ద్వారపూడిలో 60 అడుగుల భారీ ఆదియోగి విగ్రహం, విశేషాలు, గైడ్ | Dwarapudi Adiyogi Statue

షేర్ చేయండి

ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఆదియోగి విగ్రహం (Dwarapudi Adiyogi Statue) ప్రారంభోత్సవానికి సిద్ధం అవుతోంది. ఆంధ్రా శబరిమలగా ప్రసిద్ధిగాంచిన ద్వారపూడి ఆయ్యప్ప ఆలయం ప్రాంగణంలో 60 అడుగుల భారీ విగ్రహాన్ని నిర్మించారు. దీంతో మూడవ అతిపెద్ద ఆదియోగి విగ్రహంగా (Third Biggest Adiyogi Statue) చరిత్రపుటల్లోకి ఎక్కనుంది. 

ప్రస్తుతం బెంగూళూరుతో (Benguluru Adiyogi Statue) పాటు కొయంబత్తూరులో 112 అడుగుల భారీ ఆదియోగి విగ్రహాలు ఉన్నాయి. పర్యాటకులు అధిక సంఖ్యలో ఇక్కడికి వెళ్తుంటారు.

విగ్రహం ప్రత్యేకతలు | Dwarapudi Adiyogi Statue Significance

తమిళనాడులోని కొయంబత్తూరులో 112 అడుగుల ఎత్తు 82 అడుగుల వెడల్పుతో ఉన్న భారీ ఆదియోగి విగ్రహం గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు. అయితే ఇకపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే అత్యంత ఎత్తైన ఆదియోగి విగ్రహాన్ని చూడటానికి కూడా చాలా మంది పర్యాటకులు రానున్నారు.

ఈ విగ్రహం ఎత్తు 60 అడుగు, వెడల్పు 100 అడుగులు ఉంటుంది. ద్వారపూడిలోని అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న (The Dwarapudi Ayyappa Swamy Temple) ఈ భారీ విగ్రహాన్ని 2025 ఫిబ్రవరి 26వ తేదీన శివరాత్రి సందర్భంగా ఆవిష్కరించనున్నారు.

అద్భుతమైన శిల్పకళ | Dwarapudi Adiyogi Statue Craftsmanship and Design

కొయంబత్తూరులోని (Coimbatore) 112 అడుగుల ఎత్తైన ఆదియోగి విగ్రహానికి ప్రతీరూపంగా, అపురూపంగా ద్వారపూడి ఆదియోగి విగ్రహాన్ని నిర్మించారు. ఈ భారీ విగ్రహాన్ని బిక్కవోలు మండలంలోని కోమరిపాలెంకు చెందిన శిల్పకారులైన పెద్ద రాఘవ 10 నెలల్లో పూర్తి చేశారు.

విగ్రహాన్ని నిశితంగా పరిశీలిస్తే చిన్న చిన్న డీటెయిల్స్ విషయంలో కూడా శిల్పి తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టు గమనించవచ్చు. ఈ విగ్రహం కేవలం శిల్పకళకు తార్కాణం మాత్రమే కాదు…ఆధ్యాత్మికతకు కూడా ప్రతిరూపంగా నిలుస్తోంది.

నిర్మాణం, వ్యయం 

ఆలయ గురుస్వామి ఎస్‌ఎల్ కనకరాజు తెలిపిన వివరాలు ప్రకారం ఈ భారీ విగ్రహాన్ని విరాళాలు సేకరించి రూ.20 లక్షలతో నిర్మించారట. ఈ విగ్రహ నిర్మాణంలో సిమెంటునే ప్రధానంగా వినియోగించారు. దీంతో పాటు ఎక్కువ కాలం మన్నికగా ఉండే విధంగా, చూడటానికి అందంగా, ఆకర్షణీయంగా కనిపించే విధంగా, ఆలయ వైభవం ఉట్టిపడే విధంగా ఉండే మెటీరియల్‌ను వినియోగించారు.

ఆధ్యాత్మిక ప్రాధాన్యత

Dwarapudi Adiyogi Statue
ద్వారపూడి అయ్యప్ప ఆలయం

నూతనంగా ఏర్పాటు అయిన ఆదియోగి విగ్రహంతో పాటు ఇక్కడ ప్రముఖ రుషులు, మునుల విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఆలయ ప్రాంగణంలో పరమశివుడు, శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ  విగ్రహం రాకతో భవిష్యత్తులో ఇక్కడికి భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. 

ఈ ఆలయం ఎక్కడుంది ? ఎలా చేరుకోవాలి ? | How To Reach  Dwarapudi Adiyogi Statue

ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోన సీమ (Konaseema District) జిల్లాలోని ద్వారపూడిలో సామర్ల కోట కాలువ రోడ్డులో ఉంటుంది. రాజమహేంద్రవరానికి ఈ ఆలయం 20 కిమీ దూరంలో ఉంటుంది. ఆనపర్తికి 2 కిమీ దూరంలో మాత్రమే ఉంటుంది. 

కొత్తా ఏర్పాటు అయిన ఆదియోగి విగ్రహం (Adi yogi Statue) అనేది కేవలం ఆలయానికే కాదు కోనసీమకే హైలైట్‌గా నిలవనుంది. భారతీయ వారసత్వం (Indian Heritage) విశిష్టత గురించి తెలుసుకోవాలనుకునే తెలుగు వారితో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న పర్యాటకులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. కోనసీమలో పర్యాటకానికి ఊతం ఇస్తుంది ద్వారపూడి ఆదియోగి విగ్రహం.

📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!