Visa-Free Travel : వీసా టెన్షన్ అక్కర్లేదు.. పాస్‌పోర్ట్ ఉంటే చాలు.. 59 దేశాలకు ఫ్రీగా వెళ్లిపోవచ్చు
Visa-Free Travel : సాధారణంగా ఏ విదేశానికి వెళ్లాలన్నా వీసా, పాస్‌పోర్ట్ తప్పనిసరి. అయితే, ప్రపంచ దేశాలతో భారతదేశానికి ఉన్న స్నేహపూర్వక సంబంధాల కారణంగా, చాలా దేశాలు భారతీయులకు వీసా అవసరం లేకుండానే తమ దేశంలోకి ప్రయాణించేందుకు అనుమతి ఇస్తున్నాయి. ఈ ఏడాది హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో భారత పాస్‌పోర్ట్ ఏకంగా 77వ స్థానానికి చేరుకుంది. గతంలో 85వ స్థానంలో ఉన్న ర్యాంక్ మెరుగుపడింది. దీని అర్థం, భారత పాస్‌పోర్ట్ కలిగి ఉన్నవారు ఇప్పుడు ఏకంగా 59 దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చు. ప్రధాని మోదీ విదేశీ పర్యటనల సందర్భంగా, భారతీయులకు వీసా-రహిత ప్రయాణాన్ని కల్పించాలని కోరడం, ప్రపంచ దేశాల నుంచి మంచి స్పందన లభించడం ఈ పెరుగుదలకు ప్రధాన కారణం.
ఆసియా ఖండంలో భారతీయులకు వీసా-రహిత దేశాలు
భారతీయ పాస్‌పోర్ట్ ఉన్న ప్రయాణికులు ఆసియా ఖండంలో వీసా లేకుండా పర్యటించడానికి అనేక కొత్త దేశాలు ఈ జాబితాలో చేరాయి. ఆసియాలోని విభిన్న సంస్కృతులను, ఆకర్షణీయమైన గమ్యస్థానాలను అన్వేషించాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశం. ఆసియాలో వీసా ఫ్రీ దేశాలు: భూటాన్, కాంబోడియా, ఇండోనేషియా, జోర్డాన్, కజకిస్థాన్, లావోస్, మకావో, మలేషియా, మాల్దీవులు, మంగోలియా, మయన్మార్, నేపాల్, ఫిలిప్పీన్స్, ఖతార్, శ్రీలంక, థాయిలాండ్, టిమోర్-లెస్ట్.

ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలో అవకాశాలు
జులై 18న విడుదలైన కొత్త జాబితా ప్రకారం, ఉత్తర అమెరికాలో కూడా భారతీయులు వీసా అక్కర్లేకుండా పర్యటించేందుకు అవకాశం లభించింది. బార్బడోస్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, డొమినికా, గ్రెనాడా, హైతి, జమైకా, మాంట్సెరాట్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్ అండ్ ది గ్రెనడైన్స్ వంటి ద్వీప దేశాలు భారతీయ ప్రయాణికులను ఆకర్షిస్తున్నాయి. అదేవిధంగా, దక్షిణ అమెరికాలో కూడా బొలీవియా, ట్రినిడాడ్ అండ్ టొబాగో వంటి కొత్త దేశాలు ఈ జాబితాలో చేరాయి. ఈ అప్డేట్ దక్షిణ అమెరికాలోని సాంస్కృతిక వైవిధ్యం, సహజ అందాలను అనుభవించాలనుకునే వారికి ప్రయాణ ఆసక్తిని పెంచుతోంది.
ఇది కూడా చదవండి : ప్రపంచ యుద్ధం వస్తే ఈ 10 దేశాలు చాలా సేఫ్
ఆఫ్రికా ఖండంలో విస్తరిస్తున్న స్నేహపూర్వక దేశాలు
ఆఫ్రికా దేశాలతో భారతదేశానికి చారిత్రక సంబంధాలు బలంగా ఉన్నాయి. ముఖ్యంగా వైల్డ్‌లైఫ్‌ను, చారిత్రక ప్రదేశాలను సందర్శించాలనుకునే వారికి ఆఫ్రికా మంచి ఆప్షన్. ఈ ఖండంలో వీసా ఫ్రీ ప్రయాణం కల్పించే దేశాల సంఖ్య పెరిగింది. అంగోలా, బురుండి, కేప్ వెర్డే ఐలాండ్స్, కొమోరో ఐలాండ్స్, జిబౌటి, ఇథియోపియా, గినియా-బిస్సావ్, కెన్యా, మడగాస్కర్, మారిషస్, మొజాంబిక్, రువాండా, సెనెగల్, సీషెల్స్, సియెర్రా లియోన్, సోమాలియా, టాంజానియా, జింబాబ్వే వంటి దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి.
ఇది కూడా చదవండి : UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు
ఓషియానియా ద్వీపాల స్వాగతం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో ఓషియానియా ప్రాంతంలోని చిన్న దేశాలు కూడా భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీని ఇవ్వడానికి ముందుకు వచ్చాయి. కుక్ ఐలాండ్స్, ఫిజి, కిరిబాటి, మైక్రోనేషియా, నియూ, పలావు ఐలాండ్స్, సమోవా, టువాలు, వన్వాటూ వంటి అద్భుతమైన సముద్ర తీరాలు, సహజ అందాలు ఉన్న ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ చిన్న ద్వీప దేశాలు భారతీయ పర్యాటకుల రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఎందుకంటే ఇది వారి పర్యాటక రంగాన్ని, తద్వారా వారి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ప్రయాణికులు బయలుదేరే ముందు ఆయా దేశాల తాజా ప్రయాణ మార్గదర్శకాలను తెలుసుకోవడం మంచిది.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.