ఇంద్రకీలాద్రి వీకెండ్ దర్శనాల్లో కీలక మార్పు | Indrakeeladri Weekend Darshan Update
Indrakeeladri Weekend Darshan Update : బెజవాడ కనకదుర్గమ్మ దర్శనం కోసం అంతరాలయ దర్శనానికి వచ్చే భక్తులపై దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మార్పులు ఏమిటి, వాటిని బట్టి మీ దర్శన ప్లానింగ్ ఎలా ఉండాలో తెలుసుకోండి.
ఇంద్రకీలాద్రిలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వీకెండ్స్, హాలిడేస్‌లో రష్ బాగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడానికి దేవస్థానం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
- ఇది కూడా చదవండి : బెజవాడ కనకదుర్గమ్మ దర్శనం ఎలా బుక్ చేసుకోవాలి? పూర్తి గైడ్
ముఖ్యాంశాలు
అంత్రాలయ దర్శనంలో కీలక మార్పు
| Important Changes In Antralaya Darshan
ప్రతి శుక్ర, శని, ఆదివారాలతో పాటు పండుగలు, పర్వదినాల్లో, ప్రభుత్వ సెలవు రోజుల్లో ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు అంతరాలయ దర్శనాన్ని పూర్తిగా నిలిపివేసింది.
ఈ సమయంలో రూ. 500/- అంతరాలయ దర్శన టికెట్లు విక్రయించరు. ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం భక్తుల రద్దీని సరిగ్గా నిర్వహించడమేనని సమాచారం.
ఈ నిర్ణయం వల్ల దేవస్థానానికి టికెట్ల రూపంలో వచ్చే ఆదాయం తగ్గుతుంది. కానీ సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.
- ఇది కూడా చదవండి : విజయవాడకు దగ్గర్లో కుటుంబ సమేతంగా వెళ్లగలిగే 7 డెస్టినేషన్స్
ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?
| Why this decision?

ఇంద్రకీలాద్రిలో భారీ క్యూ లైన్ల వల్ల సీనియర్ సిటిజన్లు, కుటుంబాలకు వేచిచూడటం సమస్యగా అనిపించేది. మరీ ముఖ్యంగా వీకెండ్స్, ఇతర ప్రముఖ రోజుల్లో ఇది మరింత ఇబ్బందిగా మారేది.
ఇలాంటి సమస్యలను అవాయిడ్ చేయడానికి, సరళమైన, స్మూత్ దర్శనం సామాన్య భక్తులకు అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
- ఇది కూడా చదవండి : ఆవకాయ్ ఫెస్టివల్ అంటే ఏంటి ? | పూర్తి గైడ్ Amaravati Avakai Festival – Complete Guide
భక్తులు ఎలా ప్లాన్ చేసుకోవాలి?
| How should devotees plan now?
ఈ మార్పు పూర్తిగా సామాన్య భక్తుల సౌకర్యం కోసమే. వారి దర్శన అనుభవం మెరుగ్గా ఉండేలా దేవస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ అప్డేట్ ఆధారంగా మీ దర్శనాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
బెస్ట్ టైమ్ (వీకెండ్, హాలిడేస్‌లో)
| Best Time to Visit Bezawada Kanaka Durga Temple
మీరు వీకెండ్స్ లేదా సెలవు రోజుల్లో అమ్మవారి దర్శనం కోసం ప్లాన్ చేస్తుంటే, ఉదయం 10:30 గంటల కంటే ముందే ఆలయానికి చేరుకోవడం మంచిది. లేదా మధ్యాహ్నం 1:30 తరువాత దర్శనం ప్లాన్ చేయండి.
కుటుంబంతో లేదా సీనియర్ సిటిజన్లతో కలిసి వెళ్తుంటే ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 మధ్య సమయాన్ని అవాయిడ్ చేయండి. ఈ సమయంలో సాధారణంగానే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.
వీకెండ్స్ మరియు స్పెషల్ డేస్‌లో (పైన పేర్కొన్న రోజుల్లో) 10:30 నుంచి 1:30 మధ్య సమయంలో రూ. 500/- అంతరాలయ టికెట్లు అందుబాటులో ఉండవు.
కౌంటర్ల వద్ద కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి ముందుగానే సరైన ప్లానింగ్ చేసుకోవడం అవసరం.
ఈజీ దర్శనం ప్లానింగ్ కోసం | Indrakeeladri Weekend Darshan Update
| Simple Darshan Planning Tip
మీకు టైమ్ ఉంటే ఉదయం సమయంలో దర్శనం చేసుకునేందుకు ప్రయత్నించండి. చాలా ప్రశాంతంగా దర్శన అనుభవాన్ని పొందవచ్చు.
అంతగా టైమ్ లేకపోతే మధ్యాహ్నం 1:30 తరువాత దర్శనం చేసుకోవడం బెటర్.
గతంలోలాగా వీకెండ్స్‌లో కూడా అంతరాలయ దర్శనం టికెట్లు ఉంటాయని భావించకుండా, ఈ కొత్త నియమాలను గమనించి ముందస్తు ప్లానింగ్ చేసుకుని వెళ్లండి.
“మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. ఉదాహరణకు : Warangal Prayanikudu ఇలా వెతకండి… తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
