ఇక నిమిషాల్లో ట్రాఫిక్ అప్డేట్స్ తెలుస్తాయి ! ట్రాఫిక్ పల్స్ లాంఛ్ చేసిన సైబరాబాద్ పోలీసులు | Cyberabad Traffic Pulse

షేర్ చేయండి

ట్రాఫిక్ చక్ర వ్యూహంలో చిక్కకుండా ఉండేందుకు సైబరాబాద్ పోలీసులు ఒక కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చారు. అదే సైబరాబాద్ ట్రాఫిక్ పల్స్ ( Cyberabad Traffic Pulse ). ఈ సర్వీస్ వల్ల రియల్ టైమ్‌లో ట్రాఫిక్ అప్టేడ్స్ మీ మొబైల్‌కి అందుతాయి. అది కూడా క్షణాల్లో. ఈ సేవను ఎలా పొందాలి ? దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందామా ?

ట్రాఫిక్‌లో చక్రవ్యూహంలో పడకుండా | Benefits Of Cyberabad Traffic Pulse

ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉండే ప్రధాన సమస్యల్లో ట్రాఫిక్ ఒకటి. రోజు రోజుకూ పెరుగుతున్న వాహనాల సంఖ్య వల్ల కలిగే ట్రాఫిక్ జామ్ గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఒక్కసారిగా భారీ ట్రాఫిక్‌లో చిక్కుకుంటే అభిమన్యుడు చక్ర వ్యూహంలోకి వెళ్లినట్టే ఉంటుంది ప్రయాణికులు పరిస్థితి. 

అయితే ట్రాఫిక్ చక్ర వ్యూహంలో చిక్కకుండా ఉండేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చారు. అదే సైబరాబాద్ ట్రాఫిక్ పల్స్. ఈ సర్వీస్ వల్ల రియల్ టైమ్‌లో ట్రాఫిక్ అప్టేడ్స్ మీ మొబైల్‌కి అందుతాయి. అది కూడా క్షణాల్లో.

క్షణాల్లో ట్రాఫిక్ సమాచారం | Cyberabad Traffic Pulse Launch

సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే దిశలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ( Cyberabad Traffic Police ) సాంకేతిక సాయం తీసుకుంటున్నారు. అందులో భాగంగా సైబరాబాద్ ట్రాఫిక్ పల్స్ అనే పేరుతో ఒక సేవను ప్రారంభించారు. ట్రాపిక్ పోలీస్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఈ సేవలను ప్రారంభించారు. టాన్లా సంస్థ డెవెలెప్ చేసిన ఈ యాప్ వల్ల ట్రాఫిక్కు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు వాహనదారులకు చేరుతుంది.

Cyberabad Traffic Pulse Service
| సైబరాబాద్ పోలిస్

దీంతో పాటు ట్రాఫిక్ నియత్రణ, రద్దీ నిర్వహణ, నియంత్రణ చేసేందుకు సౌలభ్యం లభిస్తుంది. అంతే కాకుండా రియల్ టైమ్‌లో వాహనదారులకు ట్రాఫిక్ అప్డేట్స్ అందుతాయి. మీరు వెళ్తున్న దారిలో రోడ్డు మూసివేసి ఉన్నా, ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నా, యాక్సిడెంట్ జరిగినా, రోడ్డు డైవర్షన్ ఉన్నా ఏదైనా కార్యక్రమం జరుగుతున్నా ఇలాంటి అనేక మార్పులు మీకు వెంటనే మీ వాట్సాప్‌ లేదా గూగుల్ ఆర్సీఎస్, ఎస్మెమ్మెస్, ఫ్లాష్ మెసేజ్ రూపంలో అందుతుంది. ఈ ఐడియా అదిరింది కదా.

అన్నా మస్తు ట్రాఫిక్ ఉంది..

