Dubai Rail Bus: రైలు బస్సును లాంచ్ చేసిన దుబాయ్ ఆర్టీయే…దీని ప్రత్యేకతలు ఏంటంటే

షేర్ చేయండి

పట్టణ రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో విజయం సాధించిన దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ ఆథారిటీ తాజాగా “రైల్ బస్” ( Dubai Rail Bus) ను ఆవిష్కరించింది.

ప్రపంచంలోనే అత్యాధునిక మౌళిక సదుపాయాలు ఉన్న ప్రదేశాల్లో దుబాయ్ కూడా ఒకటి. ఇప్పటికే అనేేక రంగాల్లో ముందున్న దుబాయ్‌లో మరో సదుపాయం అందుబాటులోకి వచ్చింది. పట్టణ రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంతో విజయం సాధించింది దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ ఆథారిటీ (Dubai RTA).

Prayanikudu

తాజాగా “రైల్ బస్” ( Rail Bus) ను ఆవిష్కరించింది. సోమవారం, 2025 ఫిబ్రవరి 10 సోమవారం రోజు వరల్డ్ గవర్నెన్స్ సమిట్‌లో (World Governance Summit) ఈ రైల్ బస్ మోడల్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది దుబాయ్.

దుబాయ్ | Dubai Overview

దుబాయ్ అనేది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు ( United Arab Emirates ) చెందిన ఏడు ఎమిరేట్స్‌లో ఒకటి. ప్రపంచంలోనే అత్యాధునిక నిర్మాణాలు, మౌళిక సదుపాయాలను కల్పిస్తూ ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది దుబాయ్. ఇక్కడి థీమ్ పార్కులు, బూర్జ్ ఖలీఫా ( Burj Khalifa- ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్) ఇవన్నీ దుబాయ్‌ను టూరిస్టు డెస్టినేషన్‌గా మార్చేసింది.

తాజాగా ప్రజా రవాణా వ్యవస్థను (Dubai Public Transport) మరింత బలోపేతం చేసేందుకు రైల్ బస్సును ప్రారంభించింది. ఇది మన్నికైన రవాణా వ్యస్థ మాత్రమే కాదు సౌకర్యవంతంగా కూడా ఉండనుంది అని తెలుస్తోంది.పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని, మన్నికగా ఉండేలా తయారు చేయడం వల్ల అక్కడి ప్రజారవాణా వ్యవస్థలో ఇది కీలక పాత్ర పోషించనున్నట్టు తెలుస్తోంది.

రైల్ బస్ అంటే ? | What Is A Rail Bus ?

Dubai Rail Bus
| దుబాయ్ రైలు బస్సు

రైల్ బస్ అనేది తక్కువ బరువు, అత్యధిక సమర్థవంతమైన ప్యాసింజర్ ట్రైన్. దీనిని రైల్వే ట్రాకులపై తక్కువ దూరం ప్రయాణించే విధంగా తయారు చేస్తారు. సాధారణంగా రోజువారి పనులకు వెళ్లే వారు, పర్యాటకులు, తక్కువ దూరం ప్రయాణించే వారు వీటిలో జర్నీ చేస్తుంటారు.

సాధారణ ట్రైన్లు చాలా బరువుగా ఉంటాయి. కానీ రైలు బస్సులు తేలికగా ఉంటాయి. ఇది చూడటానికి బస్‌లా ఉంటుంది. వీటి కోసం ప్రత్యేకంగా ట్రాకులు కూడా వేయాల్సిన అవసరం లేదు. అందుబాటులో ఉన్న ట్రాకులే సరిపోతాయి. రైల్వే ట్రాకులు లేకపోతే మాత్రం వేయాల్సిందే. భారీ ట్రైన్లతో పోల్చితే ఇది తక్కు ఇంధనంతో నడుస్తుంది.

దుబాయ్ రైలు బస్సు ప్రత్యేకతలు | Dubai Rail Bus Design & Specifications

ప్రపంచంలో అనేక దేశాల్లో రైలు బస్సు నడుస్తోంది. కానీ దుబాయ్ రైలు బస్సు మరింత అడ్వాన్స్ అని చెప్పవచ్చు. చూడటానికి ఇది ఫ్యూచరిస్టిక్ క్యాప్‌సూల్‌లా ఉంది. ఇది ప్రయాణికులను వేగంగా గమ్యస్థానానికి చేర్చడంతో పాటు సౌరక్యవంతమైన ప్రయాణ అనుభూతికి కూడా అందిస్తుంది. 

