Indian Travellers : ఏంటో మన ట్రావెలర్స్.. ఛార్జర్లు, బట్టలు మర్చిపోతారు కానీ వీటిని అస్సలు మర్చిపోరు
Indian Travellers : ప్రయాణం అనగానే మనసులో ఒకరకమైన ఉత్సాహం మొదలవుతుంది. కానీ బ్యాగ్ సర్దుకునే సమయంలో మాత్రం ఎంతో గందరగోళం ఉంటుంది. ముఖ్యంగా ఇండియన్ ట్రావెలర్స్ గురించి ఒక కొత్త రిపోర్ట్ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. దాదాపు 40% మంది ఇండియన్స్ ఛార్జర్లు, బట్టలు, చివరికి పెంపుడు జంతువులను కూడా మర్చిపోతున్నారట. కానీ కొన్ని వస్తువులను మాత్రం అస్సలు మర్చిపోరని ఈ రిపోర్ట్ చెబుతోంది. మరి ఇంతకీ ఆ వస్తువులు ఏంటి? ప్రయాణాల్లో మనం ఎక్కువగా మర్చిపోయే వస్తువులేంటి? ఈ విషయాలన్నింటినీ ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
హాలిడే ప్లాన్ చేయడం అంటేనే ఒక సరదా విషయం, కానీ లగేజ్ సర్దుకునేటప్పుడు మాత్రం చాలా గందరగోళం ఉంటుంది. ఈ సమయంలో మనం కొన్ని వస్తువులను మర్చిపోవడం సర్వసాధారణం. అయితే, ఇండియన్ ట్రావెలర్స్(Indian Travellers ) గురించి ఒక సర్వే ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. దాదాపు 40% మంది ఇండియన్స్ ముఖ్యమైన వస్తువులైన బట్టలు, ఛార్జర్లు, చివరికి పెంపుడు జంతువులను కూడా మర్చిపోతున్నారట. కానీ కొన్ని వస్తువులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోరని ఈ రిపోర్ట్ చెబుతోంది.

ప్రయాణాల్లో ఎక్కువగా మర్చిపోయే వస్తువులు
ఈ సర్వే ప్రకారం, ఇండియన్ ట్రావెలర్స్ ఎక్కువగా మర్చిపోయే వాటిలో బట్టలు(Cloths), సాక్సులు ముందు వరుసలో ఉన్నాయి. దాదాపు 42% మంది బట్టలు మర్చిపోయినట్లు చెప్పారు. వీటితో పాటు ఎలక్ట్రానిక్స్ (ఇయర్‌ఫోన్స్, ఛార్జర్లు, పవర్ బ్యాంక్స్) – 37%, టాయిలెట్రీస్ – 36%, కళ్ళద్దాలు – 30%, జ్యువెలరీ, వాచీలు(Watches) – 22%మంది మర్చిపోతున్నామని చెప్పారట. వీటన్నింటి కంటే షాకింగ్ విషయం ఏంటంటే, 17% మంది తమ ఐడీ కార్డులు లేదా పాస్‌పోర్ట్‌లను కూడా మర్చిపోయినట్లు ఒప్పుకున్నారు. ఇవి లేకుండా ప్రయాణం చేయడం అసాధ్యం.
ఇది కూడా చదవండి : ప్రపంచ యుద్ధం వస్తే ఈ 10 దేశాలు చాలా సేఫ్
పెంపుడు జంతువులను కూడా మర్చిపోతున్నారు
అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ సర్వేలో పాల్గొన్న 12% మంది తాము ప్రయాణించేటప్పుడు తమ పెంపుడు జంతువు(Pets)లను మర్చిపోయినట్లు చెప్పారు. హాలిడేకు వెళ్లే చివరి నిమిషంలో ఉన్న ఒత్తిడి, సరిగా ప్లాన్ చేసుకోకపోవడం వంటి కారణాల వల్ల ఇలా జరుగుతుందని రిపోర్ట్ పేర్కొంది. ఇది పెంపుడు జంతువులతో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోందని, కానీ వాటిని జాగ్రత్తగా చూసుకోవడం ఒక సవాలుగా మారిందని కూడా సూచిస్తోంది.
ఇవి మాత్రం అస్సలు మర్చిపోరు!
బట్టలు, ఛార్జర్లు వంటి వాటిని మర్చిపోయినప్పటికీ, ఇండియన్ ట్రావెలర్స్ కొన్ని వస్తువులను మాత్రం కచ్చితంగా వెంట తెచ్చుకుంటారట. అవి టాయిలెట్రీ కిట్లు (షాంపూ, లోషన్స్, బ్రషెస్) – 44%, కాఫీ లేదా టీ బ్యాగ్స్(Tea Bags) – 41%, స్లిప్పర్స్ – 25%. ఈ వస్తువులు ప్రయాణంలో కూడా ఇంటి వాతావరణాన్ని, అలవాట్లను కొనసాగించడానికి సహాయపడతాయి. టీ లేదా కాఫీ తాగడం, స్లిప్పర్స్ వేసుకోవడం వంటి అలవాట్లు మనకు ఒక సౌకర్యవంతమైన అనుభూతిని ఇస్తాయి.
ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
ఇండియన్ ట్రావెలర్స్ గురించి మరో ఆసక్తికరమైన విషయం ఆహారం. ప్రయాణంలో వీరు తినడానికి ఏవి ప్యాక్ చేస్తారో కూడా ఈ సర్వేలో తేలింది. కారా, ఖాఖ్రా, బిస్కట్స్ వంటి డ్రై స్నాక్స్ – 54%, డ్రై ఫ్రూట్స్, నట్స్ – 41%, చాక్లెట్స్, క్యాండీస్ – 39%, ఇంట్లో వండిన పూరీ, పరోటా వంటివి – 37%, టీ లేదా కాఫీ సాచెట్లు – 33% లాంటివి తమ వెంట తీసుకెళ్తారట.
ఈ సర్వే ఫలితాలు ఇండియన్ ట్రావెలర్స్ ఎలాంటి అలవాట్లు కలిగి ఉన్నారో స్పష్టంగా చూపిస్తాయి. ఛార్జర్లు(chargers), బట్టలు మర్చిపోయినప్పటికీ, ఇంటి రుచిని ఇచ్చే ఆహారం, టీ బ్యాగ్స్ వంటి వాటిని మాత్రం కచ్చితంగా వెంట తీసుకెళ్తారు. ఈ అలవాట్లు వారికి ప్రయాణంలో కూడా ఇంటి సౌకర్యాన్ని, అలవాట్లను గుర్తు చేస్తాయి. ప్రయాణంలో జరిగే చిన్న చిన్న పొరపాట్లు కొన్నిసార్లు తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.