Malana Village Mystery : హిమాలయాల్లో ఒక రహస్య గ్రామం..
Malana Village : భారత దేశంలో అతిపురాతమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్న గ్రామం ఇదేనంటారు. అలెగ్జాండర్ సైనికుల వారసుల నివాసం అంటారు. ఇక్కడి నివాసులను ఎవరూ తాకకూడదంటారు…ఈ మిస్టీరియస్ గ్రామం గురించి…
భారతదేశంలో కొన్ని ప్రదేశాలు మ్యాపులో సాధారణంగా సింపుల్గా కనిపించికా.. అక్కడి వాస్తవాలు భిన్నంగా ఉంటాయి. అలాంటి ఒక ప్రదేశమే మలానా గ్రామం. మీరు ఈ ప్రదేశం పేరు ఎప్పుడూ ఎక్కడా విని ఉండరు. ఎందుకంటే ఇది అంత పాపులర్ టూరిస్టు డెస్టినేషన్ కాదు. ఇది ఒక పురాతనమైన గ్రామం.
ఒక ప్రమాదం…సగం సమాప్తం
హిమాచల్ ప్రదేశ్లోని (Himachal Pradesh) పార్వతీ లోయ పక్కనే, కొండల మధ్యలో ఉన్న ఈ గ్రామం ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఒక చారిత్రాత్మక ప్రదేశం. ఒకప్పుడు ఈ గ్రామం పెద్దగా ఉన్నా 2008 లో జరిగిన అగ్ని ప్రమాదం తరువాత ఇక్కడ అనే నివాసాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. అలాగే ఇక్కడ ఉన్న పురాతన ఆలయం కూడా అందులో నేలమట్టం అయింది.
- ఇది కూడా చదవండి : అడవుల మధ్య పెరిగిన రంపచోడవరం విశేషాలు | Rampachodavaram Travel Guide
మలానా గ్రామానికి కొన్ని విశేషమైన నియమాలు, నిబంధనలు ఉన్నాయి. అందులో భాగంగా ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఇక్కడి దేవాయాలను, నివాసాల గోడలను, స్థానికులను తాకితే అక్కడి అధికారులు ఫైన్ వేస్తారు.
టూరిస్టులు ఎవరికైనా డబ్బులు డబ్బులు ఇవ్వాల్సి వస్తే నేలపై లేదా కౌంటర్పై పెడతారు కానీ చేతికి ఇవ్వరు. ఈ ప్రక్రియలో పొరపాటున స్థానికులనున బయటి వాళ్లు టచ్ చేస్తే వెంటనే వెళ్లి స్నానం చేసి శుద్ధి చేసుకోవాలి అనేది ఇక్కడి ప్రజల విశ్వాసం.
దైవ సాక్షిగా తీర్పులు | Malana Village
మలానా గ్రామాన్ని చాలా మంది ప్రపంచంలోనే అతిపురాతనమైన ప్రజాస్వామ్యం ఉన్న ప్రదేశంగా చెబుతారు. మరో విశేషం ఏంటంటే ఇక్కడ పోలీసు వ్యవస్థతో పని లేకుండా, జమ్లూ దేవత అనే స్థానిక దైవశక్తి సాక్షిగా తీర్పులు, నిర్ణయాలు జరుగుతాయి.
సీక్రెట్ భాష…పక్క గ్రామస్థులకు కూాడా అర్థం కాదు
మాలానా ప్రజలు కానాశీ అనే ఒక రహస్య భాషలో మాట్లాడుతారు. ఇది ఎంత సీక్రెట్ అంటే, వారు మాట్లాడే పదాలు చుట్టుపక్కల ఉన్న గ్రామస్థులకు కూడా అర్థం కావు. అలాగే అలెగ్జాండర్ సైనికుల వంశం ఇక్కడ కొనసాగుతుందని కూడా కొంతమంది అంటారు, కానీ దానికి స్పష్టమైన రుజువులు లేవు.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు చిట్ చాట్
