బెజవాడ కనకదుర్గమ్మ దర్శనం ఎలా బుక్ చేసుకోవాలి? పూర్తి గైడ్ | Kanakadurga Darshan Online Booking
Kanakadurga Darshan Online Booking : ఈ గైడ్లో ఆన్లైన్ టికెట్ బుకింగ్, సేవా కేంద్రాల లొకేషన్లు, క్యాష్‌లెస్ పేమెంట్స్, కుటుంబాలు, పెద్దలకు ఉపయోగపడే చిట్కాలను క్లియర్‌గా వివరిస్తున్నాము.
ఇంద్రకీలాద్రిపై (Indrakeeladri) ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. క్యూలైన్లో వెయిటింగ్, క్యాష్ హ్యాండ్లింగ్, దళారుల సమస్యలను ఎవాయిడ్ చేయడానికి దేవస్థానం డిజిటల్ వ్యవస్థను బలోపేతం చేస్తోంది.
ముఖ్యాంశాలు
కనకదుర్గ దర్శనం టికెట్లు ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలి?
How to Book Kanakadurga Darshan Tickets Online
అమ్మవారి దర్శనం టికెట్లను ముందుగానే అడ్వాన్స్ బుక్ చేసుకోవచ్చు. ఇది ముఖ్యంగా వీకెండ్స్, పండగలు, సెలవుల్లో చాలా ఉపయోగపడుతుంది.
ఆన్లైన్ బుకింగ్ కోసం అధికారిక వెబ్‌సైట్స్:
బుకింగ్ టిప్స్ | Booking Tips:
- దర్శనం సమయం, తేదీ స్లాట్స్ ముందే సెలెక్ట్ చేయాలి.
- బుకింగ్ కన్ఫర్మ్ అయిన తర్వాత వచ్చే SMS లేదా దాని స్క్రీన్‌షాట్‌ను సేవ్ చేసుకోండి.
- సోమవారం నుంచి శుక్రవారం వరకు, అలాగే ఉదయం వేళలో రద్దీ తక్కువగా ఉంటుంది.
- వాట్సాప్ గవర్నెన్స్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. సాంకేతికతను వినియోగించుకునే భక్తులకు ఇది ఉపయోగపడుతుంది.
- ఇది కూడా చదవండి : విజయవాడకు దగ్గర్లో కుటుంబ సమేతంగా వెళ్లగలిగే 7 డెస్టినేషన్స్
డబ్బు తీసుకెళ్లే అవసరం లేదు | Cashless Payments

దర్శనం టికెట్లు, సేవలు, పూజలు, డొనేషన్లు అన్నీ కూడా మీరు UPI, Google Pay, PhonePe, డెబిట్ / క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించవచ్చు.
ఆలయ ప్రాంగణంలో ఉన్న కౌంటర్లలో కూడా క్యాష్‌లెస్ పేమెంట్స్ (పైన పేర్కొన్న చెల్లింపు విధానాలు) స్వీకరిస్తారు. ఈ విధానం వల్ల మీ సమయం ఆదా అవుతుంది. అలాగే ఇది పారదర్శకతను పెంచుతుంది.
Online Seva Kendralu ఎక్కడ ఉన్నాయి?
దర్శనం, సేవా టికెట్ల కోసం ఆలయ ప్రాంగణంలో అనేక సేవా కేంద్రాలు ఉన్నాయి.
- కొండ పాద భాగంలో ఉన్న అర్జున వీధి స్టార్టింగ్ పాయింట్
- మహా మండపం
- ఓం టర్నింగ్ పాయింట్ (కొండపై)
- ప్రోటోకాల్ ఆఫీసర్ కార్యాలయం
- డోనర్ సెల్
ఈ కేంద్రాల్లో దర్శనం టికెట్లు, పూజా సేవా టికెట్లు, విరాళాలు, డిజిటల్ సేవలు లభిస్తాయి. పెద్దలకు, మొదటిసారి దర్శనం కోసం వెళ్లే వారికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి.
- ఇది కూడా చదవండి : వైజాగ్ నుంచి లంబసింగి ఎంత దూరం ? బెస్ట్ రూట్ ఏంటి ? Vizag To Lambasingi Distance Route Travel Time
భక్తులకు ఉపయోగపడే సూచనలు | Useful Tips
అమ్మవారి దర్శనం కోసం వెళ్లే ముందు కొన్ని చిట్కాలను పాటిస్తే మీ ప్రయాణం సాఫీగా సాగుతుంది:
- క్యూలైన్లో వెయిటింగ్ సమయాన్ని తగ్గించుకోవడానికి ఆన్లైన్ బుకింగ్ చేసుకోండి.
- ఉదయం వేళలో దర్శనం చేసుకోవడం ఉత్తమం.
- కొండ పాద భాగంలో ఉన్న సేవా కేంద్రాల సహాయాన్ని తీసుకోవచ్చు.
- క్యాష్‌లెస్ పేమెంట్స్ వల్ల కౌంటర్ల వద్ద గందరగోళం ఉండదు.
- దళారుల సమస్యను ఎవాయిడ్ చేయడానికి అధికారిక వెబ్‌సైట్స్, కౌంటర్లను మాత్రమే వినియోగించండి.
ఈ విధంగా ప్లాన్ చేస్తే, మీరు సంవత్సరంలో ఎప్పుడు వెళ్లినా అమ్మవారి దర్శనాన్ని ప్రశాంతంగా చేసుకోవచ్చు.
“మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. ఉదాహరణకు : Warangal Prayanikudu ఇలా వెతకండి… తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
