Ladakh Magnetic Hill : కారును లాగే కొండ.. శాస్త్రవేత్తలకు అర్థం కాని మేగ్నెటిక్ హిల్
Ladakh Magnetic Hill : లడాఖ్‌లో ఉన్న మేగ్నెటిక్ హిల్‌లో కారు న్యూట్రగ్ గేరులో ఉన్నా కూడా కొండపైకి మూవ్ అవుతుంది. ఇది మేజిక్కా ? లేదా ఆప్టికల్ ఇల్యూషనా? ఈ మిస్టరీ ట్రావెల్ ఎక్స్‌పీరియెన్స్ గురించ తెలుసుకోండి
లేహ్–కార్గిల్ హైవేలో ఉన్న మేగ్నెటిక్ హిల్ ప్రాంతం అయస్కాంత శక్తికి ఒక ఎగ్జాంపుల్‌గా చాలామంది భావిస్తారు. ఇక్కడ రోడ్డుపై భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేకంగా వస్తువులు, వాహనాలు కదులుతున్నట్టు మనం గమనించవచ్చు.
కారును న్యూట్రల్ గేర్‌లో పెట్టి స్టార్ట్ పాయింట్ దగ్గర ఆపితే, ఆటోమెటిక్‌గా కారు గంటకు సుమారు 20 కిలోమీటర్ల వేగంతో కొండపైకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది.
మొదట్లో ఇది ఒక భ్రమలా, మాయలా అనిపించవచ్చు. కానీ అక్కడికి వెళ్లినవాళ్లకు ఇది నిజంగా జరిగే అద్భుతంలా అనిపిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయంపై ఇప్పటికీ చాలా మంది పరిశోధనలు చేస్తున్నారు. ప్రయాణికులకు మాత్రం ఇది ఒక గొప్ప అనుభూతిని అందించే ప్రదేశంగా మారిపోయింది.

Toprohan at English Wikipedia)
ఇంద్రజాలంలా అనిపించే మాయా ప్రదేశం | Optical Illusion
మేగ్నెటిక్ హిల్ దగ్గర అడుగు పెట్టగానే చుట్టూ ఉన్న మౌనం మనల్ని ఒక్కసారిగా ఆకట్టుకుంటుంది. ఓపెన్ రోడ్, చెట్లే లేకుండా గుండులా కనిపించే పర్వతాలు, తళతళమని మెరిసే నీలాకాశం… ఇవన్నీ మనం మరో గ్రహంలో ఉన్నామా అన్న ఫీలింగ్ కలిగిస్తాయి.
సిటీ జీవితాలకు దూరంగా, కేంద్ర పాలిత ప్రాంతమైన లడాఖ్‌లోని లేహ్ (Leh) జిల్లాలో ఈ మేగ్నెటిక్ హిల్ ఉంది. ఇక్కడికి రాగానే సిటీ మాయ నుంచి బయటపడ్డ అనుభూతి కలుగుతుంది.
కారును న్యూట్రల్ గేర్‌లో పెట్టి రిలీజ్ చేసినప్పుడు అది స్లోగా కొండ వైపు కదులుతుంటే ఎవరికైనా షాక్ అవ్వాల్సిందే. మైండ్ మాత్రం “లాజిక్ ఏంటి?” అని ఆలోచిస్తుంది, కానీ కళ్లు మాత్రం మ్యాజిక్‌ను చూస్తూనే ఉంటాయి.
సైన్స్ చెప్పేది ఒకటి… ఇక్కడ జరిగేది ఇంకొకటి

నిపుణుల ప్రకారం ఇది నిజమైన అయస్కాంత శక్తి కాదు. చుట్టుపక్కల ఉన్న పర్వతాల అలైన్మెంట్, రోడ్డుకు ఉన్న స్వల్ప స్లోప్, హారైజన్ యాంగిల్ వల్ల దృష్టి భ్రమ (Optical Illusion) ఏర్పడుతుంది. అందుకే వాహనాలు కొండపైకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది.
కానీ ఇక్కడికి వచ్చి చూసే పర్యాటకులు మాత్రం, ఈ వివరణలకు మించి ఇంకేదో ప్రత్యేకత ఉంది అని ఫీల్ అవుతారు.
- ఇది కూడా చదవండి : Weird Foods : ప్రపంచంలోనే వింతైన ఆహారపదార్థాలు
ప్రయాణికులకు ఎందుకు స్పెషల్?
Magnetic Hill ఇప్పుడు Ladakh travel circuitలో తప్పనిసరిగా వెళ్లాల్సిన ప్రదేశంగా మారిపోయింది. ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, సోలో ట్రావెలర్స్ అందరూ ఇక్కడికి వచ్చి ఈ అనుభూతిని సొంతం చేసుకుంటారు.
న్యూట్రల్ గేర్‌లో కారు ముందుకు కదిలినప్పుడు వచ్చే ఆ క్షణమే వారి ట్రిప్‌లో హైలైట్. చిన్న విజయం అయినా సెలబ్రేట్ చేసుకోవాలి కదా! ఇలాంటి క్షణాల వల్లే ఈ ప్రదేశం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటుంది.
ఇవి గుర్తుంచుకోండి | Safety & Travel Tips
ఇది ఒక యాక్టివ్ హైవే అని గుర్తుంచుకోవాలి. అందుకే ఎక్కువ సమయం రోడ్డుపై వాహనాన్ని నిలపడం సేఫ్ కాదు. చిన్న ఎక్స్పరిమెంట్ పూర్తయ్యాక వెంటనే అక్కడి నుంచి కదలడం బెస్ట్.
Leh Magnetic Hill visit చేయడానికి బెస్ట్ టైమ్ మే నుంచి సెప్టెంబర్ వరకు. చలికాలంలో మంచు వల్ల ప్రయాణం కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు.
సైన్స్ ఏం చెబుతున్నా, శాస్త్రవేత్తలు ఎన్ని వివరణలు ఇచ్చినా… ఇక్కడ నిజం తెలుసుకోవడమే ముఖ్యం కాదు. ఏదో కొత్తగా, డిఫరెంట్‌గా చూసాను, ప్రయత్నించాను అనే ఫీలింగ్ పొందడమే ఈ మేగ్నెటిక్ హిల్ అసలైన ప్రత్యేకత.
“మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. ఉదాహరణకు : Warangal Prayanikudu ఇలా వెతకండి… తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