  • ఎత్తు : 11.5 మీటర్లు
  • వెడల్పు : 2.65 మీటర్లు

ఇందులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఒకేసారి ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఈ బస్ రైలు ప్రత్యేకత ఏంటంటే నగరాల మధ్య ప్రయాణించే వారిని ఇది గంటకు 100 కిమీ వేగంతో వారి గమ్యస్థానాలకు చేర్చుతుంది.

మన్నికైనది

దుబాయ్ రైల్ బస్ నడిచేందుకు ఎలాంటి శక్తిని వినియోగించనున్నారో ఇప్పటికైతే సమాచారం లేదు. కానీ ప్రాజెక్టును పర్యావరణహితంగా, మరింత మన్నికగా ఉండేలా ప్లాన్ చేశారని తెలుస్తోంది. 

ఇది వాహనం మాత్రమే కాదు

రైలు బస్సు అనేది ఒక వాహనం మాత్రమే కాదు ఇది వినూత్నమైన రవాణా వ్యవస్థ. ఇంకా దీని గురించి అనేక విషయాలు తెలియాల్సి ఉన్నా…సిటీలో దాని కోసమే ఏర్పాటు చేసిన నెట్వర్క్ బ్రిడ్జీలపై ఇది దూసుకెళ్లనుంది అని తెలుస్తోంది. దీంతో రోడ్డుపై ప్రయాణించకూడదు అనుకునేవారు ఇందులో కూడా ప్రయాణించవచ్చు. 

ఈ కొత్త రవాణా వ్యవస్థ ఏర్పాటు వల్ల దుబాయ్ వాసుల ప్రయాణం (Travel In Dubai) మరింత సులభతరం కానుంది. దుబాయ్‌లో ప్రస్తుతం ఉన్న మెట్రో, ట్రామ్, బస్సులు, ట్యాక్సీలతో పాటు రైల్ బస్సు కూడా ప్రజలకు సేవలు అందించనుంది.

దుబాయ్ 2024 అర్బర్ ప్లాన్

ప్రజల జీవన విధానాన్ని మాచ్చేందుకు, ట్రాఫిక్, రద్దీని హరికట్టేందుకు దుబాయ్ రచించిన వ్యూహంలో రైలు బస్సు కూడా ఒకటి. మిగితా వ్యూహాల విషయానికి వస్తే అల్ ఫహీది, అబు హెయిల్, అల్ కరామా, అల్ ఖువోజ్ క్రియేటీవ్ జోన్లలో పార్కింగ్ ఫీజులను అడ్జస్ట్ చేయడం, కార్ ఫ్రీ పెడిస్ట్రియన్ జోెన్లు ఏర్పాటు చేయడం వంటివి కూడా ఉన్నాయి.

ఇవన్నీ కూడా దుబాయ్ 2024 అర్బర్ ప్లాన్ ( Dubai 2040 Urban Plan)‌‌ లో భాగం. పట్టణ ప్రాంతాల్లో మెరుగైనా రవాణా, మన్నికైన మౌళిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా పెట్టుకుంది దుబాయ్.

ఎగిరే ట్యాక్సీలు | Sneak Peak Into Dubai’s Future

పట్టణ రవణా వ్యవస్థను మెరుపర్చడంలో భాగంగా తాజాగా రైలు బస్సు పరిచయం చేసింది దుబాయ్. ఇక 2026 లో ఫైయింగ్ ట్యాక్సీలను ( Dubai Flying Taxis) ను కూడా పరిచయం చేయనుంది అని సమాచారం.

బుల్లెట్ ట్రైన్ | UAE Bullet Train

దుబాయ్ అంటే డబ్బు. డబ్బు సంపాదించడానికి టైమ్ కావాలి. ప్రయాణాల్లో, ట్రాఫిక్‌లో టైమ్ వేస్ట్ చేయడం అంటే డబ్బు సంపాదించే ఛాన్స్ పోగొట్టుకోవడమే కదా. ఈ లాజిక్‌తోనే దుబాయ్ వేగవంతమైన రవాణా వ్యవస్థపై ఫోకస్ చేస్తోంది.

ఇటీవలే అబుధాబి నుంచి దుబాయ్ మధ్యలో బులెట్ ట్రైన్ ప్రాజెక్టు ( Abu Dhabi Dubai Bullet Train ) ప్రారంభమైన విషయం తెలిసిందే. దీనిని యూఏఈ (UAE) ప్రారంభించగా ఇది గంటకు 350 కిమీ వేగంతో ప్రయాణించనుంది. ఆ బులెట్ ట్రైను అందుబాటులోకి వస్తే అబుధాబి నుంచి దుబాయ్‌కు మధ్య ఉన్న 100 కిమీ దూరాన్ని 30 నిమిషాల్లో పూర్తి చేయవచ్చు.

📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ట్రెండింగ్ వార్తలు కోసం NakkaToka.com విజిట్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!