ప్రతి మలుపు ఒక పోస్టుకార్డులా కనిపించే Spiti Valley Travel
Spiti Valley Travel : అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది మంచుతో నిండిన పర్వతాలు కాదు… వెలుగు, నీడల మధ్య నడిచే ఒక నిశ్శబ్ద నాటకం. మధ్యాహ్నం సూర్య కిరణాల్లో భారీ పర్వతాలకు ఒక కొత్త రంగు వస్తుంది.
సాయంత్రం వేళల్లో మరో రంగు అక్కడ సందడి చేస్తుంది. ఎడారిలా కనిపించే ఈ భూమిలో ప్రకృతి భాషను అర్థం చేసుకుంటే, ఇక్కడి అందాల వెనక భావాలు కూడా మనసుకు చేరువ అవుతాయి.

ఇక్కడి ప్రయాణం అనేది నెమ్మదిగా మనసును కట్టిపడేసే ఒక చక్కని పాటలోని సాహిత్యంలా ఉంటుంది. లోయల మధ్యలో వెలుగు–నీడల ఈ ఆటను గమనిస్తే, ప్రతి గంట ఒక పెయింటింగ్‌లా అనిపిస్తుంది.
- ఇది కూడా చదవండి : మనాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఎక్కడ ఉండాలి, ఏం చూడాలి | Top 10 Tips To Visit Manali
సందర్శనీయ స్థలాలు | Spiti visiting places
Himachal Pradeshలోని Lahaul and Spiti districtలో ఉన్న స్పితి వ్యాలీలో ఎన్నో అందమైన సందర్శనీయ స్థలాలు ఉన్నాయి. అందులో
- Key Monastery
- Chandratal Lake
- Kibber Village

ఇవన్నీ చూస్తే మనం చూస్తున్నది కేవలం సీనరీ కాదు… కాలమే నిశ్శబ్దంగా సాగుతోంది అనిపిస్తుంది. రోడ్డుపై వచ్చే ప్రతి మలుపు ఒక పోస్టుకార్డు లా ఉంటుంది.
ఎలా చేరుకోవాలి | How To Reach Spiti Valley From Hyderabad
Hyderabad నుండి Delhi కి ఫ్లైట్ లేదా రైలులో వెళ్లవచ్చు. అక్కడి నుంచి Manaliకి రోడ్డు ప్రయాణం ప్రారంభించవచ్చు. ఇక మనాలీలో మీకు నచ్చినంత సమయం గడిపి, స్పితి వ్యాలీకి క్యాబ్ లేదా లోకల్ ట్రాన్స్పోర్ట్ ద్వారా అందమైన పర్వతాలను చూస్తూ చేరుకోవచ్చు.
ఈ ప్రయాణంలో గమ్యస్థానం కన్నా ప్రయాణ అనుభవమే జీవితాంతం గుర్తుండిపోతుంది.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
