Indias Ancient Temples: హైందవ మతానికి పుట్టినిల్లు అయిన భారత దేశంలో కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు లక్షలాది దేవాలయాలు ఉన్నాయి. భారతీయ సంస్కృతికి, ఆచారాలకు, విధివిధానాలకు, వారసత్వానికి ప్రతీకగా నిలిచే ఆలయాలు మన దేశంలో అనేకం ఉన్నాయి.
ముఖ్యాంశాలు
ఈ ఆలయాలు భారతీయతకు నిదర్శనంగా, హిందూ మతం ఔన్నత్యాన్ని (Hinduism) ప్రపంచానికి చాటేలా సగర్వంగా ఆకాశంతో సమానంగా వెలిశాయి. విదేశీయులు దండయాత్రలను, ముస్లిం రాజులు దాడులను (Muslim rulers), బ్రిటిష్ వాళ్ల అణచివేతనూ భరించి నేటికీ హైందవ మతానికి దిక్సూచిగా నిలుస్తున్న 5 ఆలయాలు ఇవే.
- ఇది కూడా చదవండి : హిమాలయ పర్వతాల్లో బ్రహ్మకమలం కనిపించింది..మీరు కూడా చూడండి
శ్రీ వేంకటేశ్వర ఆలయం, తిరుమల / 1

Sri Venkateswara Temple, Tirumala : కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలువబడే శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం ఇది. ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయం (Richest Temple)… తిరుమలలోని శ్రీవారి ఆలయం. పురాతత్వ విభాగం ఆధారాల ప్రకారం తిరుమల ఆలయాన్ని క్రీ.శ 300 లో నిర్మించినట్టు తెలుస్తోంది.
తిరుమల కొండపై ద్రావిడ నిర్మాణశైలిలో నిర్మించిన ఈ ఆలయానికి ప్రతీ రోజు లక్షలాది మంది భక్తులు ప్రపంచ నలుమూలల నుంచి తరలి వస్తుంటారు.
కాశీ విశ్వనాథుడి ఆలయం, వారణాసి / 2

Kashi Vishwanath Temple, Varanasi : ప్రపంచంలోనే అతిపురాతన నగరంగా భావించే కాశీ నగరంలో కొలువై ఉన్న ఆలయం ఇది. గంగా నది తీరంలో కొలువై ఉన్న కాశీ విశ్వనాథుడి ఆలయం అనేది భారత దేశంలో ఉన్న మహాశివుడి (Lord Shiva) అత్యంత పవిత్రమైన ఆలయాల్లో ఒకటి.
- ఇది కూడా చదవండి : Palani Temple : పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గైడ్ ! 10 Facts
ఈ ఆలయాన్ని క్రీ.శ 490 లో నిర్మించగా, ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని 18వ శతాబ్దంలో మహారాణి అహల్యాబాయి హోల్కర్ (Queen Ahilyabai Holkar) పునర్మించారు. మన దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలలో (twelve Jyotirlingas) ఈ ఆలయం కూడా ఒకటి.
కోణార్క్ సూర్యదేవాలయం, ఒడిశా /3

Konark Sun Temple, Odisha : సూర్యదేవుడి రథంలా నిర్మించబడిన ఆలయం ఇది. కోణార్క్‌లోని సూర్యదేవాలయాన్ని క్రీ.శ 1250 లో తూర్పు గంగా రాజవంశానికి చెంది రాజా నరసింహా దేవుడు నిర్మించాడు. యూనెస్కో వారసత్వం సంపదగా గుర్తింపు తెచ్చుకున్న ఈ ఆలయాన్ని బ్లాక్ పగోడా, ఆర్క ఖేత్రా, పద్మా ఖేద్రా అని కూడా పిలుస్తుంటారు. కలింగ లేదా ఒడిశా నిర్మాణ శైలిలో 26 ఎకరాల్లో ఈ ఆలయాన్ని నిర్మించారు.
ముండేశ్వరి దేవి ఆలయం, బీహార్ / 4

