Laknavaram Third Island : మాల్దీవ్స్‌ను తలపిస్తున్న లక్నవరం థర్డ్ ఐల్యాండ్

షేర్ చేయండి

తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్స్‌లో లక్నవరం కూడా ఒకటి. ఇక్కడి చెరువును, దానిపై ఉన్న కేబుల్ బ్రిడ్జి చూడటానికే కాదు ఈ మధ్యే ఓపెన్ అయిన థర్డ్ ఐల్యాండ్‌ను‌ ( Laknavaram Third Island ) చూడటానికి కూడా చాలా మంది వెళ్తున్నారు. మరి అలాంటి అందమైన ఐల్యాండ్ ఎలా ఉంది ఒకసారి చూసేయండి.

Prayanikudu whatsapp
| ప్రయాణికుడు వాట్సాప్ గ్రూపులో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
How To Reach Laknavaram : తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉంది లక్నవరం. ఇక్కడ గోవిందరావుపేటలో ఉన్న లక్నవరం చెరువును చూడటానికి సందర్శకులు దూరదూరం నుంచి వస్తుంటారు. మీరు వరంగల్ నుంచి ములుగుకు చేరుకుని అక్కడి నుంచి లక్నవరం వైపు రావచ్చు.
Islands on Laknavaram : కాకతీయల కాలం నాటి ఈ చెరువు ప్రకృతి అందాలకు నెలవు. ఇక్కడ మొత్తం 13 ద్వీపాలు ఉన్నాయి. అందులో కేవలం రెండు మాత్రమే పర్యాటకులకు అందుబాటులో ఉండేవి.
మూడు ఎకరావిస్తీర్ణంలో ఉన్న ఈ ద్వీపాన్ని తెలంగాణ టూరిజం శాఖ, ప్రీకోట్స్ సంస్థ సంయుక్తంగా రూ.7 కోట్ల రూపాయలతో డెవలప్ చేశారు
Third Island Laknavaram:ఇటీవలే మూడవ ఐల్యాండ్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఇందులో రిస్టార్ట్స్ అండ్ రిక్రియేషన్ సెంటర్స్ ఏర్పాటు చేశారు.
చుట్టూ అందమైన ప్రకృతి, నీటి మధ్యలో ఒక చిన్న ద్వీపం అందులో బ్యూటిఫుల్ రిసార్ట్స్, ప్రపంచంతో కొంత సమయం డిస్‌కనెక్ట్ అవ్వడానికి ఇంతకు మించిన స్పాట్ ఏముంటుంది
లక్నవరంలో ఉన్న మూడవ ఐలాండ్‌ను ది కోవ్ రిసార్ట్ ( The Cove Resort ) అని కూడా పిలుస్తారు. ఈ రిసార్టు‌ను దూరం నుంచి చూస్తే మాల్దీవ్స్‌లో ఉన్న అనుభూతి కలుగుతుంది.
Where is Laknavaram Third Island: ములుగు జిల్లాలోని గోవిందరావుపేట బుస్సాపూర్‌లో ఉంది లక్నవరం. ఇక్కడ మూడవ ఐల్యాండ్‌లో మొత్తం 21 కాటేజీలను నిర్మించారు. 2024 నవంబర్ నుంచి ఇది సందర్శకులకు అందుబాటులోకి వచ్చింది.
Laknavaram Third Island Fare : ఈ కాటేజీలు ఫేర్ రూ. 6000 నుంచి రూ.15 వేల వరకు ఉంటుంది. ఇందులో లగ్జరీ రిస్టార్టులు, ప్రీమియం రూమ్స్ కూడా ఉన్నాయి.
Activities on Laknavaram Third Island : లక్నవరంలోని మూడవ ఐల్యాండ్‌లో డోనట్ బోట్, షికారి బోట్,కాయాకింగ్, డ్రిఫ్ట్ సర్ఫింగ్ బోర్డు, పెడల్ బోర్డు, కారకల్, ఫిషింగ్ చేయవచ్చు అని కోవ్స్ నిర్వాహకులు తెలిపారు.
లక్నవరం మూడవ ఐల్యాండ్‌ ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది అంటే మీకు రిలాక్స్ అవ్వడానికి వేరే స్పా అవసరం లేదు.కానీ స్పా కూడా కావాలి అనుకుంటే అది కూడా ఉంది.
Amenties in Cove Lakavaram : లక్నవరంలోని కోవ్ ఐల్యాండ్‌లో ఉన్న కాటేజీల్లో నలుగురు ఉండవచ్చు. ఇక్కడ పిల్లల కోసం స్విమ్మింగ్ పూల్, ఇతర ఏర్పాట్లు చేశారు. పెద్దల కోసం రెస్టారెంట్స్ ఉన్నాయి.

ఇంతకి మీరు ఎప్పుడైనా లక్నవరం వెళ్లారా ? వెళ్తే మీకు అక్కడ నచ్చిన విషయాలు ఏంటి ? దగ్గర్లో చూడాల్సిన ప్రదేశాలు ఏంటి ? కామెంట్ చేయండి. థ్యాంక్యూ

Watch : లక్నవరం లేక్...ఇదో అందమైన నీటి ప్రపంచం 

Trending Video On : Prayanikudu Youtube Channel

Pandharpur :  ఒక ఆధ్యాత్మిక ప్రపంచం | 7 Temple Darshan In 7 Hours In Pandharpur

Most Popular Stories

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!