Varalakshmi Vratam: శ్రావణ మాసంలో ఆకుపచ్చ రంగు ఎందుకు ప్రత్యేకం..అమ్మవారికి పచ్చ గాజులే ఎందుకు సమర్పిస్తారు ?
Varalakshmi Vratam: శ్రావణ మాసం అంటేనే పండుగలు, వ్రతాలకు నెలవు. ఈ మాసంలో వచ్చే ప్రతి పండుగకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ సంవత్సరం శ్రావణ పౌర్ణమి ఆగస్టు 9న వచ్చింది. ఈ రోజున రక్షా బంధన్‌ను కూడా జరుపుకోవడం ఆనవాయితీ. శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని ఈ రోజు గుళ్లలో, ఇళ్లలో భక్తుల సందడి నెలకొంటుంది. శ్రావణ పౌర్ణమి, వరలక్ష్మీ వ్రతం లాంటి పండుగలకు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహిస్తారు.

శ్రావణ పౌర్ణమి అంటే కేవలం రాఖీ పండుగ మాత్రమే కాదు. ఈ రోజును జంధ్యాల పౌర్ణమి (అవని అవితం) అని కూడా అంటారు. ఈ రోజున బ్రాహ్మణులు కొత్త జంధ్యాన్ని ధరిస్తారు. వేదాలను మళ్లీ చదవడం ప్రారంభిస్తారు. శ్రావణ పౌర్ణమి తిథి ఆగస్టు 8న మధ్యాహ్నం 2:12 గంటలకు మొదలై, ఆగస్టు 9న మధ్యాహ్నం 1:24 గంటలకు ముగుస్తుంది. ఈ తిథి ప్రకారం, శ్రావణ పౌర్ణమిని ఆగస్టు 9న జరుపుకుంటారు.
శ్రావణ పౌర్ణమి పూజ విధానం
ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఉపవాసం ఉండాలి. పుణ్య నదిలో స్నానం చేయడం చాలా శుభప్రదం. వీలు కాకపోతే, స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకుని స్నానం చేయవచ్చు. ఈ రోజు సత్యనారాయణ వ్రతం చేయడం చాలా మంచిది. ఇంట్లో సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని లేదా ఫోటోను పెట్టి, పూలు, పండ్లు సమర్పించి పూజ చేయాలి. సత్యనారాయణ కథ వినడం లేదా చదవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. రాత్రి చంద్రోదయం తర్వాత చంద్రుడికి నైవేద్యం సమర్పించి ఉపవాసం విరమించాలి. ఈ రోజు దానధర్మాలు చేయడం చాలా ముఖ్యం. అవసరమైన వారికి దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది.
ఇది కూడా చదవండి : Ramayana Trail : శ్రీలంకలో రామాయణం టూరిజం…ఏం చూపిస్తారు? ఎలా వెళ్లాలి ? Top 5 Tips
శ్రావణ పౌర్ణమి రోజు ఆలయాల్లో ఏం జరుగుతుంది?
శ్రావణ మాసం శివునికి చాలా ప్రీతికరమైనది. అందుకే ఈ మాసంలో శివాలయాల్లో ప్రత్యేక పూజలు ఉంటాయి. శివాలయాల్లో రుద్రాభిషేకం, బిల్వార్చనలు ఘనంగా నిర్వహిస్తారు. శివలింగానికి పాలు, తేనె, పెరుగు, నెయ్యి, చక్కెరతో అభిషేకం చేస్తారు. బ్రాహ్మణులు కొత్త జంధ్యాలు ధరించే కార్యక్రమాలు ఆలయాల్లో ఎక్కువగా జరుగుతాయి. భక్తులు శివనామ స్మరణతో ఆలయాలు మార్మోగుతాయి.

వరలక్ష్మీ వ్రతం సౌభాగ్యానికి ప్రతీక
శ్రావణ మాసంలో పండుగ అనగానే మహిళలకు వెంటనే గుర్తొచ్చేది వరలక్ష్మీ వ్రతం. ఈ మాసంలో వచ్చే రెండో శుక్రవారం రోజున ఈ వ్రతం ఆచరించడం ఆనవాయితీ. కుటుంబంలో సుఖసంతోషాలు, ఐశ్వర్యం, సంపద, శాంతి కలగాలని కోరుతూ లక్ష్మీదేవిని పూజిస్తారు.
ఇది కూడా చదవండి : UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు
ఆకుపచ్చ గాజులు ఎందుకు ధరిస్తారు?
వరలక్ష్మీ వ్రతం రోజున మహిళలు ఆకుపచ్చ గాజులు ధరించడం వెనుక ఒక నమ్మకం ఉంది. ఆకుపచ్చ రంగు శ్రేయస్సు, కొత్త ప్రారంభాలు, సానుకూల శక్తికి చిహ్నం. ఈ రంగు శివపార్వతులకు కూడా ప్రీతికరమైనదని భావిస్తారు. పెళ్లయిన మహిళలు ఆకుపచ్చ చీరలు, ఆకుపచ్చ గాజులు ధరించి లక్ష్మీదేవి రూపంలో పూజలో పాల్గొంటారు. ఈ వ్రతం రోజు ఇంటికి వచ్చిన మహిళలకు పసుపు, కుంకుమ, తాంబూలంతో పాటు ఆకుపచ్చ గాజులు ఇస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని విశ్వసిస్తారు. శ్రావణ మాసం అంతా ప్రకృతి పచ్చగా కళకళలాడుతుంది. అందుకే ఈ నెలలో పచ్చదనం మన జీవితంలో శ్రేయస్సు, ఆనందాన్ని తీసుకువస్తుందని నమ్ముతారు.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.