థ్రిల్ కోసం సఫారీ జోన్లో పులి చేజ్, వీడియో వైరల్ | Corbett Tiger Chase
Corbett Tiger Chase : ట్రావెల్ లవర్స్‌కు స్వర్గధామం లాంటి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌కు చెందిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇక్కడి ఫాటో సఫారీ జోన్ (Phato Safari Zone) లో రికార్డ్ అయిన ఈ ఫుటేజ్‌లో సఫారీ జీపులు చాలా హడావిడిగా, పోటీ పడుతు ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి.
ఈ వీడియోను సఫారీలో (Jim Corbett National Park) పాటించాల్సిన స్పీడ్ లిమిట్‌ను బ్రేక్ చేసి, చాలా దగ్గరగా వెళ్లి మరీ పులిని వెంటాడుతున్నట్టు షేర్ చేశారు. ఛేజ్ చేసే సమయంలో పులి కనిపించకపోయినా..వాళ్లు పులి కోసమే బండి స్పీడ్ పెంచినట్టు తెలుస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైడ్‌గా సర్క్యులేట్ అవుతోంది.
- ఇది కూడా చదవండి : 3 రోజుల్లో రాజస్థాన్ రాయల్ ట్రిప్ ఎలా పూర్తి చేయాలి ? | Jaisalmer Desert Triangle Itinerary
ఈ వీడియో బయటకు రాగానే అటవీ విభాగం దీనిపై దర్యాప్తు ప్రారంభించింది. ఇది 2026 జనవరి 13వ తేదీకి చెందిన వీడియో అని తెలిసింది. వీడియో ఆధారంగా రూల్స్ బ్రేక్ చేసినందుకు 2 సఫారీ జీపులను సీజ్ చేశారు. ఈ ఘటనలో భాగమైన మొత్తం నలుగురిపై చర్యలు తీసుకున్నారు.
📍 Corbett National Park, #Ramnagar से इस वायरल वीडियो को देखिए…
— Madhurendra kumar मधुरेन्द्र कुमार (@Madhurendra13) January 27, 2026
🎥 वीडियो में सफारी जीपों को बाघ का पीछा करते, स्पीड लिमिट तोड़ते और खतरनाक रूप से पास जाते देखा गया।
⚠️ वीडियो सामने आने के बाद प्रशासन एक्शन में आया
🚫 2 जीपें जब्त
🚫 ड्राइवर अमजद व शमशाद
🚫 नेचर गाइड आशीष व… pic.twitter.com/rbU65U5Yn7
వన్యప్రాణి నిపుణుల ప్రకారం, సఫారీ అంటే జంతువులను గమనించే అవకాశం కల్పించే ఫెసిలిటీ మాత్రమే. అది థ్రిల్ కోసం ఏర్పాటు చేసిన పార్క్ కాదు. సందర్శకుల కోసం జంతువులను వెంటాడటం వల్ల అవి తీవ్రమైన ఒత్తిడికి గురవుతాయి. ఇలాంటి ప్రవర్తన వల్ల టూరిస్టులు, స్టాఫ్‌తో పాటు అక్కడి ఈకో సిస్టమ్ కూడా డిస్టర్బ్ అవుతుంది.
Prayanikudu.com ట్రావెల్ రీడర్స్కి ఈ ఇన్సిడెంట్ ఒక ఇంపార్టెంట్ రిమైండర్ లాంటిది. రెస్పాన్సిబుల్ టూరిజం అనేది ఒక ఆప్షన్ కాదు. అది అత్యవసరం అని తెలుసుకోవాల్సిన సమయం ఇదే. ఫారెస్ట్ రూల్స్ పాటించడం వల్ల మాత్రమే వైల్డ్‌లైఫ్ ఎక్స్‌పీరియెన్స్ అనేది సురక్షితంగా, ప్రశాంతంగా, అర్థవంతంగా సాగుతుంది.

▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
