Kakinada Rural Beach : వీకెండ్ వచ్చిందంటే ఈ బీచ్ రద్దీ మామూలుగా ఉండదు.. జనసందోహంతో పండగ వాతావరణం!
Kakinada Rural Beach : వీకెండ్ వచ్చిందంటే రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ఒక తీర ప్రాంతం జనసందోహంతో కళకళలాడుతుంది. పండుగ వాతావరణాన్ని తలపించేలా వేల సంఖ్యలో ప్రజలు ఈ కోస్తా ప్రాంతానికి తరలివస్తారు. దీనితో చుట్టుపక్కల ఉన్న పార్కులు, ప్రత్యేక స్థలాలు కూడా సందర్శకులతో నిండిపోతాయి. ఇంతకీ ఆ తీర ప్రాంతం ఎక్కడ ఉంది, అక్కడ ఏ ఏ ఆకర్షణలు ఉన్నాయి, ఎలాంటి ఆహార పదార్థాలు దొరుకుతాయి అనే వివరాలు తెలుసుకుందాం.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల (East Godavari District) పరిధిలోని కాకినాడ రూరల్ తీర ప్రాంతం ప్రస్తుతం పర్యాటక కేంద్రంగా మారింది. వీకెండ్ వచ్చిందంటే చాలు, ఈ ప్రాంతం మొత్తం పండుగలా కళకళలాడుతూ ఉంటుంది.
వేల సంఖ్యలో సందర్శకులు ఈ తీరాన్ని చేరుకుంటారు. రాష్ట్రంలో చాలా తీర ప్రాంతాలు ఉన్నప్పటికీ, ఉప్పాడ బీచ్ తర్వాత కాకినాడ రూరల్ బీచ్‌కు (Kakinada Rural Beach) ప్రజలు భారీగా తరలివస్తారు. ఉప్పాడ బీచ్ రోడ్డు, అక్కడి రాళ్లు కూడా ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ, రద్దీ మాత్రం కాకినాడ రూరల్ తీరంలో ఎక్కువగా కనిపిస్తుంది.

కాకినాడ రూరల్ బీచ్ చుట్టూ ఉన్న ఆకర్షణలు ఈ ప్రాంతానికి రద్దీ పెంచడానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. నగరవాసులు తమ కుటుంబాలతో కలిసి సాయంత్రం 3 గంటల సమయానికి కాకినాడ రూరల్ బీచ్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న పార్కులను సందర్శిస్తూ తమ వీకెండ్‌ను ఆహ్లాదంగా (AP Weekend Tour) గడుపుతారు. ఈ బీచ్‌కు వెళ్లే దారిలో శిల్పారామం గ్లాస్ బ్రిడ్జితో పాటు అనేక పార్కులు, ప్రత్యేక తోటలు ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నీ సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.
ఇది కూడా చదవండి : Kamakhya Temple : కామాఖ్య దేవీ కథ
ఈ ప్రాంతంలో పర్యాటకులు (Tourists) ఫొటోలు, వీడియోలు తీసుకోవడానికి అనువైన అందమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఈ అందమైన ప్రదేశాలలో పర్యాటకులు ఉత్సాహంగా ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ తమ సమయాన్ని గడుపుతారు. ముఖ్యంగా శిల్పారామం ప్రాంతం అత్యుత్తమ ఫొటోలు మరియు వీడియోలు తీసుకోవడానికి అనువైన ప్రదేశంగా పేరు పొందింది.
ఇది కూడా చదవండి : Thanjavur : ఈ ఆలయం నీడ నేలపై పడదు
సందర్శకులు తీర ప్రాంతాన్ని ఆస్వాదించడంతో పాటు, అక్కడ దొరికే ప్రత్యేకమైన ఆహార పదార్థాలను కూడా ఇష్టపడతారు. పర్యాటకుల కోసం, ఈ కోస్తా ప్రాంతంలో (Coastal Andhra) వేడి వేడిగా, కారంగా ఉండే చిక్కుడు కాయ గింజలు, అలాగే చల్ల పలుకులు (వీటిని చలికాలం తింటే మరింత బాగుంటాయి), టేగలు వంటి ఆరోగ్యకరమైన వంటకాలు లభిస్తాయి.
కుటుంబంతో వచ్చిన పర్యాటకులందరూ ఈ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుని, ఆ ప్రాంతంలో ఉల్లాసంగా సమయాన్ని గడుపుతారు. పండుగ సమయం కాకపోయినా, వీకెండ్లో కాకినాడ బీచ్ ప్రాంతం పండుగలా సందడిగా కనిపిస్తుంది.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
