Pushkar Sarovar : ఎండాకాలంలో ఒక ఆధ్యాత్మిక చల్లదనం
Pushkar Sarovar : మండే ఎండలు, మారుస్థలం… ఇవి వింటే వెంటనే గుర్తొచ్చేది Rajasthan. ఎండాకాలంలో ఇక్కడ ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ వేడిలో కూడా మనసుకి ఒక శాంతి, ఆధ్యాత్మిక చల్లదనం కలిగించే ప్రదేశం ఉంది. అదే Pushkar లో ఉన్న పవిత్రమైన Pushkar Sarovar.
ఆరావళి పర్వత శ్రేణుల మధ్య ఉన్న ఈ సరోవరం రాజస్థాన్‌లో అత్యంత పవిత్రమైన జల ప్రదేశాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. హిందూ పురాణాల ప్రకారం ఈ సరోవరం Lord Brahma ఆశీర్వాదంతో ఏర్పడిందని చెబుతారు. అందుకే ఈ సరోవరం చుట్టూ 50కి పైగా ఘాట్లు, అనేక ఆలయాలు కనిపిస్తాయి.
ఎండాకాలంలో పుష్కర్ పట్టణంలో వేడి ఎక్కువగా ఉన్నా కూడా ఎర్లీ మార్నింగ్, సాయంత్రం సమయంలో సరోవరం వద్ద వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. సూర్యోదయం సమయంలో సరోవరం మీద పడిన సూర్య కిరణాల వల్ల నీరు బంగారు వర్ణంలో మెరుస్తుంది.
- ఇది కూడా చదవండి : హైదరాబాద్ మొత్తాన్ని 2 రోజుల్లో పూర్తి చేయగలమా? – No | 2-Day Hyderabad Practical Tour

అదే సమయంలో ఘాట్ల దగ్గర భక్తులు పవిత్ర స్నానాలు చేస్తూ, పూజలు చేస్తూ కనిపిస్తారు. తెల్లని ఘాట్లు, ఆలయాల గోపురాల ప్రతిబింబం నీటిపై పడుతూ ఒక అందమైన దృశ్యాన్ని సృష్టిస్తుంది.
పుష్కర్‌కు మరో ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. ప్రపంచంలో చాలా అరుదుగా కనిపించే Brahma Temple Pushkar ఇక్కడే ఉంది. అందుకే భక్తులు మాత్రమే కాదు, ట్రావెల్ లవర్స్‌కు కూడా పుష్కర్ ఒక స్పిరిచువల్ డెస్టినేషన్ గా నిలుస్తుంది.
ఎండాకాలంలో రాజస్థాన్ ట్రావెల్ అనేది సాధారణంగా కష్టమైనదే. కానీ వెళ్తే మాత్రం మౌంట్ అబూ, పుష్కర్ వంటి కొన్ని ప్రదేశాలు ట్రై చేయవచ్చు. మండే వేడిలో కూడా అక్కడ ఒక ప్రశాంతమైన అనుభూతిని పొందవచ్చు.
హైదరాబాద్ నుంచి ఎలా చేరుకోవాలి?
Hyderabad నుంచి ముందుగా Jaipur వరకు ఫ్లైట్ లేదా రైలు ద్వారా చేరుకోవచ్చు. అక్కడి నుంచి రోడ్డు ద్వారా Ajmer , పుష్కర్ సులభంగా చేరుకోవచ్చు. వెళ్లడానికి ముందే టికెట్లు, రూమ్స్ బుక్ చేసుకుంటే ప్రయాణం మరింత సౌకర్యంగా ఉంటుంది.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
