Glass Bridge : గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కి థ్రిల్ కావాలంటే ఏపీలో ఇక్కడికి వెళ్లాల్సిందే.. ఒక్కసారి వెళ్లారంటే కావాల్సినంత ఎంజాయ్మెంట్
Glass Bridge : వేసవి సెలవుల్లో మీ కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ ప్రాంతంలో ఒక అద్భుతమైన ప్రదేశం మీ కోసం ఎదురుచూస్తోంది. చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం, కళ్లకు కట్టినట్టు కనిపించే ప్రకృతి అందాల మధ్య గ్లాస్ బ్రిడ్జ్ పై నడుస్తూ, క్రింద ఉన్న దృశ్యాలను చూస్తూ థ్రిల్ ఫీల్ అవ్వాలనుకుంటే.. మీరు కచ్చితంగా ఇక్కడికి వెళ్లాల్సిందే. కాకినాడ తీరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న ఈ గ్లాస్ బ్రిడ్జ్ విశేషాలు, అక్కడికి చేరుకునే మార్గాలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు తెలుసుకుందాం.
గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కడ ఉంది?
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల పరిధిలోని ఈ గ్లాస్ బ్రిడ్జ్ (Glass Bridge in kakinada), కాకినాడ తీరానికి వెళ్లే మార్గంలో ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ గ్రామీణ ప్రాంతంలో, సముద్ర తీరానికి వెళ్లే రోడ్డు మార్గంలో కనిపిస్తుంది. ఈ గ్లాస్ బ్రిడ్జ్‌పై నిలబడి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను చూస్తే, ఆ ప్రాంతం ఒక అందమైన స్వర్గంలాగా అనిపిస్తుంది. పర్యాటకులు ఈ అందాలను చూసి మంత్రముగ్ధులు అవుతున్నారు.

అక్కడికి ఎలా చేరుకోవాలంటే ?
గ్లాస్ బ్రిడ్జ్ ఉన్న ప్రాంతం ఒక కిలోమీటరు దూరంలోనే బీచ్ రోడ్డుకు దగ్గరగా ఉంటుంది. అక్కడ పర్యాటకులకు మరింత ఆహ్లాదాన్నిచ్చే సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. కాకినాడ నుంచి బీచ్ (kakinada Beach) రోడ్డుకు వెళ్లే దారిలో, బీచ్ బ్రిడ్జికి సుమారు ఒక కిలోమీటర్ ముందు కుడివైపున ఈ గ్లాస్ బ్రిడ్జ్ కనిపిస్తుంది. గ్లాస్ బ్రిడ్జ్‌తో పాటు, దాని పక్కనే ఒక పార్క్ కూడా ఉంది. అంతేకాకుండా, గ్లాస్ బ్రిడ్జ్ కింద నీటిలో ప్రత్యేక బోట్ రైడ్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. అయితే, ఈ పడవను మనమే కాళ్ళతో తొక్కుతూ ముందుకు కదలాల్సి ఉంటుంది. ఆ ప్రాంతంలో నీటిపై తేలియాడే ఈ పడవ ప్రయాణం కూడా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
ఇది కూడా చదవండి : UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు
ఎంట్రీ ఫీజు
కుటుంబంతో కలిసి వేసవి సెలవులను ఆస్వాదించడానికి కాకినాడ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం ఈ ప్రాంతం బెస్ట్ ప్లేసుగా నిలుస్తోంది. ఈ ప్రాంతంలో మొదట పార్క్ కనిపిస్తుంది. ముఖ్యంగా సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో అక్కడికి వెళ్తే, ఆ పార్కులో కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడపవచ్చు. ఈ గ్లాస్ బ్రిడ్జ్‌పైకి వెళ్లడానికి పూర్తిగా ఉచితం. ఈ బ్రిడ్జ్‌ను దాదాపు మొత్తం గ్లాస్‌తోనే నిర్మించారు. బ్రిడ్జ్ పూర్తిగా ఆ గ్లాస్‌తోనే తయారై ఉంటుంది.
ఇది కూడా చదవండి : Azerbaijan అజర్ బైజాన్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? 10 టిప్స్!
గ్లాస్ బ్రిడ్జ్‌పై నడక అనుభవం
గ్లాస్ బ్రిడ్జ్ చుట్టూ ఉన్న అద్భుతమైన సహజ సౌందర్యం, ఈ ప్రాంతాన్ని ఫొటోలు తీసుకోవడానికి ఉత్తమ ప్రదేశంగా మారుస్తుంది. పర్యాటకులు ఈ గ్లాస్ బ్రిడ్జ్ పైకి ఎక్కి దాదాపు బ్రిడ్జ్ పొడవునా నడవవచ్చు. నడుస్తున్నప్పుడు, క్రింద ఉన్న నీరు గ్లాస్ ద్వారా స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా, ఆ నీటిపై ప్రయాణించే పడవలు లేదా షిప్‌లు కూడా గ్లాస్ గుండా స్పష్టంగా కనిపించడం ఒక ప్రత్యేకమైన, థ్రిల్లింగ్ అనుభూతిని ఇస్తుంది. అందువల్ల, ఫొటోలు తీసుకోవడానికి ఇది కాకినాడ ప్రాంతంలోనే ఉత్తమ పర్యాటక కేంద్రంగా మారింది.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
