రామయణం అనేది కేవలం భారతీయులకే కాదు శ్రీలంక ( Sri Lanka) వాసులకు ఇతర దక్షిణ ఆసియా దేశాల్లో ఉన్న ప్రజలుకు కూడా అపురూపమైనది. శ్రీలంకకు రామయణానికి ఉన్న సంబంధం గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
రామాయణంలోని ప్రధాన ఘట్టాల్లో కొన్ని శ్రీలంకలో జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘట్టాలపై ఇటీవలే శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటన చేసి విడుదల చేసింది.
Also Read : Oymyakon : ప్రపంచంలోనే అతిశీతలమైన గ్రామంలో ప్రజలు ఎలా జీవిస్తున్నారు ?
ఈ ప్రకటనను భారతీయులు బాగా ఇష్డపతున్నారు.
ఈ ప్రకటనతో తాము కేవలం వైమానికి సర్వీసులు ఇవ్వడంపై మాత్రమే కాదు ప్రయాణికుల ఆధ్మాత్మిక భావాలపై కూడా ఫోకస్ చేస్తామని శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ చెప్పకనే చెప్పింది.
వీడియోలో ఏముందంటే…
ఈ వీడియోలో ఒక పెద్దావిడ తన మనవడికి రామాయణంలోని ప్రధాన ఘట్టాల గురించి చెబుతూ ఉంటుంది. ఆమె రామయణంలోని ఒక ఘట్టాన్ని చెబుతున్న తరుణంలో ఆ ప్రదేశాలను డ్రోన్ షాట్‌లో చూపిస్తారు.
ఈ వీడియోలో రావణ గుహ, సిత అమ్మవారిని ఉంచిన స్థలం, సీతమ్మ గుడి, ఉస్సన్ గోడా నేషనల్ పార్క్, రామ సేతు, రుమసలా, దురివిలా సరస్సు వంటి ప్రదేశాలను కథలో భాగంగా చూపించారు.
చూడండి
రామ సేతు గురించి మనవడికి చెప్పే సమయంలో ఇంకా రామసేతు అలాగే ఉంది. నేటికీ నువ్వు దాన్ని చూడొచ్చు అంటుంది పెద్దావిడ.
ఈ వీడియోను రామాయణ ట్రైన్ అనే కాన్సెప్టుతో డిజైన్ చేసింది శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్.
Also Read : Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
అభినందిస్తున్న భారతీయులు…
రామాయణంతో సంబంధం ఉన్న ప్రాంతాలను చూసేలా భారతీయులను మోటటివేట్ చేసేలా ఈ వీడియోను డిజైన్ చేసింది.
రామాయణంపై శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ చేసిన ఈ వీడియోను నెటిజెన్లు అభినందిస్తున్నారు. తము తప్పకుండా శ్రీలంకా వెళ్తామని కొంత మంది కామెంట్ చేశారు.
ఈ వీడియో చూసి తమ రోమాలు నిక్కబొడుచుకున్నాయి అని…మన టూరిజం రంగం ఈ ప్రకటన చూసి చాలా నేర్చుకోవాల్సి ఉంది అని మరో యూజర్ కామెంట్ చేశాడు.
ఇంతకి మీకు ఆ ప్రకటన ఎలా అనిపించింది ? కామెంట్ చేయండి !
ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.