కిన్నోర్ కైలాస పర్వతాల మధ్య ఒక ప్రశాంత ప్రపంచం | Kalpa Village Travel
Kalpa Village Travel : హిమాచల్ ప్రదేశ్‌లోని కాల్పా అనే చిన్న గ్రామం ఒక నేచురల్ వండర్లా అనిపిస్తుంది. చుట్టూ కిన్నోర్ కైలాష్ పర్వతాలు గర్వగా నిలబడిన తీరు, ఈ సీన్ చాలా అందంగా ఉంటుంది.
మార్నింగ్ సమయంలో పీక్స్‌పై పడిన భానుడి కిరణాల వెలుగు చూస్తే ఒక నిర్మలమైన, దివ్యమైన దృశ్యంలా అనిపిస్తుంది.
మబ్బులు కొంచెంగా పర్వతాల మధ్య తిరుగుతూ ఉంటే ఈ సీన్స్ ఒక పెయింటింగ్‌లా కనిపిస్తుంది. ప్రకృతితో కలిసిన ఈ ప్రదేశం మనసుకు ప్రశాంతతను ఇస్తుంది.
నిదానమైన జీవితం | Life In Kalpa
ఇక్కడ జీవితం చాలా సింపుల్ ,నిధానంగా ఉంటుంది. చిన్న ఇళ్లు, ఆపిల్ తోటలు, తాజా గాలుల మధ్య ఒక కామ్ రిథమ్ ఉంటుంది. ప్రతీ రోజు ఒక రొటీన్ లైఫ్ స్టైల్లా కాకుండా ఒక భిన్నమైన అనుభూతిలా అనిపిస్తుంది. లోకల్ వీధుల్లో నడుస్తూ ఉంటే గ్రామ జీవితంలో ఉన్న సింప్లిసిటీ, మంచి మనసులు కనిపిస్తాయి.

- ఇది కూడా చదవండి : జమ్మూ అండ్ కశ్మీర్‌కు ఆ పేర్లు ఎలా వచ్చాయి ? భారత దేశ సంస్కృతిలో ప్రాధాన్యత ఏంటి ? | Jammu and Kashmir
ఇక్కడ సమయం కొంచెం స్లోగా నడుస్తుందనే భావన కలుగుతుంది. సిటీ జీవితం నుండి దూరంగా ఉన్న ఒక పీస్ఫుల్ వరల్డ్‌లా ఉంటుంది.
సాయంత్రం సమయంలో పర్వతాల వెనక సూర్యాస్తమం చూస్తే ఆ ఆకాశం ఆరెంజ్, పింక్ షేడ్స్‌తో మారిపోతుంది. ఆ క్షణంలో కలిగే సైలెన్స్, ప్రశాంతత ట్రావెల్ ఎక్స్‌పీరియెన్స్‌ని మరింత ప్రత్యేకంగా మార్చేస్తాయి.
The festival of fairies- RAULANE🧚♀️🧚♀️
— Jaya_Upadhyaya (@Jayalko1) March 14, 2026
Ever heard about this??
This is an ancient, 5,000-year-old festival of Kalpa and Kothi in Kinnaur (HP). It honours the "Saunis" (celestial fairies) believed to protect the villagers.
The festival features a symbolic, masked marriage… pic.twitter.com/Jk19PqlKkj
హైదరాబాద్ నుండి ఎలా చేరాలి? | Hyderabad to Kalpa Travel
హైదరాబాద్ నుండి ముందుగా ఢిల్లీ నుంచి ఫ్లైట్‌లో చేరుకొని, అక్కడి నుండి రోడ్డు మార్గంలో కాల్పాకు చేరుకోవచ్చు. ఈ ప్రయాణంలో హిమాలయన్ దృశ్యాలు, నదులు, లోయలు చూస్తూ సాగుతుంది. ఈ జర్నీని మరపురాని అనుభవంగా మార్చేస్తుంది.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.







