పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్ సైన్యం పరిమిత స్థాయిలో మెరుపు దాడి చేసింది. ఈ ఆపరేషన్‌ను ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) అని పేరు పెట్టారు. ఇందులో పాకిస్తాన్‌తో పాటు పాక్ ఆక్రమిత జమ్మూ అండ్ కశ్మీర్‌లోని 9 ఉగ్రస్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది.

ముఖ్యాంశాలు
పహల్గాం ఉగ్రదాడి తరువాత తగిన రీతిలో సమాధానం చెబుతామని భారత్ చెప్పింది. ఇప్పుడు సమాధానం ఇవ్వడం మొదలు పెట్టింది.
India says it has targeted 9 Pakistani terror camps in PoK (Pak occupied Kashmir) using standoff missile strikes as part of #OperationSindoor
— Indo-Pacific News – Geo-Politics & Defense (@IndoPac_Info) May 6, 2025
➡️ Indian Army: “Justice has been served”.
➡️ Pakistan says it will retaliate against India attacks at 'time and place of its own… pic.twitter.com/y2hRCxNI9M
ఆపరేషన్ సింధూర్ వివరాలు | Operation Sindoor The Details
పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ చేపట్టినట్టు భారత రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన చేసింది. ఇది లక్ష్యిత దాడి అని యుద్ధానికి దారి తీసే విధమైన దాడి కాదు అని తెలిపింది. భారత్‌లో ఉగ్రదాడులకు కారణమైన వ్యక్తులు ఉన్న 9 ప్రదేశాలపై ఈ దాడులు నిర్వహించినట్టు తెలిపంది. ఇందులో పాక్ సైన్యానికి చెందిన ఫెసిలిటీస్‌పై ఎలాంటి దాడులు చేయలేదు అని అధికారులు తెలిపారు.
"A little while ago, the Indian Armed Forces launched 'OPERATION SINDOOR', hitting terrorist infrastructure in Pakistan and Pakistan-occupied Jammu and Kashmir from where terrorist attacks against India have been planned and directed. Altogether, nine (9) sites have been… pic.twitter.com/cfpwQ1fUGX
— Press Trust of India (@PTI_News) May 6, 2025
12 మంది ఉగ్రవాదులు ఖతం | Operation Sindoor
పాకిస్థాన్‌లోని బహవల్పూర్, కోటిలి, ముజఫ్పరాబాద్‌తో పాటు మరికొన్ని ఉగ్రవాదుల స్థావరాలపై దాడుల జరిగినట్టు పాకిస్తాన్‌కు చెందిన పలు మీడియా సంస్తలు వెల్లడించాయి. ఇందులో 12 మంది తీవ్రవాదులు మరణించారని సమాచారం. దాడుల అనంతరం పాకిస్థాన్‌లో పరిస్థితి…
📸 Operation Sindoor 🔥 pic.twitter.com/4AiLYO3L8H
— Megh Updates 🚨™ (@MeghUpdates) May 6, 2025
ఆపరేషన్ సింధూర్ అని పేరు వెనక అర్థం | Meaning Of Operation Sindoor
భారత దేశంలో సింధూరానికి (Operation Sindoor) ఉన్న ప్రాధాన్యత, విలువ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసరం లేదు. సింధూరం అంటే కుంకుమ..మన దేశంలో భర్త తన భార్య నుదిటిన సింధూరం పెట్టి తనను, తన గౌరవాన్ని జీవితాంతం కాపాడుతాను అని ప్రమాణం చేస్తాడు. అలాగే ఈ ఆపరేషన్‌కు సిందూర్ అని పేరు పెట్టడం వెనక భారత్ తన ప్రజల గౌరవాన్ని, ప్రాణాలను కాపాడుతుంది అని చాటేందుకు ఈ పేరు పెట్టారని తెలుస్తోంది.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.