Key Monastery Spiti: ఓవర్ టూరిజం కాకముందే చూసేయండి… స్పితీ వ్యాలీ!
Key Monastery Spiti : మన దేశంలో ఉన్న అనేక అద్భుతమైన ప్రదేశాల గురించి ఇంకా చాలా మంది ప్రయాణికులకు తెలియదు. అలాంటి ఒక ప్రత్యేకమైన ప్రదేశం గురించి ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా, మహీంద్రా గ్రూప్ చైర్మన్, ఇటీవల మాట్లాడారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని స్పితీ వ్యాలీలో ఉన్న కీ మోనాస్టరీ (Key Monastery)ని చూసిన తరువాత, “ఇది నిజంగా స్వర్గంలా ఉంది. కానీ ప్రపంచం మొత్తం ఇక్కడికి ఎందుకు రావడం లేదు? అంతర్జాతీయంగా ఈ ప్రదేశం గురించి ఎందుకు అంత చర్చలు లేవు?” అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ముఖ్యాంశాలు
స్పితీ వ్యాలీలో ప్రత్యేక ఆధ్యాత్మిక కేంద్రం | Spiti Valley Monastery
కీ మోనాస్టరీని కీ గోంపా (Key Gompa) అని కూడా పిలుస్తారు. ఇది కొండపై ఉండటంతో చుట్టూ మంచుతో కప్పబడిన పర్వతాలు, క్రింద ప్రవహించే స్పితీ నది అద్భుతంగా కనిపిస్తాయి. మనాలి ట్రిప్ ప్లాన్ (Manali) చేస్తున్నప్పుడు కీ మోనాస్టరీని కూడా తప్పకుండా మీ జర్నీలో చేర్చుకోవచ్చు.
స్థానికుల మాటల ప్రకారం ఈ మోనాస్టరీకి దాదాపు 1000 ఏళ్ల చరిత్ర ఉంది. ఇక్కడ బౌద్ధ సన్యాసులు విద్యాభ్యాసం చేయడంతో పాటు ప్రార్థనలు నిర్వహిస్తారు.
- ఇది కూడా చదవండి : Tawang Travel Guide : హిమాలయాల మధ్య ధ్యానం లాంటి ప్రదేశం తవాంగ్
ఇక్కడ ఉన్న వందల ఏళ్ల నాటి కుడ్య చిత్రాలు (Murals) ఇప్పటికీ అంతే అందంగా, స్పష్టంగా కనిపించడం విశేషం.
ఆనంద్ మహీంద్రా పోస్ట్ తరువాత పెరిగిన అటెన్షన్ | Anand Mahindra About Spiti Valley
స్పితీ వ్యాలీ గురించి ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తరువాత, కీ మోనాస్టరీపై పర్యాటకుల ఆసక్తి గణనీయంగా పెరిగింది. చాలా మంది ప్రయాణికులు “ఇండియాలో ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ ఉందా?” అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Key Monastery
— anand mahindra (@anandmahindra) February 1, 2026
Spiti
Living proof that Heaven can descend to Earth.
It’s a mystery why the whole world isn't flocking here
But perhaps its silence is its greatest gift.#SundayWanderer pic.twitter.com/WoKyKA9YgD
ఎప్పుడు వెళ్లాలి? | Best Time & Travel Info
కీ మోనాస్టరీకి వెళ్లడానికి మే నెల నుంచి సెప్టెంబర్ వరకు బెస్ట్ టైమ్. సెప్టెంబర్ చివరి వారం లేదా అక్టోబర్ నుంచి హిమపాతం మొదలవుతుంది, దీంతో రోడ్లు మంచుతో నిండిపోతాయి.
కాజా పట్టణం (Kaza Town) నుంచి కీ మోనాస్టరీకి రోడ్ మార్గంలో సులభంగా చేరుకోవచ్చు.
పర్యాటకులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
టూరిజం ఎక్స్పర్ట్స్ ప్రకారం, ప్రాపర్ ప్లానింగ్, వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, అలాగే బాధ్యతాయుతమైన టూరిజాన్ని ఫాలో అవడం చాలా ముఖ్యం. ఉత్తర భారతంలోని అనేక పర్యాటక ప్రదేశాలు ప్రస్తుతం ఓవర్ టూరిజం (Over Tourism), చెత్తాచెదారం, పర్యాటకుల నిర్లక్ష్యం వల్ల ఇబ్బంది పడుతున్నాయి.
కీ మోనాస్టరీ గానీ, తవాంగ్‌లోని Galdan Namgye Lhatse మోనాస్టరీ గానీ సందర్శించినప్పుడు, అక్కడి పవిత్రతను, పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
