Travel Tips 25 : మీ ఫోన్లోనే హై క్వాలిటీ సూర్యోదయం, సూర్యాస్తమయ ఫోటోలు ఎలా తీయాలంటే ?
Travel Tips 25 : సూర్యోదయం, సూర్యాస్తమయం చూస్తున్నప్పుడు ఆకాశం మారే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. డీఎస్ఎల్ఆర్, మిర్రర్‌లెస్ కెమెరా లేదా మీ స్మార్ట్‌ఫోన్‌తో ఈ ఫోటోలను అద్భుతంగా క్యాప్చర్ చేయడానికి టైం, టెక్నాలజీ, క్రియేటివిటీ అవసరం. సాధారణంగా సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాన్ని గోల్డెన్ అవర్ అని పిలుస్తారు. ఈ సమయంలో వెలుతురు చాలా స్మూతుగా, వెచ్చగా, చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది ప్రకృతి దృశ్యాలను అదృతంగా మారుస్తుంది. ఫోటోలను సహజంగా అందంగా చేస్తుంది.
అద్భుతమైన ఫోటోల కోసం కొన్ని చిట్కాలు
ముందైనా వెళ్లాలి, లేటయినా ఉండాలి : సూర్యోదయం/సూర్యాస్తమయానికి కనీసం 20-30 నిమిషాల ముందు వెళ్లండి. సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా అక్కడే ఉండండి. అప్పుడు ఆకాశం మరింత రంగులమయం అవుతుంది.

ముందే ప్రదేశాన్ని చెక్ చేయాలి : సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు లేదా అస్తమిస్తాడు అని తెలుసుకోవడానికి ఫోటోపిల్స్ లేదా గూగుల్ ఎర్త్ వంటి యాప్‌లను ఉపయోగించాలి. చివరి నిమిషంలో హడావిడి లేకుండా ఉండటానికి, రోజులో ముందే ప్రదేశాన్ని చూసుకోండి.
ఇది కూడా చదవండి : Azerbaijan అజర్ బైజాన్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? 10 టిప్స్!
రూల్ ఆఫ్ థర్డ్స్ను ఉపయోగించాలి : హోరిజోన్‌ను మధ్యలో కాకుండా ఫ్రేమ్‌లో కింది లేదా పై మూడో వంతులో ఉంచాలి. నీరు, చెట్లు లేదా మనుషుల సిల్హౌట్‌ల వంటి వాటిని చేర్చడం ద్వారా ఫోటోను మరింత ఆసక్తికరంగా మార్చుకోవచ్చు.
సిల్హౌట్‌లతో ట్రై చేయండి: సూర్యుని ముందు ఒక వస్తువు (మనిషి, కట్టడం లేదా చెట్టు) ఉంచి డ్రామటిక్ సిల్హౌట్లను క్రియేట్ చేయండి. ప్రకాశవంతమైన రంగుల కోసం ఎక్స్పోజర్ను కొద్దిగా తగ్గించాలి.
కెమెరా సెట్టింగ్‌లను మార్చండి (లేదా ఫోన్ ట్రిక్స్):
డీఎస్ఎల్ఆర్/మిర్రర్‌లెస్ కోసం: క్లియర్ ఫోటోల కోసం చిన్న అపర్చర్ (f/8-f/16), తక్కువ సౌండ్ కోసం తక్కువ ఐఎస్ఓను ఉపయోగించండి.
ఇది కూడా చదవండి : ప్రపంచ యుద్ధం వస్తే ఈ 10 దేశాలు చాలా సేఫ్
స్మార్ట్ఫోన్ల కోసం: ఆకాశంలో కాంతివంతమైన భాగంపై ఫోకస్ చేయడానికి ట్యాప్ చేసి, ఆపై ఎక్స్పోజర్ను మాన్యువల్‌గా తగ్గించండి.
రిఫ్లెక్సన్లు ఉపయోగించండి: సరస్సులు, నదులు లేదా తడి ఇసుకపై సూర్యాస్తమయాన్ని క్యాప్చర్ చేయడం ద్వారా అద్దం లాంటి ప్రభావాలను పొందవచ్చు.
ముందు భాగంలో ఉన్న వాటితో ప్రయోగం చేయండి: రాళ్ళు, పువ్వులు లేదా కట్టడాలతో ఫోటోలు తీయడం ద్వారా ఫోటోలకు మరింత అట్రాక్షన్ లభిస్తుంది.
మనుషుల ఫోటోలను మర్చిపోవద్దు: ప్రకాశవంతమైన ఆకాశం ముందు ఒక ప్రయాణికుడి సిల్హౌట్ సాధారణ ప్రకృతి దృశ్యం కంటే ఒక మంచి కథను చెబుతుంది.
ఎడిటింగ్‌ను నేచురల్‌గా ఉండాలి : రంగులను కొద్దిగా మెరుగుపరచండి.. కానీ అతిగా చేయవద్దు. లైట్‌రూమ్ లేదా స్నాప్‌సీడ్ వంటి యాప్‌లు రంగులను అందంగా బ్యాలెన్స్ చేయడానికి సాయపడతాయి.
సూర్యోదయం, సూర్యాస్తమయం ఫోటోగ్రఫీ అంటే కేవలం కెమెరాను ఆకాశం వైపు పెట్టడం కాదు. ఆ టైం స్టోరీని క్యాప్చర్ చేయడం. ఓపిక, ప్రణాళిక, కొద్దిగా క్రియేటివిటీతో మీ ఫోటోలు ఒక పోస్ట్ కార్డ్ లాగా కనిపిస్తాయి.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.