World Snake Day : అన్ని పాములు విషపూరితం కావు… హైదరాబాద్ జూలో పాములపై అవగాహనా కార్యక్రమం
World Snake Day : ప్రపంచంలో ఉన్న జీవుల్లో మనం బాగా తప్పుగా అర్థం చేసుకునే ప్రాణుల్లో పాములు (Snakes) కూడా ఒకటి. ప్రతీ పాము విషపూరితం (Venomous) అని అనుకుంటారు చాలా మంది. అందుకే పాము కనిపించగానే విపరీతంగా భయపడిపోవడమో లేక దాడి చేయడానికి ప్రయత్నించడమో చేస్తుంటారు.