Manali Nightmare : మనాలిలో 8 కిమీ ట్రాఫిక్ జామ్, రోడ్డుపై ఇరుక్కుపోయిన పర్యాటకులు
Manali Nightmare : భారీగా కురిసిన హిమపాతం వల్ల 8 కిమీ మేరా ట్రాఫిక్ జామ్ అయింది. చాలా మంది వాహనాలు వదిలి ముందుకు వెళ్లిపోతున్నారు.
స్నోఫాల్ అనుభవం కోసం మనాలి వెళ్లిన టూరిస్టులకు ట్రిప్ ఒక పీడకలగా మారిపోయింది. గణతంత్ర దినోత్సవం, లాంగ్ వీకెండ్ సమయంలో హఠాత్తుగా భారీగా కురిసిన హిమపాతం కారణంగా మనాలిలో 8 కిమీ మేరా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వందలాది వాహనాలు మంచులో గంటల కొద్దీ నిలిచిపోవడం వల్ల ప్రయాణికులు తమ వాహనాలను వదిలి ముందుకు సాగడానికి ప్రయత్నించారు.
ఒకవైపు ట్రాఫిక్ మరోవైపు హోటల్స్‌లోని అన్ని రూమ్‌లు 100 శాతం నిండిపోయాయి. ఈ భారీ రీష్ కారణంగా చాలా మంది ప్రయాణికులు ఇంకా దారి మధ్యలోనే ఇరుక్కుపోయారు. హోటళ్లు పూర్తిగా బుక్ అయినందున కొంతమంది మనాలిలోని హోటల్స్‌ను వదిలి కులుకు (Kullu) వెళ్ళిపోతున్నారు లేదా అక్కడే ఉండే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
Think twice before coming to Manali during heavy snowfall.
— Go Himachal (@GoHimachal_) January 25, 2026
People stuck in traffic jams for 25+ hours in sub-zero temperatures. pic.twitter.com/jWJNIlnccA
హిమపాతం (Snowfall) పరిస్థితి అన్నిటికి మాత్రమే పరిమితం కాలేదు మొత్తం హిమాచల్ ప్రదేశ్‌లో వందలమంది రహదారులు మంచులో బ్లాక్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 685కు పైగా రహదారులు స్నో వల్ల నిలిచిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి.
- ఇది కూడా చదవండి : మనాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఎక్కడ ఉండాలి, ఏం చూడాలి | Top 10 Tips To Visit Manali
అధికారులు సహాయక చర్యలు, రహదారులపై మంచు తొలగించే ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ, వాతావరణం సహకరించకపోవడం వల్ల పరిస్థితి ఇంకా క్లిష్టంగా ఉంది.
ప్రయాణికులు తమ ప్రణాళికలను తాజా వాతావరణ పరిస్థితులను బట్టి మార్చుకోవడానికి అధికారులు సూచిస్తున్నారు, ఎందుకంటే ప్రయాణం సంతోషకరంగా ఉండాలి ఇబ్బంది కలిగించేలా కాదు.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
