Summer Travel : ఎండలో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ముందుగా ఇది చదవండి
Summer Tips : ఎండాకాలంలో ప్రయాణాలు చేయడానికి చాలా మంది ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. కానీ పిల్లల సెలవులు, ఆర్థిక సంవత్సరం తరువాత బ్రేక్ కోసం ట్రిప్స్ ప్లాన్ చేస్తుంటారు. అయితే సమ్మర్ ట్రావెల్ చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా మందికి తెలియదు. కొన్ని సింపుల్ టిప్స్ వారి కోసం.
ఉదయం ప్రయాణం బెస్ట్ | Morning Time
ఎండాకాలం ప్రయాణాలు చేయాలంటే ఉదయం వేళలు చాలా అనువైనవి. ఈ సమయం చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. సాఫ్ట్ లైట్ మధ్య బయటికి వెళ్లడం, గాలి మెల్లిగా తగలడం ఇవన్నీ ప్రయాణాన్ని ఫ్రెష్‌గా స్టార్ట్ చేసిన ఫీలింగ్ ఇస్తాయి.
మధ్యాహ్నం బ్రేక్ తప్పనిసరి | Break In Afternoon
మధ్యాహ్నం సమయంలో కొంచెం స్లో అవ్వాల్సి ఉంటుంది. ఈ సమయంలో రూమ్‌కి పరిమితం అవ్వడం లేదా నీడలో కూర్చుని రిలాక్స్ అవ్వడం ఉత్తమం. జర్నీలో ఒక కామ్ బ్రేక్ తీసుకున్నట్టు భావించండి.
హైడ్రేషన్ ముఖ్యం | Hydrating During Trip
ఎండాకాలంలో తరచూ మంచినీటిని తాగుతూ ఉండండి. దీని వల్ల శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. ఫ్రెష్ జ్యూసులు, కొబ్బరి నీరు తీసుకుంటే ఇంకా మంచిది.
డ్రెస్సింగ్‌లో జాగ్రత్తలు | Dressing In Summer
లైట్ కలర్స్ , బ్రీథబుల్ ఫ్యాబ్రిక్స్ ధరిస్తే శరీరానికి గాలి తగులుతుంది. సింపుల్‌గా, రిలాక్స్‌గా ఉండటానికి ప్రయత్నించండి. ప్రయాణాల్లో కంఫర్ట్ ఉండేలా చూసుకోండి.
లైట్ ఫుడ్ తీసుకోండి | Light Food
హెవీ మీల్స్ కాకుండా లైట్ ఫుడ్ తీసుకుంటే బెటర్. పండ్లు, పెరుగు ఉన్న పదార్థాలు, సింపుల్ రైస్ వంటివి సులభంగా జీర్ణం అవుతాయి. అలసటను తగ్గిస్తాయి.
స్లో ట్రావెల్ చేయండి | Slow Travel
ఎండాకాలం ప్రయాణంలో వేగం కన్నా నిధానం ముఖ్యం. స్పీడుగా ఎక్కువ ప్రదేశాలు చుట్టేయడం కన్నా, ఒకే ప్రదేశంలో ఎక్కువ సమయం గడపండి.
ప్రతీ మూమెంట్‌ను ఆస్వాదించండి
ప్రతీ మూమెంట్‌ని మెల్లిగా అనుభవించడంలో ప్రయాణానికి ఒక కొత్త అర్థం దొరుకుతుంది. సమ్మర్ ట్రావెల్లో వేగం కన్నా పేస్ ముఖ్యం. స్లోగా నడిచే ప్రయాణం, చల్లని గుర్తుగా మనసులో నిలిచిపోతుంది.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.