చాలా సార్లు మనం తెలియకుండానే ట్రాఫిక్‌లో చిక్కుకుపోతాం. అరే ఈ రోడ్డులోకి వచ్చే ముందే తెలిస్తే బాగుండూ అనుకుంటాం. మరికొన్ని సార్లు మనకు ఎదురు వచ్చే ప్రయాణికులు అన్నా అటు వెళ్లకు మస్తు ట్రాఫిక్ ఉంది అంటారు. అయితే ఇలా అన్ని సార్లు మనకు చెప్పే వాళ్లు ఉండరు కాబట్టి దానికి పరిష్కారమే ఈ సైబరాబాద్ ట్రాఫిక్ పల్స్.

ఈ యాప్ ప్రత్యేకలు | Cyberabad Traffic Pulse Benefits

సైబరాబాద్ పరిధిలో ఉన్న వాహనదారులు, ప్రయాణికుల కోసం రూపొందించిన ఈ యాప్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అందులో కొన్ని…

  • ట్రాఫిక్ అప్డేట్ : ప్రధాన రహాదారుల్లో ట్రాఫిక్ ఎలా ఉందో మీకు వివరాలు అందుతాయి. రూట్ ఛేంజ్ చేయాల్సి ఉన్నా తెలుస్తుంది. మీకు కంప్లీట్ గైడెన్స్ అందుతుంది.
  • ఖచ్చితత్వం : ఒక వేళ ట్రాఫిక్ జామ్ ఏర్పడితే పరిస్థితి సాధారణం అవ్వడానికి ఎంత టైమ్ పడుతుందో సరైన వివరాలు టైమ్‌‌తో సహా అందుతాయి.
  • ట్రాఫిక్ పోలీసులతో ఛాట్ : ఒక వేళ ట్రాఫిక్ గురించి లేదా ఇతర ట్రాఫిక్ సంబంధిత సమస్యలు ఉంటే మీరు వెంటనే వాట్సాప్ ద్వారా ట్రాఫిక్ పోలీసులకు తెలపవచ్చు. వారితో చాట్ చేయవచ్చు.
  • పర్సనల్ అప్డేట్స్ : మీ జర్నీకి సంబంధిచి రూట్లో అవసరమైన ట్రాఫిక అప్డేట్స్ పొందే అవకాశం ఉంది.
ఈ సర్వీసులను ఎలా పొందాలి ? | How to Subscribe To Cyberabad Traffic Pulse

సైబరాబాద్ ట్రాఫిక్ పల్స్ సేవలు పొందేందుకు మీరు క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయవచ్చు లేదా ఈ కింది లింకు ద్వారా వెబ్‌సైట్‌ను విజిట్ చేయాల్సి ఉంటుంది. 

  • క్యూఆర్ కోడ్ :
Cyberabad Traffic Pulse Service Subscribe
| పై ఫోటోలో కనిపిస్తున్న ఫోటోలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయవచ్చు.

లేదంటే మీరు వెబ్‌సైట్‌ను కూడా విజిట్ చేయవచ్చ.

కోడ్ స్కాన్ చేసినా లేక లింకుపై క్లిక్ చేసినా వెంటనే వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది.

అక్కడ మీరు ఏం చేయాలో సులభంగా అర్థం అయ్యే విధంగా వివరాలు ఉంటాయి. రిజిస్ట్రేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ పూర్తి అయిన వెంటనే మీకు ట్రాఫిక్ అప్టేట్స్ రావడం మొదలవుతుంది.

ఈ సర్వీసు వల్ల సైబరాబాబ్ వాహనదారులకు ఏ విధమైన ప్రయోజనం కలుగుతుందో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి మాటల్లో…”సైబరాబాద్ ట్రాఫిక్ పల్స్‌ను ప్రవేశపెట్టడం ద్వారా నగర ప్రయాణికుల కోసం ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు, సమయాన్ని ఆదా చేసేందుకు మేము కట్టుబడి ఉన్నాము.ఈ విప్లవాత్మక సేవను ప్రారంభించేందుకు మాకు తోడ్పడిన SCSC, టాన్లా ప్లాట్‌ఫార్మ్స్ లిమిటెడ్‌కు మా ప్రత్యేక కృతజ్ఞతలు.” అని అయన తెలిపారు.

అసలు ట్రాఫిక్ పల్స్ అంటే ఏంటి ? What Is Cyberabad Traffic Pulse ?

