Winter Tourist Place : చలికాలంలో మేఘాలను తాకాలా? శ్రీకాకుళం డార్జిలింగ్‌కు వెళ్లాల్సిందే.. కార్తీక మాసంలో అస్సలు మిస్ అవ్వదు
Winter Tourist Place : చలికాలం వచ్చిందంటే చాలు, పర్యాటకులు ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి పర్వత ప్రాంతాలు, జలపాతాల వైపు అడుగులు వేస్తారు. ముఖ్యంగా కార్తీక మాసం ప్రారంభం కావడంతో, పిక్నిక్లు, వన భోజనాలకు డిమాండ్ పెరుగుతుంది. ఈ సందర్భంలో చల్లని గాలి, మంచు మేఘాలను నేరుగా తాకే అనుభూతిని పొందాలనుకునే వారికి శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని ఏజెన్సీ ప్రాంతాలు అద్భుతమైన గమ్యస్థానాలు.
పచ్చని కొండల మధ్య, కళ్ల ముందు కదలాడే మేఘాలను చూడాలంటే, ఈ చలికాలంలో శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో తప్పక చూడాల్సిన ఆ అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఏమిటో వివరంగా చూద్దాం.
సీతంపేట ఏజెన్సీ ప్రాంతం
శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట ఏజెన్సీ (sithampeta agency) ప్రాంతం ప్రకృతి ప్రేమికులు, భక్తులను ఆకర్షించే ముఖ్యమైన పిక్నిక్ ప్రాంతం. ఈ ఏజెన్సీ పరిధిలో అనేక అందమైన జలపాతాలు, సుందరమైన పార్కులు, కళ్లకు ఇంపుగా కనిపించే పచ్చని ప్రదేశాలు ఉన్నాయి. చలికాలం, కార్తీక మాసం(karthika masam) రాగానే ఈ ప్రాంతంలోని జలపాతాలు, పార్కులు పర్యాటక సందడితో కళకళలాడతాయి. ఈ ప్రాంతం వన భోజనాలకు అత్యంత అనుకూలమైనది.
ఫారెస్ట్ వ్యూ పాయింట్
ఈ చలికాలంలో చల్లని గాలిని, మంచు మేఘాలను దగ్గరగా ఆస్వాదించాలనుకుంటే, ఫారెస్ట్ వ్యూ పాయింట్ తప్పక చూడాలి. ఈ వ్యూ పాయింట్ సముద్ర మట్టానికి సుమారు 2500 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ మన కళ్ల ముందే మేఘాలు కొండలను తాకుతూ, కదులుతూ వెళ్తాయి. ముఖ్యంగా ఉదయం 5 నుండి 8 గంటల మధ్య, కొండల పైనుంచి తేలియాడే మంచు మేఘాలు అద్భుతమైన దృశ్యాలను అందిస్తాయి. అందుకే ఈ వ్యూ పాయింట్‌ను శ్రీకాకుళం డార్జిలింగ్ అని పిలుస్తారు.

ఇది కూడా చదవండి : Peaceful Countries: ప్రపంచంలోని టాప్ 10 శాంతియుత దేశాలు
సున్నపుగడ్డ, మెట్ట జలపాతాలు
సీతంపేట ఏజెన్సీలో వన భోజనాలకు (vana bhojanalu) ప్రసిద్ధి చెందిన మరో అద్భుతమైన ప్రదేశాలు మెట్ట జలపాతం, సున్నపుగడ్డ జలపాతం. చలికాలంలో ఈ జలపాతాల నుంచి నీరు పాల నురుగులా ప్రవహిస్తూ, పచ్చని కొండల మధ్య అద్భుతమైన వీక్షణను అందిస్తాయి. ఇక్కడి ప్రకృతి అందాన్ని చూడటానికి రెండు కళ్లు చాలవని పర్యాటకులు అంటుంటారు. కార్తీక మాసంలో పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఈ జలపాతాల వద్దకు వచ్చి, వన భోజనాలు ఏర్పాటు చేసుకోవడం తరచుగా కనిపిస్తుంది.
ఇది కూడా చదవండి : Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
వన భోజనాల ప్రత్యేకత
కార్తీక మాసం అనేది పవిత్రమైన సమయం కావడంతో, శ్రీకాకుళం జిల్లా ప్రజలు తమ కుటుంబాలతో కలిసి సీతంపేటలోని జలపాతాలు, ఫారెస్ట్ వ్యూ పాయింట్‌కు పెద్ద ఎత్తున వస్తారు. ముఖ్యంగా శని, ఆదివారాలలో ఈ ప్రదేశాలు పర్యాటకుల (weekend getaway) రద్దీతో నిండిపోతాయి. ఈ చలికాలంలో, మీరు కూడా మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి శ్రీకాకుళంలోని ఈ అందమైన ప్రదేశాలను సందర్శించి, ప్రకృతిని ఆస్వాదించవచ్చు.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
