Arunachalam Tour : దసరా సెలవుల్లో అరుణాచలం ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? తెలంగాణ టూరిజం అద్భుత ప్యాకేజీ
Arunachalam Tour : తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవాలనుకుంటున్నారా? దసరా సెలవుల్లో ఆధ్యాత్మిక ప్రయాణానికి ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణ టూరిజం మీకోసం ఒక ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ‘HYDERABAD – ARUNACHALAM’ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ ప్యాకేజీకి సంబంధించిన అక్టోబర్ నెల జర్నీ తేదీలు ఇప్పటికే ప్రకటించబడ్డాయి. హైదరాబాద్ నుండి రోడ్డు మార్గం ద్వారా సాగే ఈ ట్రిప్‌లో కాణిపాకం, అరుణాచలం, శ్రీపురం గోల్డెన్ టెంపుల్‌ల దర్శన సౌకర్యం కల్పిస్తున్నారు. ఈ ప్యాకేజీ వివరాలు, ధరలు , బుకింగ్ విధానం గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
తమిళనాడులోని పుణ్యక్షేత్రం అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (TSTDC) ఒక అద్భుతమైన టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ముఖ్యంగా దసరా సెలవులను సద్వినియోగం చేసుకోవాలనుకునే వారికి ఈ ‘HYDERABAD – ARUNACHALAM’ ప్యాకేజీ మంచి అవకాశం. అక్టోబర్ నెలకు సంబంధించిన ఈ ట్రిప్ తేదీలు ఇప్పటికే ప్రకటించబడ్డాయి.

ప్యాకేజీ తేదీలు, బుకింగ్ వివరాలు:
ఈ ప్యాకేజీ ప్రస్తుతం అక్టోబర్ 3, 2025 తేదీన అందుబాటులో ఉంది. ఒకవేళ ఈ తేదీ మిస్ అయితే, భక్తులు అక్టోబర్ 10, 17, 24 తేదీల్లో కూడా ఈ ట్రిప్‌ను ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ప్యాకేజీని ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. మరింత సమాచారం మరియు అప్డేట్ల కోసం తెలంగాణ టూరిజం అధికారిక వెబ్సైట్ https://tourism.telangana.gov.in/tours ను సందర్శించవచ్చు.
టూర్ షెడ్యూల్: 3 రోజులు, 3 పుణ్యక్షేత్రాలు!
ఈ టూర్ ప్యాకేజీ మూడు రోజులు, మూడు రాత్రుల పాటు ఉంటుంది, ఇందులో ముఖ్యమైన పుణ్యక్షేత్రాలను కవర్ చేస్తారు.
మొదటి రోజు: హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ నుండి సాయంత్రం బయల్దేరుతారు. రాత్రి ప్రయాణం బస్సులో ఉంటుంది.
రెండో రోజు: ఉదయం కాణిపాకం చేరుకుంటారు. 9 గంటల లోపు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దర్శనం పూర్తి చేసుకుంటారు. ఆ తర్వాత తిరువణ్ణామలై (అరుణాచలం)కు బయల్దేరుతారు. మధ్యాహ్నం 3 గంటలకు అరుణాచలం చేరుకుని, అరుణాచలేశ్వరుడి దర్శనం పూర్తి చేసుకుంటారు. రాత్రికి బస అరుణాచలంలోనే ఏర్పాటు చేస్తారు. పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులకు ఇది ఒక గొప్ప అవకాశం.
మూడో రోజు: బ్రేక్‌ఫాస్ట్ తర్వాత వేలూరుకు ప్రయాణమవుతారు. అక్కడ శ్రీపురం గోల్డెన్ టెంపుల్ (మహాలక్ష్మి ఆలయం) దర్శనం ఉంటుంది. సాయంత్రం 4 గంటల తర్వాత హైదరాబాద్‌కు తిరిగి బయల్దేరుతారు.
నాలుగో రోజు: మరుసటి రోజు ఉదయం 5 గంటలకు హైదరాబాద్‌కు చేరుకోవడంతో ఈ టూర్ ప్యాకేజీ విజయవంతంగా ముగుస్తుంది.
ఇది కూడా చదవండి : Sabarimala Facts : 1902 లో కర్పూరం వల్ల అగ్నికి ఆహూతి అయిన శబరిమల ఆలయం… శమరిమలై ఆలయం గురించి 10 ఆసక్తికరమైన విషయాలు
ప్యాకేజీ ధరలు:
భక్తుల రద్దీని, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ టూరిజం ఈ ప్రత్యేక ప్యాకేజీని అందిస్తోంది. ఈ ట్రిప్ ధరలు ఈ విధంగా ఉన్నాయి:
పెద్దవారికి : రూ. 8,000/-
చిన్న పిల్లలకు : రూ. 6,400/-
ఇది కూడా చదవండి : షిరిడీ సమాధి మందిరానికి ముందు అక్కడ ఏముండేది ?
ఈ ప్యాకేజీలో ప్రయాణం, వసతి, దర్శనం ఏర్పాట్లు ఉంటాయి. అయితే, వ్యక్తిగత ఖర్చులు, ఆహారం వంటివి ధరలో చేర్చబడకపోవచ్చు కాబట్టి, బుక్ చేసే ముందు పూర్తి వివరాలను వెబ్సైట్లో పరిశీలించడం మంచిది. తెలుగు రాష్ట్రాల నుండి అరుణాచలం వెళ్లే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో, ఈ ప్యాకేజీ వారికి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.