ఆయుధాలను టచ్ చేసి, ఫోటోలు దిగోచ్చు… గొల్కొండ కోటలో “నో యువర్ ఆర్మీ మేళా | Know Your Army Mela 2025

Share This Story

గోల్కొండ కోటలో నో యువర్ ఆర్మీ అనే మేళాను నిర్వహించనుంది ఇండియ్ ఆర్మీ . ఈ మేళా 2025 జనవరి 3 వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కొనసాగనుంది. భారత సైన్యం, పౌరుల మధ్య సత్సంబంధాన్ని ఏర్పరచడమే ఈ మేళా లక్ష్యం. ఇందులో ( Know Your Army Mela 2025 ) భారతీయ ఆర్మీ ఎలాంటి సాంకేతికతను వినియోగిస్తుంది చూడవచ్చు. ఏదైనా ఆపరేషన్ చేయాల్సి వస్తే ఆర్మీ ఎలా సిద్ధం అవుతుందో కూడా తెలుసుకోవచ్చు.

చరిత్రకు సాక్ష్యంగా నిలిచే గోల్కొండ కోట నో యువర్ ఆర్మీ మేళా 2025 వైభవంగా జరగనుంది. ఈ మేళా తెలంగాణ,ఆంధ్ర సబ్ ఏరియా ప్రధాన కార్యాలయం ( TASA) ఆధ్వర్యంలో హైదరాబాద్ ఆర్టిలరి కేంద్రం సమన్వయంతో జరగనుంది.

Prayanikudu

అడ్వాన్స్ టెక్నాలజీ ప్రదర్శన | Know Your Army Mela 2025 Highlights


ఈ ప్రదర్శనకు సాధారణ పౌరులు ఎవరైనా వెళ్లవచ్చు. ఇందులో మిలటరీకి సంబంధించిన కీలక పనిముట్లు, ఆయుధాలను చూడవచ్చు. ఇందులో అడ్వాన్స్‌డ్ ఆర్టిలరీ గన్స్, స్మాల్ గన్స్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఆపరేషనల్ టూల్స్‌ను చూడవచ్చు. దీంతో పాటు కమ్యూనికేషన్ సిస్టమ్, ఇంజినీరింగ్ టూల్స్, న్యూ క్లియర్, బయోలాజికల్, కెమికల్ వార్ఫేర్ సూట్స్ కూడా ఉంటాయి. ప్రతీ స్టాల్ వద్ద వివరాలు అందించడానికి, సందేహాలు తీర్చడానికి ఆర్మీ సిబ్బంది ( Indian Army ) అందుబాటులో ఉంటారు.

ఆయుధాలు టచ్ చేయవచ్చు

Know Your Army Mela 2025
ఈ మేళాకు అందరూ వెళ్లవచ్చు. ఆయుధాలతో ఫోటోలు దిగవచ్చు.


నో యువర్ ఆర్మీ మేళాలో ఆయుధాలను చూడటమే కాదు వాటిని తాకవచ్చు. ఆర్మీ సిబ్బందిని అక్కడి ఆయుధాలు, పనిముట్ల గురించి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. మీరు వాటితో ఫోటోలు కూడా దిగవచ్చు. దీంతో పాటు ఇక్కడ భారతీయ ఆర్మీలో చేరాలని భావించే వారి కోసం ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. సైన్యంలో చేరాలనుకునే వారు ఎవరైనా వెళ్లి వారి సందేహాలు తీర్చుకోవచ్చు. మార్గదర్శనం కోరవచ్చు.

అమర వీరుల కథలు తెలుసుకోండి

ఈ మేళాలో ( Know Your Army Mela 2025 ) సందర్శకులు ఆర్మీ బ్యాండ్ నిర్వహించే సంగీత కచేరీని ఆస్వాదించవచ్చు. దీంతో పాటు శౌర్య పురస్కారాలను ( Shaurya Puraskar ) వీక్షించవచ్చు. భారత సైనికులు వీరోచిత గాథలు, అమరుల త్యాగాల కథలను తెలుసుకోవచ్చు. ఈ మేళా అనేది సందర్శకులకు ఆయుధాలు, సైనిక పరికరాలు పరిచయం చేయడం కోసం మాత్రమే కాదు… యువతను సైన్యంలోకి చేరేలా ప్రేరేపించడానికి కూడా నిర్వహిస్తున్నారు. భారత సైన్యం ఎంత అడ్వాన్స్‌డ్‌గా, సంసద్దింగా ఉంటుందో ఈ మేళాకు వెళ్లి తెలుసుకోవచ్చు.

గమనిక : ఈ వెబ్‌సైట్‌లో కొన్ని ప్రకటనలు కనిపిస్తాయి. వీటిని గూగుల్ యాడ్ అనే సంస్థ అందిస్తుంది. ఈ ప్రకటనలపై మీరు క్లిక్ చేయడం వల్ల మాకు ఆదాయం వస్తుంది. 

Trending Video On : Prayanikudu Youtube Channel

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

Most Popular Stories

ప్రపంచ యాత్ర గైడ్

Share This Story

Leave a Comment

error: Content is protected !!