సైబారాబాద్ ట్రాఫిక్ పల్స్ అనే సర్వీసును ప్రయాణికులకు ట్రాఫికి అప్డేట్స్ ఇవ్వడానికి సైబరాబాద్ పోలీసులు ప్రారంభించారు. దీని వల్ల మీకు రియల్ టైమ్‌లో ట్రాఫిక్ అప్డేట్స్ వస్తాయి. దీని వల్ల మీ సమయం ఆదా అవుతుంది. 

ఈ సర్వీసు పొందడం ఎలా? How To Use Cyberabad Traffic Pulse

సైబరాబాద్ ట్రాఫిక్ పల్స్ సర్వీసులను పొందేందుకు మీరు ఈ లింకుపై క్లిక్ చేసి తరువాత రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. తరువాత మీకు అప్డేట్స్ వస్తుంటాయి.

  • వెబ్‌సైట్ : https://cyberabadtrafficpulse.telangana.gov.in 
ఈ యాప్ ఎక్కడ టౌన్‌లోడ్ చేసుకోవాలి ? is Cyberabad Traffic Pulse an App ?

సైబరాబాద్ పోలీస పల్స్ అనేది యాప్ కాదు. మీరు రిజిస్టర్ చేసుకుంటే మీకు వాట్సాప్, గూగుల్ ఆర్సీఎస్, ఎస్మెమ్మెస్, ఫ్లాష్ మెసేజ్ రూపంలో సమాచారం అందుతుంది. 

ఈ సర్వీసు ఉచితమా ? | Is Cyberabad Traffic Pulse Is Free To Use?

ఈ సర్వీసుల పూర్తిగా ఉచితంగా అందిస్తారు. ఎలాంటి డబ్బు చెల్లించే అవసరం లేదు.

ఎలాంటి అప్టేట్స్ ట్రాఫిక్ పల్స్ ద్వారా అందుతాయి ?
  • మెయిన్ రోడ్డులో ట్రాఫిక్ పరిస్థితి ఎలా ఉంది.
  • ఏదైనా రోడ్డు మూసి వేసినా, దారి మళ్లింపులు జరిగినా
  • ఒక దారిలో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నా
  • ఏవైనా కార్యక్రమాలు, ర్యాలీల వంటివి జరిగినా మీ టైమ్ వేస్టు కాకుండా ఉండేందుకు మీకు ముంద్తుగానే సమాచారం అందుతుంది .
నా ఏరియా నేను సెలక్ట్ చేసుకోవచ్చా ?

అవును, మీ ప్రాంతాలను మీరు ఎంచుకోవచ్చు

మరి నా పర్సనల్ వివరాలకు భద్రత ఉంటుందా ?

ప్రయాణికులు అందించే వ్యక్తిగత సమాచారాన్ని సైబరాబాద్ పోలీసు విభాగం ఏ సంస్థతో పంచుకోదు అని తెలిపింది.

ఈ సర్వీసు ఆపేయాలి అనుకుంటే ఎలా ? | How To Unsubscribe Hyderabad Traffic Pulse Service

మీరు రిస్ట్రేషన్ కోసం క్లిక్ చేసిన వెబ్‌సైట్‌కే మీరు వెళ్లి అక్కడ అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. 

ఈ సర్వీసులో ఇతరులను భాగం చేయవచ్చా?

పైన ఉన్న లింకు పంపించి ఎవరినైనా ఈ సేవను వినియోగించేలా ప్రోత్సాహించవచ్చు.

ట్రాఫిక్ పోలీస్ పల్స్‌కు సంబంధించిన సమస్యలు ఉంటే ఎవరికి కాంటాక్ట్ చేయాలి ?

సైబరాబాద్ పోలీస్ పల్స వెబ్‌‌సైట్‌ ద్వారా కాంటాక్ ఫామ్ నింపవచ్చు లేదా సైబరాబాద్ ట్రాఫిక్ పోలిస్ హెల్ప్‌లైన్‌ నెంబర్లకు కాల్ చేయవచ్చు

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!