బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా చిలుకూరు బాలాజిని ( Priyanka Chopra Visits Chilkur ) దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఏకౌంట్‌లో షర్ చేసింది ప్రియాంకా. తన జీవితంతో కొత్త అధ్యాయం మొదలైంది అని ట్యాగ్ చేయడం విశేషం.
ముఖ్యాంశాలు
బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లో కూడా సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంది బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా. ఇటీవలే భారత్‌లోకి అడుగుపెట్టిన ప్రియాంకా చోప్రా పలు కార్యక్రమాలతో బిజీగా ఉంది. హఠాత్తుగా భారత దేశానికి వచ్చిన ఈ పాపులర్ నటిని చూసి చాలా మంది రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో నటించనుంది అని ఊహాగానాలు చేస్తున్నారు. ఈ గాసిప్స్ ఇలా మొదలయ్యాయో లేదో అంతలోనే హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న చిలుకూరు బాలాజి ఆలయంలో ( Chilkur Balaji Temple Hyderabad ) ప్రత్యక్షమైంది ప్రియాంకా చోప్రా.
చిలుకూరులో ప్రియాంకా చోప్రా | Priyanka In Chilkur Balaji Temple

ప్రియాంకా చోప్రా చిలుకూరు ఆలయాన్ని సందర్శించిన విషయం తను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసేంత వరకు ప్రపంచానికి తెలియదు. ఆలయంలో సంప్రదాయ దుస్తువుల్లో కనిపించిన ప్రియాంక చోప్రా దర్శనానికి సంబంధించిన ఫొటోలను, వీడియోలను పోస్ట్ చేసింది. చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు ఎమ్‌వీ సౌందర రాజన్ ( M.V. Soundara Rajan ) ఆమెతో పాటు ఫొటోలో కనిపించారు. ఆలయ చరిత్ర, విశిష్టతను ఆమెకు వివరించారు సౌందర రాజన్.
ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో క్యాప్షన్‌లో నటుడు రామ్ చరణ్ భార్య ఉపాసనకు ( Upasana Kamineni Konidela ) థ్యాంక్స్ చెప్పింది ప్రియాంకా.” బాలాజీ దయతో నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. మన మనసు ప్రశాంతంగా మారాలి అని, అందరూ బాగుండాలి. దేవుడి దయ ఉండాలి . థ్యాంక్ యూ ఉపాసన” అంటూ ఈ ఫోటోలు షేర్ చేసింది ప్రియాంకా
రాజమౌళి నెక్ట్స్ సినిమాలో ప్రియాంకా చోప్రా ? | Priyanka Chopra in SS Rajamouli Film ?
దిగ్గజ దర్శకుడు రాజమౌళి -మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రంలో ప్రియాంకా చోప్రా నటింనున్నట్టు పుకార్లు ఫిలింనగర్‌లో ( Hyderabad Film Nagar ) చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ప్రియాంకా ఇంకా స్పందించనప్పటికి చిలుకూరు దర్శనంతో ఈ పుకార్లు నిజమయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు అభిమానులు. టొరంటో నుంచి ఇటీవలే హైదరాబాద్ చేరుకుంది ప్రియాంకా.
రాజమౌళి- మహేష్ బాబు మూవీ అప్డేట్
SS Rajamouli -Mahesh Babu Movie Updates : ఆర్‌ఆర్‌ఆర్ ( RRR Film ) చిత్రం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భారీ విజయం సాధించడంతో రాజమౌళి తదుపరి చిత్రం కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కనున్న ఈ చిత్రం యాక్షన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కనుంది. ఇప్పటికే మూవీ టీమ్ ఆఫ్రికాలోని పలు ప్రాంతాలను విజిట్ చేసింది.
దీంతో పాటు మహేష్ బాబు సినిమా కోసం విదేశాల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు నటిస్తాడు అనే విషయం తప్పా ప్రపంచానికి మరో విషయం తెలియదు. అందుకే పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.
WEB STORY
ఈ సందర్భంలో ప్రియాంకా చోప్రా హైదరాబాద్ పర్యటన హైలైట్ అవుతోంది. మరి ప్రియాంకా నిజంగానే రాజమౌళి నెక్ట్స్ మూవీలో నటించనుందో లేదా అనేది తెలుసుకోవాలి అంటే మరికొంత కాలం ఆగాల్సిందే.
ఈ Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
