ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం తమిళనాడులో పుణ్య క్షేత్రాలను దర్శించుకుంటున్నారు. తాజా మదురై మీనాక్షి అమ్మవారి దర్శించుకోవడానికి మదురై కి రీచ్ అయ్యారు.అయితే ఈ యాత్రలో ఆయన ఇప్పటి వరకు సందర్శించిన పవిత్ర క్షేత్రాలు ఏంటో చూద్దాం…
ముఖ్యాంశాలు
అగస్త్య ముని ఆలయం, కొచ్చి | Agastya Muni Temple, Kerala

- తొలూత కేరళలోని కొచ్చిలో ఉన్న అగస్త్య ముని ఆలయాన్ని దర్శించుకున్నారు పవన్ కళ్యాణ్.

- ఆలయంలో మొక్కులు చెల్లించుకున్న పవన్ కళ్యాణ్ అగస్త్య ఆశ్రమంలో ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించే మూలికల గురించి తెలుసుకున్నారు.

- దీంతో పాటు కలరిపయట్టు యుద్ధకళ ప్రాధాన్యత గురించి ఆయన తెలుసుకున్నారు.
- Watch : పళని మురుగన్ ఆలయం చరిత్ర, ఎలా వెళ్లాలి ? టైమింగ్ అండ్ టిప్స్
తిరువనంతపురం పురం,కేరళ | Thiruvananthapuram Puram

- అనంతరం తిరువనంతపురంలోని శ్రీ పరుశురాముడి ఆలయాన్ని దర్శించుకున్నారు పవన్ కళ్యాణ్.

- ఈ సందర్భంగా ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (Travancore Devaswom Board) సభ్యులు పవన్ కళ్యాణ్‌ను ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

- పరశురాముడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు పవన్ కళ్యాణ్ . ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది, భక్తులతో ముచ్చటించారు పవన్ కళ్యాణ్.
స్వామిమలై ,తంజావూరు | Arulmigu Swaminatha Swami Temple,
, Thanjavur

- ఓంకార మంత్ర రహస్యాన్ని సృష్టికి అందించిన క్షేత్రం స్వామిమలై. షష్ట షణ్ముఖ క్షేత్రాల్లో స్వామిమలై ఐదవ క్షేత్రం.

- ఇక్కడ శ్రీ స్వామి నాథుడిని ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దర్శించుకున్నారు. పవన్ కళ్యాణ్‌తో ఆయన కుమారుడు అఖీరా నందన్ (Akira Nandan), తితిదే బోర్డు సభ్యుడు ఆనంద సాయి కూడా ఉన్నారు
- Read Also: Tuljapur : శివాజీ నడిచిన దారిలో తుల్జా భవానీ మాత దర్శనం

- శ్రీ స్వామినాథ దర్శించుకున్న తరువాత ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆది దంపతులు శ్రీ సుందరేశ్వరన్ స్వామి, మీనాక్షి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Tamilnadu Temple Tour Photos).
కుంభకోణం | Kumbhakonam, Tamilnadu

- పుణ్య క్షేత్రాల యాత్రలో భాగంగా తమిళనాడులోని ఆది కుంభేశ్వరుడిని (Adi Kumbeswarar Temple) దర్శించుకున్నారు పవన్ కళ్యాణ్.
- Watch : జలలింగం ఉన్న జంబుకేశ్వరం ఆలయం చరిత్ర, విశేషాలు

- ఈ ఆలయానికి దర్శనానికి వచ్చే భక్తులు ముందుగా ఆది గణపతిని (Adi Ganapati) దర్శించుకోవాలి. ఆలయ సంప్రదాయం ప్రకారం ముందు ఆది వినాయగర్‌ను (Adi Vinayagar) దర్శించుకున్నారు పవన్ కళ్యాణ్.

- అనంతరం మూల విరాట్ ఆది కుంభేశ్వరుడిని దర్శించుకున్నారు (Pawan Kalyan). అమృతం, ఇసుక కలిసి ఉద్భవించిన ఈ లింగానికి అభిషేకాలు నిర్వహించరు. దీంతో ఈ లింగానికి విశిష్ట పూజలు నిర్వహించారు పురోహితులు
గత 4 ఏళ్లుగా తను అగస్త్య మహాముని ఆలయాన్ని, స్వామి మలైలో ఉన్న బ్రహ్మణ్యేశ్వర క్షేత్ర దర్శనం కోసం ఎదురు చూస్తున్నాను అని ఇప్పటికి తనకు అనుగ్రహం లభించింది అన్నారు పవన్ కళ్యాణ్.

శ్రీ కుంభేశ్వరాలయంలో తనను చూసేందుకు వచ్చిన తెలుగు విద్యార్ధులకు పవన్ కళ్యాణ్ సెల్ఫీలు ఇచ్చి ఉత్సాహపరిచారు.
తిరుచెందూరు, తమిళనాడు | Tiruchendur, Tamil Nadu

- తిరుచెందూరు అరుల్మిగ్ సుభ్రహ్మణ్య స్వామిని (Arulmigu Subramaniya Swami Temple, Tiruttani) దర్శించుకున్నారు పవన్ కళ్యాణ్.

- సుబ్రహ్మణ్య స్వామి వారిని (Arulmigu Subramaniya Swami Temple) దర్శించుకొని, ఆలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు
పవన్ కళ్యాణ్ పుణ్యక్షేత్రాల యాత్ర ప్రస్తుతానికి కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఆయన మదురైలో ఉన్నారు అని తెలుస్తోంది.
Watch : జగన్మాత మీనాక్షి వెలసిన మదురై మీనాక్షి ఆలయం, మదురై క్షేత్ర చరిత్ర
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ట్రెండింగ్ వార్తలు కోసం NakkaToka.com విజిట్ చేయండి.