ఆకాశంలో మెట్రో రైలు, హైదరాబాద్ కైట్ ఫెస్టివల్‌లో 10 హైలైట్స్ – Hyderabad Kite Festival 2025

షేర్ చేయండి

హైదరాబాద్ వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌కు( Hyderabad Kite Festival 2025) పతంగుల ప్రేమికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ వేదిగా జరుగుతున్న గాలిపటాల వేడుకను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందులో హైలైట్స్ మీకోసం..

ప్రతీ ఏడాది పరేడ్ గ్రౌండ్‌లో ( Kite Festival In Parade Ground 2025 ) వేడుకగా పతంగుల పండగను నిర్వహిస్తారు.
ఈ కైట్ ఫెస్టివల్‌లో పాల్గొనడానికి 20 దేశాల నుంచి ప్రొఫెషనల్ కైట్ ఫ్లైయర్స్ హైదరాబాద్ చేరుకున్నారు.
జనవరి 13 నుంచి 15 వరకు జరిగే వేడుకలో భారీ గాలిపటాలను చూసేందుకు 15 లక్షల మంది పతంగుల ప్రేమికులు, వీక్షకులు, సందర్శకులు వచ్చే అవకాశం ఉంది అని అంచనా వేశారు.
ఈ వేడుకకు హాజరైన సందర్శకులు సరదాగా గాలిపటాలు ఎగురవేసి ఎంజాయ్ చేశారు
ఈ సారి కైట్ ఫెస్టివల్‌లో హైలైట్‌గా నిలిచిన హైదరబాద్ మెట్రో రైలు భారీ గాలిపటం
తెలంగాణ ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ కైట్ ఫెస్టివల్స్ 20 దేశాల నుంచి 50 మంది ఫ్లైయర్స్‌తో పాటు మన దేశంలోని వివిధ భాగాల నుంచి 60 మంది పార్టిసిపెంట్స్ హాజరయ్యారు.
ఇందులో ఎన్నో వెరైటీ గాలిపటాలను ఫ్లైయర్స్ ఎగురవేశారు. అందులో 3డీ పతంగులు కూడా ఉన్నాయి.
ఈ కైట్ ఫెస్టివల్‌లో పాల్గొనడానికి చైనా, థాయ్‌లాండ్. సింగాపూర్, కొరియా, ఆస్ట్రేలియా నుంచి కూడా పార్టిసిపెంట్స్ వచ్చారు. ఇందులలో తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖ తరపున గాలిపటాలను కూడా ఫ్లై చేశారు.ఒడిశా, కేరళ నుంచి కూడా ప్రొఫెషల్ ఫ్లైయర్స్ హాజరయ్యారు.
కేవలం గాలిపటాలు ఎగురవేయడం మాత్రమే కాదు వాటిని ఎలా తయారు చేయాలో నేర్పించేందుకు వర్క్‌షాప్స్ నిర్వహించారు.
| Pandharpur :  ఒక ఆధ్యాత్మిక ప్రపంచం | 7 Temple Darshan In 7 Hours In Pandharpur

Most Popular Stories

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!