Nagarjuna Sagar : సెలవు దొరికింది కదా అని సాగర్‌కు వెళ్తున్నారా? ఇది మాత్రం తప్పకుండా గమనించండి
Nagarjuna Sagar : దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టులలో ఒకటైన నాగార్జున సాగర్ ప్రాజెక్టును సందర్శించాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీరు తప్పకుండా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. సాధారణంగా సాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తినప్పుడు మాత్రమే ఆ ప్రాజెక్టు అందం అద్భుతంగా ఉంటుంది. భారీ కొండల మధ్య కృష్ణమ్మ ఉరకలు వేసే ఆ దృశ్యాలు చూస్తే మనసు ఉప్పొంగిపోతుంది. అయితే గేట్లు తెరిచినప్పుడే సాగర్‌కు వెళ్లడం ఉత్తమం. ఎందుకంటే ప్రస్తుతానికి సాగర్ గేట్లు మూసివేశారు.
గేట్లు మూయడానికి కారణం ఇదే
వర్షాకాలంలో ముఖ్యంగా ఆగస్టు తర్వాత కృష్ణా నదికి వరద ప్రవాహం పెరుగుతుంది. అప్పుడు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తారు. ఇటీవల భారీ వర్షాల కారణంగా సాగర్ గేట్లన్నింటినీ ఎత్తడంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చారు. అయితే, ప్రస్తుతం కర్ణాటకలో వర్షాలు తగ్గిపోవడం వలన కృష్ణా నదికి వరద ప్రవాహం కూడా తగ్గింది. దీంతో సాగర్ రిజర్వాయర్‌కు వచ్చే వరద ప్రవాహం క్రమంగా తగ్గిపోయింది. వరద ప్రవాహం మరింత తగ్గడంతో అన్ని గేట్లను మూసివేశారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురిసే అవకాశం లేనందున గేట్లు తిరిగి ఎత్తే అవకాశం లేదు అని చెప్పవచ్చు.

ఇది కూడా చదవండి : Ramayana Trail : శ్రీలంకలో రామాయణం టూరిజం…ఏం చూపిస్తారు? ఎలా వెళ్లాలి ? Top 5 Tips
సాగర్ ప్రస్తుత నీటి మట్టం, నిల్వ
నాగార్జున సాగర్ రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 588 అడుగుల వరకు నీరు ఉంది. సాగర్ నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 308 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అంటే, ప్రాజెక్ట్ దాదాపు నిండు కుండలా ఉంది. ప్రస్తుతం సాగర్‌కు 1.85 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. ఈ నీటిని గేట్లు ఎత్తకుండా, విద్యుత్ ఉత్పత్తి కోసం దిగువకు విడుదల చేస్తున్నారు. ఉత్పత్తి తర్వాత ఆ నీరు దిగువకు వెళుతుంది. కాబట్టి, గేట్లు ఎత్తాల్సిన అవసరం లేకుండానే నీటిని వినియోగిస్తున్నారు.
ఇది కూడా చదవండి : Indian License : భారతీయ లైసెన్స్ ఈ 15 దేశాల్లో కూడా చెల్లుతుంది
ఇప్పుడే సాగర్ వెళ్తే.. ఏం చూడవచ్చు?
మీరు గేట్లు ఎత్తినప్పుడు ఉండే జలపాతాన్ని చూడాలనుకుంటే, నిరాశ తప్పదు. కానీ, ప్రాజెక్ట్ నిండు కుండలా ఉన్న దృశ్యాన్ని ఆస్వాదించవచ్చు. మీరు ప్రకృతిలో సరదాగా గడపాలనుకుంటే, ఇప్పుడైనా సాగర్‌కు వెళ్లవచ్చు. సిటీ నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరం దాటిన తర్వాత సాగర్ రోడ్డు చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ వారం ఎండ తీవ్రత అంతగా ఉండకపోవడం వలన, వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి గేట్లు లేకపోయినా.. నిండుగా ఉన్న ప్రాజెక్టు అందాలను, చుట్టుపక్కల వాతావరణాన్ని చూసి టూర్ ప్లాన్ చేసుకోవచ్చు.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
