Rajdhani Express : ఈ రైలులో ప్రయాణం కంటే ఫ్లైట్ బెటర్..రాజధాని ఎక్స్‌ప్రెస్ ఫస్ట్ ఏసీ ఛార్జీలు షాక్ కొట్టేలా ఉన్నాయే!
Rajdhani Express : ప్రయాణాలంటే కాస్త సౌకర్యంగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. అందుకే చాలామంది వేగంగా చేరుకోవడానికి విమాన ప్రయాణాన్ని ఎంచుకుంటారు. అయితే, రైలు ప్రయాణాన్ని ఇష్టపడేవారు కూడా ఉన్నారు. రైలు ప్రయాణం సౌకర్యవంతంగా ఉన్నా, ఎక్కువ సమయం పడుతుంది. ఈ మధ్యే ఒక వ్యక్తి ముంబై నుంచి ఢిల్లీకి తేజస్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణించారు. ఆయన తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకోగా, అది ఒక రకమైన లగ్జరీ ప్రయాణంలా అనిపించింది. ఈ ప్రయాణానికి అయిన ఖర్చు కేవలం రూ. 5500 మాత్రమే అని ఆయన తెలిపారు. రైలులో అందించిన సదుపాయాలు, ఆతిథ్యం తనకు చాలా నచ్చాయని చెప్పారు.
ఫస్ట్ క్లాస్ లగ్జరీ ప్రయాణం
ఆ వ్యక్తి తన వీడియోలో ముందుగా ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ను చూపించారు. అందులో శుభ్రమైన బెడ్షీట్లు, దిండ్లు, అద్దం, న్యూస్‌పేపర్, కంప్లీట్ ప్రైవేట్ స్పేస్ ఉన్నాయి. ప్రయాణం ప్రారంభంలోనే మామిడి జ్యూస్ అందించారు. ఆ తర్వాత టీ, కచోరీ, స్నాక్స్ వడ్డించారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. వేగంగా వెళుతున్న రైలులోనే ఆయన షవర్‌తో స్నానం చేశారు. బాత్రూంలో వాటర్ హీటర్, హ్యాండ్ షవర్, టవల్ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత హాట్ సూప్, చిల్లీ పనీర్ అందించారు.

వంటకాల రుచి, సమయపాలన
సూరత్, వడోదరా దాటేసరికి రాత్రి భోజన సమయం అయింది. భోజనంలో పనీర్ కూర, పప్పు, ఇతర కూరగాయలు, రోటీ, అన్నం, సలాడ్ వంటివి వడ్డించారు. చివరగా ఐస్‌క్రీం కూడా అందించారు. అర్ధరాత్రికి ముందు, ఆయన ఫస్ట్ ఏసీ కారిడార్‌లో నడుస్తూ, తన ప్రైవేట్ క్యాబిన్లో విశ్రాంతి తీసుకున్నారు. ఉదయం మథుర దగ్గర వేడి వేడి టీ అందించారు. అల్పాహారంలో పోహా, ఉప్మా, కట్లెట్స్, అనేక ఇతర వంటకాలు ఉన్నాయి. రైలు ఉదయం 8:30 గంటలకు ఢిల్లీకి సరిగ్గా సమయానికి చేరుకుంది. ఈ వీడియో సెప్టెంబర్ 28న షేర్ చేయగా ఇప్పటివరకు 5 లక్షల వ్యూస్ అందుకుంది.
హైదరాబాద్-ఢిల్లీ ఛార్జీలు
ముంబై-ఢిల్లీ మార్గమే కాకుండా, హైదరాబాద్-ఢిల్లీ మార్గంలో కూడా రాజధాని ఎక్స్‌ప్రెస్ (నం. 22691) అందుబాటులో ఉంది. ఇది ఉదయం 7:15 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5:30 గంటలకు ఢిల్లీకి చేరుకుంటుంది.
ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
టికెట్ ధరలు (దాదాపు):
ఫస్ట్ ఏసీ (1AC): రూ.5865
సెకండ్ ఏసీ (2AC): రూ.4720
థర్డ్ ఏసీ (3AC): రూ.3470
ఫ్లైట్ Vs రైలు పోలిక
కొందరికి ఈ ఛార్జీలు చూస్తే రైలులో వెళ్లడం కంటే విమానంలో వెళ్లడం ఉత్తమమని అనిపించవచ్చు. ఎందుకంటే, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి విమాన ఛార్జీలు కూడా దాదాపు రూ.5500 నుంచి రూ.6000 మధ్యే ఉంటాయి. ప్రయాణ సమయం కేవలం 2 గంటలు మాత్రమే. ముందుగా బుక్ చేసుకుంటే డిస్కౌంట్లు కూడా పొందవచ్చు.
ఇది కూడా చదవండి : Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
ఎవరికి ఏది బెటర్?
రాజధాని ఎక్స్‌ప్రెస్ ఫస్ట్ ఏసీ టికెట్ ఛార్జీ రూ.5865, ప్రయాణానికి దాదాపు 22 గంటలు పడుతుంది. వేగంగా ప్రయాణించాలనుకునే వారికి విమానం అనుకూలంగా ఉంటుంది. కానీ, ఎటువంటి తొందర లేకుండా, ప్రశాంతంగా, సౌకర్యవంతంగా, కుటుంబంతో కలిసి ఆస్వాదిస్తూ ప్రయాణించాలనుకునే వారికి, రాజధాని ఎక్స్‌ప్రెస్ ఫస్ట్ ఏసీ ప్రయాణం చాలా ఉత్తమంగా ఉంటుంది.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.