరు పడే శబ్దంలో ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. రాజాస్ సీట్ (Raja’s Seat) నుండి వ్యాలీ చూస్తూ సూర్యోదయం మెల్లిగా విస్తరించే దృశ్యం అద్భుతంగా ఉంటుంది. దుబారే ఎలిఫెంట్ క్యాంప్ (Dubare Elephant Camp) దగ్గర నేచర్ మధ్య రిలాక్స్ అయ్యే అవకాశం లభిస్తుంది.
- ఇది కూడా చదవండి :Tbilisi : టిబిలిసి…యూరోప్‌లో సాఫ్ట్ ఎంట్రీలా అనిపించే నగరం
ఏం తినాలి? | Food In Coorg
కూర్గ్ స్టైల్ మీల్స్‌లో స్పైసెస్ మైల్డ్‌గా, ఫ్లేవర్ రిచ్‌గా ఉంటాయి. ఇక్కడి నాన్ వెజ్ వంటకాలకు స్థానిక మసాలాలే ప్రత్యేకత. ఫ్రెష్ కాఫీ సిప్ చేస్తూ అక్కడి వైబ్‌ను పూర్తిగా ఎంజాయ్ చేయవచ్చు.
Straight from Raja Seat – Coorg https://t.co/KXZH88qo5X pic.twitter.com/ToL9niFoup
— NoturEx (@ExNotur) March 10, 2026
ఎప్పుడు వెళ్లాలి? | Best Time To Visit
అక్టోబర్ నుంచి మార్చి వరకు వెదర్ చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. అయితే చాలా మంది ఎండాకాలంలో కూడా వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు. చలికాలంలో అయితే మిస్ట్, గ్రీనరీ, కూల్ బ్రీజ్ కలిసి అద్భుతమైన అనుభవాన్ని ఇస్తాయి. ఎండాకాలం ఒక ప్రశాంతమైన అనుభవాన్ని సొంతం చేసుకునేందుకు, చల్లదనం కోసం కూర్గ్ వెళ్లవచ్చు.
హైదరాబాద్ నుంచి ఎలా చేరుకోవాలి? | Hyderabad To Coorg
హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు ప్లైట్‌లో సుమారు 90 నిమిషాలు ప్రయాణించాలి. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో 5–6 గంటలు ప్రయాణించి కూర్గ్‌కు చేరుకోవచ్చు. కూర్గ్‌లో గడిపిన రోజులను గుర్తుచేసుకుంటే గాలిలో కాఫీ సువాసన, ప్రశాంతత గుర్తుకొస్తాయి. అక్కడి స్లో లైఫ్ మనసులో చిరకాలం నిలిచిపోతుంది.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.







