జనవరి 28 నుంచి 31 వరకు 4 రోజుల Medaram Jatara 2026 Travel Guide
Medaram Jatara 2026 Travel Guide : మేడారం జాతరకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, వరంగల్ నుంచి భద్రాచలం వరకు రోజువారీగా (డే-వైజ్) ట్రావెల్ ప్లాన్ మీ కోసం…
తెలంగాణలో ప్రతి రెండు సంవత్సరాలకు జరిగే మేడారం జాతర 2026 జనవరి 28 నుంచి 31 వరకు జరగబోతోంది. ములుగు జిల్లాలోని మేడారం అటవీ ప్రాంతంలో జరిగే ఈ జాతరకు లక్షలాది మంది భక్తులు హాజరవుతారు. ఈ నాలుగు రోజుల్లో వరంగల్, ములుగు, ఏటునాగారం, భద్రాచలం ప్రాంతాల్లో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది.
మీరు కూడా మేడారం జాతరకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, వరంగల్ నుంచి భద్రాచలం వరకు రోజువారీగా (డే-వైజ్) ట్రావెల్ ప్లాన్ మీ కోసం…
జనవరి 28 : వరంగల్ నుంచి మేడారం ప్రయాణం
Warangal nundi Medaram Travel
2026 జనవరి 28న చాలా మంది భక్తులు వరంగల్ నుంచి ములుగు వయా మేడారం ప్రయాణం ప్రారంభిస్తారు. ఉదయం సమయంలో ప్రయాణం చేస్తే రద్దీ తక్కువగా ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు. అటవీ మార్గాల్లో ట్రాఫిక్ నెమ్మదిగా కదిలే అవకాశం ఉండటంతో వీలైనంత త్వరగా ప్రయాణం ప్రారంభించడం మంచిది.
- తెలంగాణలో సందర్శనీయ స్థలాలు జిల్లవారిగా తెలుసుకోవడానికి క్లిక్ చేయండి.
జనవరి 29 : మేడారంలో పీక్ క్రౌడ్ డే
Peak Crowd in Medaram

జనవరి 29న మేడారం జాతరలో సందడి అత్యధికంగా ఉంటుంది. సమ్మక్క–సారలమ్మ దర్శనం కోసం భక్తులు చాలా దూరం నడిచి వెళ్లాల్సి ఉంటుంది. టెంపరరీ షెల్టర్లు, తాగునీటి సదుపాయాలు, వైద్య సేవలు ఏర్పాటు చేస్తారు. అనుమతి లేని ప్రదేశాల్లో వాహనాలను తీసుకెళ్లకుండా ప్రజా రవాణాను వినియోగించడం మంచిది.
జనవరి 30 : మేడారం నుంచి ఏటునాగారం – రామప్ప సైడ్
Medaram nundi Eturnagaram, Ramappa Side
దర్శనం అనంతరం కొన్ని గ్రూపులు ఏటునాగారం అటవీ ప్రాంతం, లక్నవరం లేక్‌తో పాటు రామప్ప ఆలయం దిశగా ప్రయాణం చేస్తారు. ఈ రూట్ సీనిక్గా ఉన్నప్పటికీ రోడ్లు ఇరుకుగా ఉండటంతో డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి.
- ఇది కూడ చదవండి : రామప్ప నుంచి లక్నవరం వరకు.. Mulugu District Top 8 Tourist Spots
జనవరి 31 : భద్రాచలం కారిడార్ & రిటర్న్ జర్నీ
Bhadrachalam Corridor and Return Journey
చివరి రోజున చాలా మంది భక్తులు భద్రాచలం సీతా రామచంద్ర స్వామి ఆలయ దర్శనానికి ప్లాన్ చేస్తారు. మధ్యాహ్నం తర్వాత భక్తుల రద్దీ క్రమంగా తగ్గుతుంది. దీంతో రిటర్న్ జర్నీ కాస్త స్మూత్‌గా ఉంటుంది.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
