Phone : వామ్మో.. ఫోన్ పోయిందా? ఈ 5 పనులు వెంటనే చేయండి.. లేకపోతే భారీ నష్టాలు తప్పవు
Phone : ఈ రోజుల్లో ఫోన్ లేకుండా ఒక క్షణం కూడా గడపడం కష్టం. అలాంటి పరిస్థితుల్లో ఫోన్ పోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రయాణంలో ఉన్నప్పుడు ఇలా జరిగితే ఆ కష్టం మాటల్లో చెప్పలేం. టికెట్లు, ప్లాన్లు, బ్యాంక్ యాప్‌లు, ఫోటోలు వంటి విలువైన సమాచారాన్ని కోల్పోవాల్సి వస్తుంది. అయితే, ఫోన్ పోయినప్పుడు కొంచెం తెలివిగా వ్యవహరిస్తే నష్టాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఫోన్ మళ్లీ దొరికే అవకాశాలు కూడా పెరుగుతాయి. ఫోన్ పోయినప్పుడు తప్పనిసరిగా చేయవలసిన ముఖ్యమైన పనులేంటో ఇక్కడ తెలుసుకుందాం.
కంగారు పడకండి
ఫోన్ పోయినప్పుడు ఎక్కువగా కంగారు పడకండి. మీరు ఫోన్‌ను ఎక్కడ పోగొట్టుకున్నారో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించండి. వీలైతే, ఆ ప్రాంతాల్లో వెతకండి. హోటల్స్ వంటి ప్రదేశాల్లో పోతే, అక్కడి సిబ్బందిని సంప్రదించవచ్చు. ఇలాంటి ప్రయత్నాలతో ఫోన్ వెంటనే దొరికే అవకాశం ఉంది.

ట్రాకింగ్ యాప్‌లను ఉపయోగించండి
ప్రయాణం చేసేటప్పుడు ఫోన్లో తప్పనిసరిగా ట్రాకింగ్ యాప్‌లను ఇన్స్టాల్ చేసుకోండి. ఆండ్రాయిడ్ ఫోన్లకు ఫైండ్ మై ఫోన్, ఆపిల్ ఫోన్లకు ఫైండ్ మై ఐఫోన్ ఉపయోగించవచ్చు. వీటితో మీ ఫోన్ చివరిగా ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. వీటి ద్వారా ఫోన్లోని డేటాను రిమోట్‌గా డిలీట్ కూడా చేయవచ్చు. మీ ఫోన్లోని సమాచారం దుర్వినియోగం కాకుండా ఉండటానికి ఇది చాలా ముఖ్యం.
- ఇది కూడా చదవండి: Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
పోలీసులకు ఫిర్యాదు చేయండి
మీ ఫోన్ పోయినట్లు ఖచ్చితంగా తెలిసిన తర్వాత, వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి. ఈ ఫిర్యాదు ఇన్సూరెన్స్ మరియు సిమ్ రీప్లేస్మెంట్ సమయంలో అవసరం అవుతుంది. అలాగే, మీ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్‌కు కూడా ఈ విషయం తెలియజేసి, సిమ్‌ను బ్లాక్ చేయించండి. ఇలాంటి సందర్భాలలో చాలా కంపెనీలు డూప్లికేట్ సిమ్‌లను ఇస్తాయి. మీ ఐడీ మరియు ఇతర వివరాలు దొంగల చేతుల్లోకి వెళ్లకుండా ఉండటానికి ఈ చర్యలు తప్పనిసరి.
ఇది కూడా చదవండి : Indian License : భారతీయ లైసెన్స్ ఈ 15 దేశాల్లో కూడా చెల్లుతుంది
పాస్వర్డ్లు మార్చండి
ఫోన్‌ను రిమోట్‌గా లాక్ చేసి, సిమ్‌ను బ్లాక్ చేసిన తర్వాత, మీ ఐడీ దొంగిలించబడకుండా మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ఈమెయిల్, సోషల్ మీడియా, బ్యాంకింగ్ యాప్‌ల పాస్‌వర్డ్‌లన్నింటినీ వెంటనే మార్చండి. ఒకవేళ టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంటే, దానిని మరో ఫోన్‌కు మార్చుకోండి. ఇలా చేస్తే, మీ అకౌంట్ వివరాలు నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా నివారించవచ్చు.
క్లౌడ్ బ్యాకప్, ఇన్సూరెన్స్ క్లెయిమ్
ఇలాంటి సమయాల్లో ఫోన్‌ను క్లౌడ్‌లో బ్యాకప్ చేసుకోవడం చాలా ఉపయోగపడుతుంది. మీ డేటాను మరో ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటే, ఫోన్ పోయిన విషయాన్ని మీ ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయండి. పోలీసు రిపోర్ట్‌తో పాటు, ఫోన్ కొన్న బిల్లులు మరియు ఇతర పత్రాలను ఇన్సూరెన్స్ కంపెనీకి ఇవ్వాలి. ఈ చర్యలు తీసుకుంటే కొంత ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.