Mundeshwari Devi Temple, Bihar : బీహార్‌లోని కైమూర్ జిల్లాలో ఉన్న మా ముండేశ్వరి దేవీ ఆలయం మహా శివుడు, శక్తి దేవికి (Shiv Shakti) అంకితమైన దేవాలయం. ఈ ఆలయాన్ని ప్రపంచంలోనే అత్యంత పురాతమైన దేవాలయంగా కీర్తిస్తారు (oldest Temple). ఈ ఆలయంలో వినాయకుడు, సూర్యుడు, శ్రీ మహా విష్ణువు విగ్రహాలు కూడా ఉన్నాయి. ఆర్కియాలజీ విభాగం ప్రకారం ఈ ఆలయాన్ని క్రీస్తు పూర్వం 108 లో నిర్మించారట.
1915 ఈ ఆలయ సంరక్షణ బాధ్యతలను ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియానే (ASI) నిర్వహిస్తోంది. నాగారా శైలిలో (Nagara Architecture) నిర్మితమైన ఈ ఆలయంలో మహా శివుడి ముఖ లింగం కేంద్రంలో ఉండగా తరువాత కాలంలో అమ్మవారిని ఇక్కడ ముండేశ్వరిగా కొలవడం ప్రారంభించారు.
ఇక్కడ కొన్ని దశాబ్దాల కాలంగా నిరవధికంగా పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీరామ నవమి, మహా శివరాత్రి సంద్భంగా భక్తులు ఇక్కడికి అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు.
బృహదీశ్వరాలయం, తంజావూరు / 5

Brihadeeswara Temple, Thanjavur : భారతీయు శిల్పకళాా వైభవానికి, నిర్మాణ కళా ఔన్నత్యానికి ప్రతీకగా నిలిచే ఆలయం తంజాపూరులోని బృహదీశ్వరాలయం. క్రీశ 1010 లో మొదటి రాజరాజ చోళుడు (Raja Raja Cholan 1) నిర్మించిన ఈ ఆలయం కాలం, ప్రకృతి, పాలకులు పెట్టిన అనేక పరీక్షలను తట్టుకుని నేటికీ పఠిష్టంగా నిలబడింది.
- ఇది కూడా చదవండి : Thanjavur : ఈ ఆలయం నీడ నేలపై పడదు
ఈ ఆలయాన్ని చోళ నిర్మాణ శైలిలో నిర్మించారు. ఆలయ ప్రధాన ద్వారం చిన్నగా ఆలయ విమాన గోపురం పెద్దగా ఉండటమే చోళులు నిర్మాణ శైలి.
ఈ ఆలయంలో మహాశివుడి అతి పెద్ద శివలింగం చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. యూనెస్కో ప్రపంచ వారసత్వ (UNESCO Heritage Site) సంపదగా గుర్తింపు తెచ్చుకున్న ఈ ఆలయం నేడు ఇలా కనిపించేందుకు ఎంతో మంది రాజులు తమ వంతు సహాకారం అందించారు.
భారతీయ ఆధ్యాత్మిక సౌరభాలు | Indias Ancient Temples
Indias Ancient Temples : ఆలయాలు అనేవి ప్రార్థనలు చేసి, పూజలు నిర్వహించే కేంద్రాలు మాత్రమే కాదు. అవి భారతీయ ఆధ్యాత్మిక సౌరభాన్ని భవిష్యత్ తరాలకు అందించే పవిత్ర ప్రదేశాలు కూడా. పైన వివరించిన ఆలయాలకు వెళ్లడం వల్ల మన పూర్వికులు హైంద మతం (Hindu Religion) కోసం చేసిన త్యాగాలు, పడిన కష్టం గురించి తెలుసుకోవచ్చు. భారత జాతి చరిత్రను (Indian History) తెలిపే నిలువెత్తు సాక్ష్యాలను వీక్షించవచ్చు.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.