దుబాయ్ వెళ్లాలని ఎవరికి ఉండదు చెప్పండి ? బూర్జ్ ఖలీఫా నుంచి దుబాయ్ క్రీక్ హార్బర్ వరకు టూరిస్టుల కోసం ఎన్నో ఆప్షన్స్‌తో ఆహ్వానిస్తుంది ఈ ఎమిరాతి నగరం ( Emirati City ). చాలా మంది భారతీయులు ఇక్కడి వెళ్లడానికి ఇష్టపడుతుంటారు. మీరు కూడా దుబాయ్ (Dubai) ప్లాన్ చేస్తోంటి ఈ మధ్యే మారిన కొత్త వీసా రెగ్యులేషన్స్ గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఈ పోస్టులో ఆ వివరాలు మీకోసం…
ముఖ్యాంశాలు
పర్యాటకానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న దుబాయ్ నగరం ఇప్పుడు సెక్యూరిటీ విషయంలో రూల్స్‌ను మరింతగా టైట్ చేసింది.సెక్యూరిటీని , అప్లికేషన్ ప్రాసెసింగ్‌లో పారదర్శకత పెంచుతూనే దిశలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రయాణికులు తమ హోటల్ బుకింగ్ వివరాలు, రిటర్ను టికెట్ వివరాలు అందిస్తేనే ఇక టూరిస్టు వీసా దొరుకుతుందట.
Read Also: UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు
మారిన వీసా రూల్స్| Dubai Visa Rules 2024
మీరు దుబాయ్ టూరిస్టు వీసాకు ప్రయత్నిస్తుంటే ఈ విషయాలు మీకు ఖచ్చితంగా తెలియాలి:
హోటల్ రిజర్వేషన్ :
Dubai Hotel Reservation For Visa : ముందుగా మీరు దుబాయ్‌లో స్టే చేయనున్న హోటల్ రిజర్వేషన్ అనేది క్యూ ఆర్ కోడ్ ఉపయోగించి పూర్తి చేయాల్సి ఉంటుంది.ఒకవేళ మీరు మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో కలిసి వెళ్లాలి దుబాయ్‌లో ఉండాలి అనుకుంటే మాత్రం అదనంగా డాక్యుమెంట్స్ అందించాలి.
అందులో మీకు ఆతిథ్యం ఇవ్వనున్న హోస్ట్ ఫ్రూఫ్ ఇవ్వాల్సి ఉంటుంది.
రిటర్న్ ఫ్లైట్ టికెట్ :
Dubai New Visa Regulations : మీ వీసా రిజెక్ట్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే మీ రిటర్న్ టికెట్ ( return flight ticket) వివరాలు తప్పకుండా అందించాల్సి ఉంటుంది.అది కూడా కన్ఫర్మ్ అయిన టికెట్ వివరాలు అందించాలి. వన్ వే లేదా ఓపెన్ ఎండెడ్ టకెట్లను (Open Ended Tickets ) ఇకపై యాక్సెప్ట్ చేయరు. డమ్మీ టికెట్ బుకింగ్ చెల్లదు.
Read Also : Azerbaijan అజర్ బైజాన్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? 10 టిప్స్!
మీ డాక్యుమెంట్స్ ఏవైనా మీరు ఖచ్చితంగా దుబాయ్ ఇమిగ్రేషన్ డిపార్ట్‌మెంట్‌కు ఆన్‌లైన పోర్టల్‌లోనే అందించాల్సి ఉంటుంది. లేదా మీ అవ్రూవ్ అయిన సోర్స్ ద్వారానే చేయాల్సి ఉంటుంది.
ఫైనాన్షియల్ ఫ్రూఫ్
Financial Proof For Dubai Visa : దుబాయ్ వెళ్లి అక్కడ ఉండటానికి ఒక ప్రయాణికుడు ( Prayanikudu) ఆర్థికంగా సిద్ధంగా ఉన్నాడా లేదా అనేది కూడా దుబాయ్ తెలుసుకోవాలి అనుకుంటోంది. అందుకే డెబిట్ కార్టు లేదా క్రెడిట్ కార్డులో సరైన బ్యాలెన్స్ ఉందని చూపించాల్సి ఉంటుంది. ఆ బ్యాలెన్స్ ఎంత అంటే…
- రెండు నెలల వీసా కోసం అయితే 5,000 దిర్హామ్స్ (Dirhams)
- మూడు నెలల వీసా కోసం 3,000 దిర్హామ్స్
ప్రయాణికులు ఈ విషయాలు గమనించాలి
ఈ కొత్త రూల్స్ అనేవి పాకిస్తాన్ ( Pakistan), కొన్ని ఆఫ్రికన్ దేశాల పౌరులకు వెంటనే అప్లై చేసింది దుబాయ్.ప్రయాణికులు ఎప్పుడు వస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు అనే విషయంపై ఖచ్చితమైన సమాచారం ఉండేందుకు ఈ దుబాయ్ ఈ చర్యలు తీసుకుంది.యూఏఈలో ( United Arab Emirates) ఉండే విదేశీయుల బంధువులు యూఏఈకి రావాలి అనుకుంటే వారికి ఈ కొత్త రూల్స్ వర్తిస్తాయా లేదా అనే విషయంపై స్పష్టత లేదు.
