హైదరాబాద్ నుమాయిష్‌ ఫస్ట్ డే ఎలా ఉందో చూడండి | Hyderabad Numaish 2025

Share This Story

హైదరాబాద్‌‌ ప్రజలు తప్పకుండా వెళ్లే ఈవెంట్‌లో నుమాయిష్ కూడా ఒకటి. ప్రతీ సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 15 వరకు ఈ అఖిల్ భారత వాణిజ్య ప్రదర్శన ( Hyderabad Numaish 2025 ) 45 రోజుల పాటు కొనసాగుతుంది. అయితే ఈ సారి రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం అయింది.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం తరువాత తెలంగాణ ప్రభుత్వం 7 రోజుల సంతాపదినాలను ప్రకటించింది . ఈ వారం రోజులు అధికారిక కార్యక్రమాలను చేపట్టలేదు. అందుకే జనవరి 1న ప్రారంభం అవ్వాల్సిన నాంపల్లి ఎగ్జిబిషన్ ( Nampally Exhibition 2025 ) 3వ తేదీన ప్రారంభం అయింది. ప్రారంభోత్సవానికి వెళ్లి అది కవర్ చేసి, ఫస్ట్ డే నుమాయిష్ ‌ఎలా ఉందో మీకు చూపించాలని ఈ పోస్టు పెడుతున్నాను.

హైదరాబాదీ ప్రజలు ఎప్పుడుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నుమాయిష్ 2025 జనవరి 3వ తేదీన ప్రారంభం అయింది
84వ అఖిలభారత వాణిప్య ప్రదర్శనను తెలంగాణ మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ సీనియర్ నేత డి హనుమంతురావు ప్రారంభించారు
మొదటి రోజు కావడంతో ఇంకా చాలా స్టాల్స్ పూర్తిగా ఏర్పాటు కాలేదు. ఇంకా చాలా స్టాల్స్‌లో లైటింగ్ కూడా ఏర్పాటు కాలేదు
కొన్ని స్టాల్స్ ముందు జనం కనిపించడం మొదలుపెట్టారు. మొదటి రోజు ప్రతీ సంవత్సరం ఇలాగే ఉంటుంది..తరువాత ఇసుకేస్తే రాలనంత జనం ఉంటారు.
ఈ ఏడాది మొత్తం 1500 స్టాల్స్ ఏర్పాటు అయ్యాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని ప్రాంతాల వ్యాపారులు ఇక్కడికి వచ్చి తమ స్టాల్స్ ఏర్పాటు చేశారు.
ఇందులో చిన్న పిల్లలను అలరించేందుకు ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు. నుమాయిష్‌లో పెద్దలు షాపింగ్ చేస్తారు. పిల్లలు ఎంజాయ్ చేస్తారు.
పిల్లల కోసం జయంట్ వీల్, ఇతర యాక్టివిటీస్ సిద్ఢం అయ్యాయి. అయితే తొలి రోజు కావడంతో పిల్లల సందడి కనిపించలేదు.
ఈ సారి నుమాయిష్ ఎంట్రీ ఫీజును పెంచి రూ.50 చేశారు. గత ఏడాది ఇది రూ.40 గా ఉంది.
స్టాల్స్ అన్నీ పూర్తితా సిద్దం అయ్యేందుకు ఒకటి రెండు రోజులు పట్టే అవకాశం ఉంది. తరువాత జనం పెరుగుతారు. ఈ సారి 25 లక్షల మంది సందర్శించే అవకాశం ఉంది.
ఈ శనివారం నుంచి సందర్శకులు తాకిడి పెరిగే అవకాశం ఉంది. మొత్తం 45 రోజులు నుమాయిష్ సందర్శకులతో కిటకిటలాడుతుంది.

1938 లో ప్రారంభం అయిన నుమాయిష్ ( Numaish 2025) నేటికీ విజయవంతంగా సాగుతోంది. ఈ నుమాయిష్‌ను హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వహిస్తోంది. నుమాయిష్ నిర్వహణతో వచ్చిన డబ్బును కాలేజీలు నడపడానికి, ఎంతో మంది మహిళలకు ఉపాధి, విద్యాభ్యాసం కల్పించడానికి ఉపయోగిస్తున్నారు.

గమనిక : ఈ వెబ్‌సైట్‌లో కొన్ని ప్రకటనలు కనిపిస్తాయి. వీటిని గూగుల్ యాడ్ అనే సంస్థ అందిస్తుంది. ఈ ప్రకటనలపై మీరు క్లిక్ చేయడం వల్ల మాకు ఆదాయం వస్తుంది. 

Trending Video On : Prayanikudu Youtube Channel

Share This Story

Leave a Comment

error: Content is protected !!