నగర ప్రజలకు మెరుగైన రవాణా వ్యవస్థను అందించడంతో పాటు, జాగ్రత్తగా రోడ్డు దాటే విషయంలో (Hyderabad Metro) హైదరాబాద్ మెట్రో కీలక పాత్ర పోషిస్తోంది. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) స్కైవాక్ నెట్వర్క్‌ను వేగంగా విస్తరిస్తోంది. మెరుపువేగంతో మరిన్ని స్కైవాక్స్ నిర్మించేందుకు ప్రైవేట్ సంస్థలతో భాగస్వామ్యాన్ని కోరుకుంటోంది.
ముఖ్యాంశాలు
సురక్షితంగా రోడ్డు దాటేందుకు…
మెట్రో రైల్వే స్టేషన్ నుంచి దగ్గర్లోని కమర్షియల్ కాంప్లెక్స్, లేదా రెసిడెన్షియన్ కాంప్లెక్స్‌కు డైరక్టుగా స్కైవాక్స్ (Skywalk) ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు సురక్షితంగా రోడ్డును దాటే సౌలభ్యం కలుగుతోంది. దీంతో పాటు రోడ్డుపై వెళ్లే వాహనదారులకు కూడా ఇబ్బందులు తగ్గుతున్నాయి. దీంతో పాటు ట్రాఫిక్ జామ్స్, కాలుష్యం కూడా తగ్గుతుంది.
సక్సెస్ అయిన స్కైవాక్స్ | Hyderabad Skywalks
ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎన్నో స్కైవాక్స్ (Hyderabad Skywalks) విజయవంతంగా ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. అందులో ప్రధానమైనవి..
- పంజాగుట్ట, హైటెక్ సిటీ, ఎర్రమంజిల్ స్టేషన్లు : ఈ స్కైవాక్స్ డైరక్టుగా మాల్స్‌తో కనెక్ట్ అయ్యాయి. దీని వల్ల ఈ వాణిజ్య సముదాయాలకు వెళ్లేందుకు ప్రజలకు ఇబ్బందులు తగ్గాయి.
- జూబ్లీ బస్ స్టేషన్, పరేడ్ గ్రౌండ్ స్టేషన్ : ఈ స్కైవాక్స్ వల్ల ప్రయాణికులు రోడ్డు దాటే అవసరం తగ్గుతుంది.
- రాయ్‌దుర్గ్ స్టేషన్ : మెట్రో స్టేషన్‌ను, రహేజా మైండ్ స్పేస్ కాంప్లెక్సును (Raheja Mindspace Complex) కనెక్ట్ చేసే ఒక ఆధునిక స్కై వాక్ ఇది. 11 టవర్లలోని వివిధ ఆఫీసులకు వెళ్లే సదుపాయం కల్పిస్తోంది.
నిర్మాణ దశలో ఉన్న స్కైవాక్ ప్రాజెక్టులు
నగర ప్రజలకు సురక్షితంగా రోడ్డు దాటే సదుపాయం కల్పించే దిశలో పలు కొత్త స్కైవాక్స్‌ను నిర్మిస్తోంది హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ (Hyderabad Metro Rail Limited).
- డా. అంబేడ్కర్ బాలానగర్ స్టేషన్ : ఫీనిక్స్, ల్యాండ్‌మార్క్ మాల్స్‌ను కనెక్ట్ చేసే విధంగా ఉంటుంది అ స్కైవాక్.
- ఎల్బీ నగర్ స్టేషన్ : ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ స్కైవాక్ వల్ల 25 ఎకరాల్లో విస్తరించి ఉన్న వాసవి ఆనంద నిలయం అనే 12 టవర్ల భారీ నివాస సముదాయానికి వెళ్లేందుకు నివాసితులకు సౌలభ్యం కలుగుతుంది.
- ఇది కూడా చదవండి : Metro EV ZIP Vehicles : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, ఇక సొంత వాహనాలతో పనిలేదు
భవిష్యత్తు విస్తరణ పనులు | Hyderabad Metro

ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న స్కైవాక్స్‌తో పాటు మరికొన్ని స్కైవాక్స్‌ను నిర్మించేందుకు ప్రణాళికలు వేస్తోంది హైదరాబాద్ మెట్రో రైల్వే. అవి..
- నాగోల్
- దుర్గం చెరువు
- కూకట్ పల్లి
- ఉప్పల్ స్టేడియం
ఈ స్కైవాక్స్ వల్ల స్థానిక మాల్స్, నివాస భవనాల వైపు వెళ్లాలనుకునే ప్రజలకు సురక్షితంగా రోడ్డు దాటే అవకాశం కలుగుతుంది.
ప్రైవేట్ భాగస్వామ్యానికి ప్రోత్సాహం
స్కైవాక్స్ నిర్మించే దిశలో హైదరాబాద్ మెట్రో వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. అందుకే ప్రైవేట్ డెవెలెపర్స్, రియల్ ఎస్టేట్ సంస్థలతో కలిసి పని చేసేందుకు, వారితో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఆసక్తి ఉన్నవాళ్లు ఎల్ అండ్ టీ మెట్రో రైల్ సంస్థను సంప్రదించాలని కూడా కోరింది. దీని కోసం ఒక నెంబరును కూడా అందుబాటులో ఉంచింది. ఆ నెంబర్ వచ్చేసి : 99000-93820.
స్కైవాక్స్ వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
- భద్రత : స్కైవాక్స్ వల్ల ప్రయాణికులు బిజీ రోడ్డు మధ్య నుంచి వెళ్లే అవసరం ఉండదు. దీని వల్ల ప్రమాదాలు తగ్గుతాయి.
- మెట్రో స్టేషన్ నుంచి మాల్స్, నివాస సదుపాయాలకు డైరక్టుగా వెళ్లే సదుపాయం కలుగుతుంది.
- పట్టణాభివృద్ధి : పట్టణ రవాణా వ్యవస్థను గాడిలో పెట్టి మెరుగైన, సురక్షితంగా రోడ్డు దాటే సదుపాయాన్ని కల్పిస్తుంది స్కైవాక్.
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.