యునైటెడ్ కింగ్డమ్ నుంచి వచ్చిన ఒక పర్యాటకుడికి ఒక్క అరటి పండును రూ.100 కు అమ్మే ప్రయత్నం చేశాడు హైదరాబాదీ. నెటిజన్లు దీన్ని గోరా సర్వీస్ ట్యాక్స్ ( Hyderabad Banana Video ) అంటున్నారు. వీడియో చూడండి .
Table Of Content
ప్రపంచంలోనే హైదరాబాద్ గురించి ఎవరిని అడిగినా వెంటనే బిర్యానీ ( Biryani ) గుర్తుకు వస్తుంది. అయితే ఇకపై బనానా అంటే అరటి పండు కూడా గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత కాస్ట్‌లీ అరటి పండు ఇక్కడే లభిస్తుంది. యూరోప్‌లోని స్లాట్కాండ్‌కు చెందిన హ్యూగ్ ( Hugh Viral Video Hyderabad ) అనే ప్రయాణికుడు షేర్ చేసిన వీడియో హైదరాబాదీలను కూడా అవాక్కయ్యేలా చేసింది.
- ఇది కూడా చదవండి : ఈట్రైనుకు టికెట్ లేదు, టీసీ లేడు: 75 ఏళ్ల నుంచి ఫ్రీ సేవలు
ఈ వీడియోలో ఏముంది | Hyderabad Banana Video
ఈ వీడియోలో హ్యూగ్ అనే స్కాటిష్ ప్రయాణికుడు హైదరాబాద్ రోడ్డుపై ఒక అరటి పండు బండి నడిపే వ్యక్తిని “ఒక పండు ఎంత ” అని అడుతాడు. అమ్మే వ్యక్తి సమాధానంగా ఒక పండు రూ.100 అని అంటాడు. ధర విన్న వెంటనే ఇదొక పెద్ద స్కామ్ అని అర్థం చేసుకున్న ప్రయాణికుడు ఒక్క కాయ వందా ? అని మళ్లీ ప్రశ్నిస్తాడు. అవుననే సమాధానం వస్తుంది. ఇలా అయితే కొనడం కష్టం అని అతను వెళ్లిపోతున్నా ఆ బండీ అతను మాత్రం నా ధర ఫిక్స్అన్నట్టు ముందుకు వెళ్లిపోతాడు. కానీ రూ.100 వందకు యూకేలో 8 అరటి పండ్లు వస్తాయి అని చెప్పి వీడియోను ముగించేస్తాడు హ్యూగ్.
హైదరాబాద్‌లో డజను అరటి పండ్లు ఎంత ?
Cost Of Dozen Banana In Hyderabad : ఈ వీడియో 2024 నవంబర్ నెలలో తీసింది. కానీ ఇప్పుడు అది వైరల్ అవుతోంది. హైదరాబాద్‌లో డజను అరటిపండ్లు రూ.40 నుంచి 60 వరకు దొరుతాయి. మ్యాగ్జిమం రూ.80 అనుకోవచ్చు. పోని తెల్లవాళ్లు బాగా దోచుకున్నారు మనం వసూలు చేద్దాం అనే కాన్సెప్టుతో అతను ఉన్నా వందకు డజను పండ్లు ఇవ్వోచ్చు. కానీ మరీ వందకు ఒక పండు అనేది టూమచ్ అని చాలా మంది నెటిజన్లు భావిస్తున్నారు.
నెటిజెన్ల స్పందన | Hyderabad Banana Video
ఈ వీడియోపై నెటిజెన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అందులో కొన్ని రియాక్షన్స్ చూడండి.
- మిత్రుడు భారతీయ ఆర్థిక వ్యవస్థనను చక్కబెట్టే పనుల్లో ఉన్నాడు
- ఇతను గోరా సర్వీస్ టాక్స ( జీఎస్టీ) అంటే తెల్లోడి సేవా పన్ను వసూలు చేస్తున్నాడు
- బండిలో నాలుగు లక్షల సరుకు ఉంది
- తెల్లోడు ఇలా అనుకుంటాడు ” తెల్లోడిని ఎర్రోడిని కాదు “
- మీ ఫాలోవర్స్‌ను పిచ్చోళ్లను చేయకు . అతను కరెక్టే చేశాడు. అతను వాటిని మార్స్ నుంచి తీసుకువచ్చాడు.
ఆ వీడియో చూడండి | Watch Hyderabad Viral Banana Video
ఇలా చాలా మంది నెటిజెన్లు ఈ వీడియోపై స్పందించారు. మరో వైపు కొంత మంది నెటిజెన్లు మాత్రం హ్యూగ్‌కు సారీ చెప్పారు.
- ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు క్షమించండి.
- అతన్ని తప్పుగా అనుకోకండి. అందరికి ఇంగ్లిష్ వచ్చే అవకాశం లేదు. అతను డజనుకు వంద అనుకొని ఉండవచ్చు అని కామెంట్ చేశాడు ఒక యూజర్.
ఈ వీడియోలో మరో కోణం కూడా ఉండే అవకాశం ఉంది. అరటిపండ్లు అమ్మే వ్యక్తికి ఒక డజను అని అనిపించి ఉండవచ్చు. ఎందుకంటే అందరికి ఇంగ్లిష్ రావాలని రూల్ లేదు కదా. మీరేం అంటారు ?