RTC Special Package : అరుణాచల గిరి ప్రదక్షిణకు ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ: తక్కువ ధరకే ఆధ్యాత్మిక యాత్ర
RTC Special Package : అరుణాచల క్షేత్రం పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటి. ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంది. దక్షిణ భారతదేశంలోని పంచలింగ క్షేత్రాలలో ఇది అగ్నిదేవుడికి ప్రతీక. అరుణాచలం అంటే అరుణం అంటే ఎరుపు, అచలం అంటే కొండ పూర్తి అర్థం ఎర్రని కొండ. అరుణ అంటే పాపాలను తొలగించేది అని అర్థం. అరుణాచలాన్ని తమిళంలో తిరువణ్ణామలై అని పిలుస్తారు. దీనిని చాలా గొప్ప పుణ్యక్షేత్రంగా భావిస్తారు.
అరుణాచల గిరి ప్రదక్షిణ ప్రాముఖ్యత
ఈ అరుణాచలం పరమశివుడి స్వరూపం కాబట్టి, భక్తులు దీని చుట్టూ ప్రదక్షిణ చేయడం అంటే శివుడిని ప్రదక్షిణ చేయడమే అని నమ్ముతారు. చాలా మంది పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేస్తారు. శివుడికి ప్రీతికరమైన కార్తీక మాసంలో అరుణాచలంలో జరిగే కార్తీక పౌర్ణమి దీపోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈ సమయంలో గిరి ప్రదక్షిణ చేయడం వల్ల విశేష పుణ్యఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం.

ఆర్టీసీ ప్రత్యేక బస్సు ప్యాకేజీ
నవంబర్ 5న అరుణాచల గిరి ప్రదక్షిణకు వెళ్లాలనుకునే భక్తులకు ఆర్టీసీ శుభవార్త ప్రకటించింది. వరంగల్ ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్ విజయ భాను మాట్లాడుతూ, గిరి ప్రదక్షిణ కోసం స్పెషల్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ బస్సు నవంబర్ 3న మధ్యాహ్నం 3 గంటలకు హనుమకొండ బస్సు నిలయం నుండి బయలుదేరి, 4వ తేదీ ఉదయం 6 గంటలకు ఆంధ్రప్రదేశ్ లోని కాణిపాకం చేరుకుంటుంది.
ఇది కూడా చదవండి : Milaf Cola : ఖర్జూరంతో సాఫ్ట్ డ్రింక్ లాంచ్ చేసిన సౌదీ అరేబియా
యాత్ర ప్రణాళిక, దర్శన స్థలాలు
కాణిపాకంలో విఘ్నేశ్వరుడి దర్శనం తర్వాత, మధ్యాహ్నం 1 గంటలకు తమిళనాడులోని వెల్లూరులో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకొని, సాయంత్రం 7 గంటలకు అరుణాచలం చేరుకుంటుందని తెలిపారు. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ స్వామి దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత, 5వ తేదీ మధ్యాహ్నం బస్సు అరుణాచలం నుండి బయలుదేరి, 6వ తేదీ ఉదయం శ్రీ జోగులాంబ అమ్మవారి శక్తి పీఠానికి వెళ్తుంది.
ప్యాకేజీ ధర, టికెట్ నమోదు వివరాలు
అమ్మవారి దర్శనం తర్వాత, బస్సు బీచుపల్లి హనుమాన్ ఆలయానికి వెళ్లి, అక్కడ దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత హనుమకొండకు చేరుకుంటుంది. ఈ ప్యాకేజీ ధర పెద్దలకు రూ.5000లు, పిల్లలకు రూ.3,500లుగా నిర్ణయించారు. ఇందులో ప్రయాణికులు వసతి, భోజనం విషయంలో స్వంతంగా చూసుకోవాలి. ఆర్టీసీ సిబ్బంది వారికి అనువైన వసతి సౌకర్యాలను కనుగొనడంలో సహాయపడతారు.
ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
అరుణాచలం వెళ్లాలనుకునే భక్తులు ఈ ప్యాకేజీ యాత్ర ద్వారా 5 పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చని తెలిపారు. ఇది భక్తులకు సువర్ణావకాశం అని, ఆసక్తిగల భక్తులు tsrtconline.in వైబ్ సైట్లో టికెట్లు నమోదు చేసుకోవచ్చని ఆయన చెప్పారు. హనుమకొండ, వరంగల్, కాజీపేట పరిసర ప్రాంతాల వారు నేరుగా ఆర్టీసీ నమోదు కార్యాలయాలలో కూడా టికెట్లు నమోదు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం, 9063407493, 9866373825, 9959226047 నంబర్లను సంప్రదించవచ్చు.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.