హైటెక్స్‌లో ప్రారంభమైన India International Travel Mart ప్రదర్శన

షేర్ చేయండి

హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఇండియా ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్ ( India International Travel Mart ) ప్రదర్శన ప్రారంభమైంది. ట్రావెల్, టూరిజం, హాస్పిటాలిటీ రంగాల్లోని పలు ప్రముఖ సంస్థలు ఇక్కడ తమ సేవలను వివరించేందుకు, కొత్త అవకాశాలు అందిపుచ్చుకునేందుకు స్టాల్స్ ఏర్పాటు చేశాయి. ట్రావెల్ ఏజెంట్లకు (travel agents) ఈ ప్రదర్శన సరైన వేదిక అవుతుంది.

ఐఐటీఎమ్ ( IITM) ఏర్పడి 25 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఈ కార్యక్రమం జరగడం విశేషం. ఈ ప్రదర్శనను తెలంగాణ టూరిజం శాఖ డైరెక్టర్ ఐఏఎస్ జెండగె హనుమంతు కొండియా ప్రారంభించారు.ఇది కూడా చదవండి: Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?

India International Travel Mart Exhibition Inaugurated in Hitex 4
పర్యాటక రంగంపై ప్రదర్శన

ఎవరెవరు పాల్గొన్నారు అంటే…

ఈ ప్రదర్శనలో తెలంగాణ రాష్ట్రంలోని ట్రావెల్ ఏజెన్సీలు అండ్ టూర్ ఆపరేటర్స్‌తో పాటు వివిధ రాష్ట్రాల పర్యాటక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణతో పాటు, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మధ్య ప్రదేశ్, గోవా, ఢిల్లీ, కేరళ, ఒడిశా రాష్ట్రాల నుంచే కాకుండా భూటాన్ ( Bhutan ) , థాయ్‌ లాండ్, నేపాల్, టర్కీ, మాల్దీవ్స్, వియత్నాం ( Vietnam ) నుంచి ట్రావెల్ ఏజెన్సీలు, ప్రతినిధులు పాల్గొన్నారు.

India International Travel Mart Exhibition Inaugurated in Hitex 4
ప్రదర్శనలో ఒక స్టాల్ ముందు

10 దేశాలు…20 రాష్ట్రాలు

మొత్తానికి మన దేశంలోని 20 రాష్ట్రాల నుంచే కాకుండా 10 దేశాల ప్రతినిథులు పాల్గొన్నారు. ఆయా దేశాల్లో, రాష్ట్రాల్లో ఉన్న పుణ్య క్షేత్రాలు, పర్యాటక స్థలాలు, అడ్వంచర్ టూరిజం, రిసార్టులు, హెరిటేజ్ సైట్స్ అండ్ హనీమూన్ ప్యాకేజీలతో ( Honeymoon Packages ) పాటు జాతీయ అంతర్జాతీయ డెస్టినేషన్స్ గురించి సందర్శకులకు వివరించారు.

2025 డిసెంబర్ 6వ తేదీన ప్రారంభమైన ఈ ప్రదర్శన డిసెంబర్ 8 వ తేదీ వరకు కొనసాగనుంది.

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!