అయితే ఈ రూల్స్ వల్ల తమ ప్రయాణంలో కొంత జాప్యం జరుగుతోంది అని కొంత మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ కొత్త రూల్స్ అనేవి పర్యాటకులు తమ సిటీలో ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశ్యంతో విధించింది దుబాయ్.
Read Also: UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు
భారతీయులు దుబాయ్ ట్రావెల్ వీసా ఎలా అప్లై చేయాలి ?
How can Indian Tourists Apply Dubai Visa : దుబాయ్ వెబ్‌సైట్‌లో టూరిజం వీసా ప్రాసెస్ గురించి సెర్చ్ చేస్తే అక్కడ కొన్ని విషయాలు చూశాను.యూఎస్‌ఏ జారీ చేసిన వీసా ఉన్నా, యూఎస్‌ఏ గ్రీన్ ( USA Green Card) కార్డు ఉన్నా, యూకే, యరోప్ రెసిడెన్స్ వీసా ఉన్నా, యూకే, యూరోప్ విజిట్ వీసా ఉంటే మీకు 14 రోజుల ఆన్ అరైవల్ వీసా దొరుకుతుంది. దీనిని మీరు మరో 14 రోజులు పొడగించుకోవచ్చు.
మీ దగ్గర పైన వివరించిన వీసా లేకపోతే ఇలా అప్లై చేయవచ్చు
- ఎమిరేట్స్, ఫై దుబాయ్ ఎతిహాద్ ఎయిర్‌వేస్, ఏయిర్ అరేబియా ద్వారా వీసా అప్లై చేయవచ్చు.
- హోటల్ లేదా ట్రావెల్ ఏజెన్సీ ద్వరా
- యూఏఈలో ( UAE) ఉన్న ఇతర సంస్థల ద్వారా
- యూఏఈలో ఉన్న వారు (స్నేహితుడు, బంధువు ) నిబంధనలకు అనుగుణంగా మీ తరపున అప్లై చేయవచ్చు.
షెంజెన్ వీసా ఉన్న భారతీయులు ( Indian With Schengen Visa) వీసా ఆన్ అరైవల్‌కు అర్హులు
మీ వీసా ప్రక్రియ సాఫీగా సాగాలంటే
Tips For Applying Dubai Visa : దుబాయ్‌కు టూరిస్టుల రాకను అదుపులో పెట్టడం , బాధ్యతాయుతమైన పర్యటకాన్ని ప్రోత్సాహించేందుకు ఈ చర్యలు తీసుకుంది. ఇలాంటి పరిస్థితిలో మీకు వీసా రావాలి అంటే ఇలా చేయండి .
- ముందుగా బుక్ చేసుకోండి: మీ దుబాయ్ వీసా పక్కగా రావాలంటే ముందుగా చేయాల్సిన పని మీ హోటల్ లేదా లైనెస్స్ ఉన్న అకామడేషన్ ముందుగానే బుక్ చేసుకోవడం. బుకింగ్ డాక్యుమెంట్స్‌లో మీ వివరాలు సరిగ్గా ఉండేలా చూసుకోండి.
- రిటర్న్ టికెట్ తీసుకోండి : మీకు నచ్చిన ఎయిర్‌లైన్స్ నుంచి దుబాయ్ నుంచి తిరిగి వెళ్లే టికెట్ బుక్ చేసుకోండి.
- సరైన మార్గంలో అప్లై చేయండి : దుబాయ్ వచ్చే ముందు మీరు జీడీఆర్‌ఎఫ్‌ఏ అంటే దుబాయ్ ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన ట్రావెల్ ఏజెన్సీ లేదా యూఏఈలోని స్పాన్సర్ ద్వారానే వీసా అప్లై చేయండి. అన్ని డాక్యుమెంట్స్ సరిగ్గా ఇవ్వండి.
- .ప్రాసెసింగ్ టైమ్ చెక చేయండి: వీసా పొందడానికి కొంత సమయం పట్టవచ్చు. అందుకే ముందుగానే ఈ ప్రాసెస్ మొదలు పెట్టండి.
దుబాయ్ తన అంతర్జాతీయ గౌరవాన్ని కాపాడుకునేందుకు బాధ్యతాయుతమైన టూరిజం వైపు అడుగులు వేస్తోంది.అందుకే ఈ మార్పులను తీసుకొచ్చింది.
మరింత సమాచారం కోసం దుబాయ్ అధికారిక పోర్టల్ జీడీఆర్ఎఫ్ఏడి ( GDRFAD) లేకా దుబాయ్ విజిట్ ( Dubai Visit) వెబ్సైట్ విజిట్ చేయగలరు
ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.