Medaram Jatara 2026: రూ.299కే మేడారం ప్రసాదం హోమ్ డెలివరీ – TGSRTC Logistics
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఫెస్టివల్గా ప్రసిద్ధి పొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర (Medaram Jatara 2026) జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా మేడారంలో జరగనుంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు మేడారం జాతరకు తరలివచ్చి అమ్మవార్ల దర్శనం చేసుకుని బంగారం (బెల్లం) సమర్పించడం (Bangaram Samarpana Tradition) ఆనవాయితీగా కొనసాగుతోంది.
ఇంటి వద్దకే మేడారం ప్రసాదం | TGSRTC Home Delivery Service
జాతర రోజులలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. వయసులో పెద్దవారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా దూర ప్రయాణాల్లో ఉన్న భక్తులకు మేడారం వెళ్లడం సాధ్యం కాకపోవచ్చు.
ఇలాంటి పరిస్థితుల్లో భక్తులు తమ మొక్కులను పూర్తి చేసుకునేలా TGSRTC Logistics, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సహకారంతో ఒక ప్రత్యేక హోమ్ డెలివరీ సేవను ప్రారంభించింది.

- ఇది కూడా చదవండి : హైదరాబాద్ నుంచి 245 కిమీ దూరంలో తెలంగాణలో ఒక జైపూర్ | Jaipur In Telangana Travel Guide 2025
ప్రసాదం ప్యాకెట్లో ఏముంటాయి? | Inside Prasadam Packet
మేడారం వెళ్లలేని భక్తుల కోసం బంగారం ప్రసాదాన్ని నేరుగా ఇంటి వద్దకే అందించేలా ఈ ప్యాకెట్ రూపొందించారు.
ఈ ప్రసాదం ప్యాకెట్లో:
- అమ్మవారి ఫోటో
- బెల్లం
- పసుపు – కుంకుమ
- ఇతర సంప్రదాయ పూజా సామగ్రి
భక్తుల ఆధ్యాత్మికత, భక్తి భావాలను గౌరవిస్తూ ఈ సేవను డిజైన్ చేశారు.
Watch: Tribal Museuam At Medaram
ధర ఎంత? | Price of Prasadam In Medaram Jatara 2026
ఈ బంగారం ప్రసాదం ప్యాకెట్ ధర రూ.299 మాత్రమే. బుకింగ్ కోసం తెలంగాణ ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం అధికారిక వెబ్సైట్ ద్వారా లేదా TGSRTC Logistics కౌంటర్లలో నమోదు చేసుకోవచ్చు. జాతర మొదలు అవ్వడానికి ముందే బుక్ చేసుకుంటే బెటర్ అని అధికారులు సూచించారు.
ఎలా బుక్ చేసుకోవాలి? | Booking Process & Helpline
ఈ సేవ వల్ల మేడారం జాతర సమయంలో క్రౌడ్ ప్రెజర్ తగ్గడమే కాకుండా, భక్తుల భద్రత మరింత మెరుగవుతుందని అధికారులు భావిస్తున్నారు. పీక్ జాతర సమయంలో ట్రాఫిక్ నియంత్రణకు కూడా ఈ సర్వీస్ ఉపయోగపడనుంది.
మరిన్ని వివరాల కోసం భక్తులు
📞 040-69440069, 040-23450033 నెంబర్లను సంప్రదించవచ్చు.
జాతర సమయంలో డిమాండ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున అడ్వాన్స్ బుకింగ్ చేయడం మంచిది.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు చిట్ చాట్
