Goa Trip : గోవా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? జాగ్రత్త..ఈ సారి వెళ్తే అరెస్టయ్యే ఛాన్స్ ఉంది
Goa Trip : సినిమాల్లో చూసినట్లుగా నలుగురు ఫ్రెండ్స్ కలిసి గోవా వెళ్లడం అనేది చాలా మందికి ఒక కల. సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా బ్యాచిలర్స్ ఎక్కువగా గోవా వెళ్లాలని కోరుకుంటారు. కేరళతో (Kerala) సహా విదేశీ పర్యాటకులు కూడా గోవాకు చాలా మంది వస్తుంటారు. అయితే, ఇటీవల గోవా ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం టూరిస్టులకు షాక్ లాంటిది.
గోవా ప్రభుత్వం జలపాతాలు (Waterfalls In Goa), నిరుపయోగంగా ఉన్న క్వారీలు, నదులు, ఇతర నీటి వనరులలో ఈత కొట్టడాన్ని నిషేధించింది. వర్షాకాలం ప్రారంభానికి ముందే ప్రభుత్వం ఈతపై నిషేధం విధించింది. కాబట్టి, ఎవరైనా పర్యాటకులు గోవా వెళితే, అక్కడ ఈత కొట్టడానికి అనుమతించరు. పొరపాటున ఈత కొడితే, చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

ఉత్తర, దక్షిణ గోవా జిల్లాల కలెక్టర్లు ఆదివారం విడుదల చేసిన సర్క్యులర్లో ఈ ఆదేశాన్ని పాటించకపోతే భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 188 ఉల్లంఘనగా పరిగణించబడుతుందని పేర్కొన్నారు. సెక్షన్ 188 మానవ జీవితం, ఆరోగ్యం, భద్రతకు హాని కలిగించే విషయాలకు సంబంధించినది.
ఇది కూడా చదవండి : ప్రపంచ యుద్ధం వస్తే ఈ 10 దేశాలు చాలా సేఫ్
సేఫ్ కాదని… | Goa Travel Tips
గోవా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణం.. జలపాతాలు, నిరుపయోగంగా ఉన్న క్వారీలు, నదులు, సరస్సులు, ఇతర నీటి వనరులలో ప్రజలు కొట్టుకుపోయిన అనేక నివేదికలు ఉన్నాయి. కాబట్టి, అలాంటి నీటి వనరులలో ఈత కొట్టడం సురక్షితం కాదని అధికారులు తెలిపారు. పర్యాటకుల (Goa Tourists) భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి : Egypt Travel Guide: ఈజిప్ట్..ఇక్కడ డబ్బు కట్టి సమాధులను చూస్తారు.. 15 Facts
మానవ జీవితానికి, ప్రజల భద్రతకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండటానికి ఈ విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని సర్క్యులర్లో పేర్కొన్నారు. కాబట్టి మన రాష్ట్రం నుండి, ఇతర రాష్ట్రాల నుండి గోవాకు సరదాగా (Goa Trip ) వెళ్లేవారు ఈ విషయాన్ని మర్చిపోయి ఈత కొట్టవద్దు. అలా చేస్తే, పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటారు. గోవా ట్రిప్ ప్లాన్ (Goa From Hyderbad) చేసుకునేవారు బీచ్లలో తప్ప, ఇతర నీటి వనరులలో ఈత కొట్టకుండా జాగ్రత్త వహించడం మంచిది.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
