Telangana SIR ముందు హైదరాబాద్ NRIs లో గందరగోళం – Enumeration Form ని బంధువులు నింపవచ్చా ?
Telangana SIR : మీరు విదేశాల్లో ఉంటున్న హైదరాబాదీనా? SIR ప్రక్రియలో మీ పేరెంట్స్ మీ తరపున ఫామ్ ఫిల్ చేయొచ్చా లేదా అని డౌట్ ఉందా? ఒక చిన్న తప్పు వల్ల ఓటర్ లిస్ట్ నుంచి మీ పేరు పోయే అవకాశం ఉందా? ఈ గందరగోళానికి వాస్తవాలతో క్లారిటీ ఇస్తాం.
ముఖ్యాంశాలు
విదేశాల్లో ఉన్న చాలా మంది తెలుగు ప్రజలకు, ముఖ్యంగా హైదరాబాద్‌కు చెందిన ఎన్నారైలకు, Special Intensive Revision (SIR) విషయంలో ఎన్నో సందేహాలు ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణలో ఈ ఎలక్టోరల్ ప్రక్రియ మూడవ దశ (Phase-III) కు సన్నద్ధమవుతోంది.
ఈ సమయంలో ఎక్కువగా వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే:
“భారతదేశంలో ఉన్న మా పేరెంట్స్ లేదా బంధువులు మా తరపున SIR Enumeration Form నింపవచ్చా?”
ఈ ప్రశ్నకు సరైన సమాధానం తెలియక చాలా మంది ఎన్నారైలు తమ ఓటర్ లిస్టులో పేరు కొనసాగుతుందా లేదా అనే భయంతో ఉన్నారు.
- ఇది కూడా చదవండి : ఇల్లు మారితే Passport Address Change చేయాలా? మార్చకపోతే ఏమవుతుంది?
ఈ కన్ఫ్యూజన్ ఎందుకు స్టార్ట్ అయింది?
Why Confusion About SIR Enumeration?
హైదరాబాద్‌కు చెందిన చాలా మంది ఉద్యోగాలు, బిజినెస్, ఉన్నత విద్యాభ్యాసం వంటి కారణాల వల్ల విదేశాలకు వెళ్లి అక్కడే నివసిస్తున్నారు. వీరిలో చాలామంది తమ భారతీయ పౌరసత్వాన్ని కొనసాగిస్తూనే, హైదరాబాద్ ఓటర్ జాబితాలో తమ పేరును కొనసాగిస్తున్నారు.
చట్టప్రకారం ఓటరుగా అర్హత పొందాలంటే వ్యక్తి భారతదేశంలో నివసించాలి. అయితే ఎన్నారైలకు ప్రత్యేక నిబంధనలు (Special Provisions) ఉన్నాయి. భారతదేశంలో లేకపోయినా, వారి భారతీయ పాస్‌పోర్ట్ మరియు శాశ్వత చిరునామా ఆధారంగా Overseas Elector గా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది.
ఎన్నారై ఓటర్లు పాటించాల్సిన సరైన విధానం
Correct Process for NRI / Overseas Voters
భారతదేశంలో నివసించని భారతీయులు, అంటే విదేశాల్లో ఉన్న ఎన్నారైలు, తప్పనిసరిగా Overseas Voter గా రిజిస్టర్ అవ్వాలి. ఇందుకు పాటించాల్సిన విధానం ఇలా ఉంటుంది:
• Form 6A నింపాలి (ఇది Overseas Electors కోసం ప్రత్యేక ఫారం)
• పాస్‌పోర్టులో ఉన్న చిరునామానే ఓటర్ గుర్తింపు చిరునామాగా పరిగణిస్తారు
• ఆ చిరునామా ఉన్న నియోజకవర్గంలోనే ఓటర్ నమోదు జరుగుతుంది
• ఎక్కువకాలం విదేశాల్లో ఉంటే సాధారణ ఓటరుగా కొనసాగడానికి అనుమతి ఉండదు
• అందుకే Overseas Elector కేటగిరీలోనే కొనసాగాలి
SIR Enumeration Form లో కన్ఫ్యూజన్ ఇచ్చిన లైన్
Confusing Line in SIR Enumeration Form
SIR Enumeration Form లో ఉన్న ఈ కింది లైన్ చాలా మంది ఎన్నారైలను గందరగోళంలో పడేస్తోంది:
“Signature / Left Thumb Impression of Elector OR any adult family member (mention relationship)”
దీని అర్థం గూగుల్ ట్రాన్స్లేషన్ ప్రకారం:
“ఓటరు సంతకం లేదా ఎడమ చేతి బొటనవేలు ముద్ర లేదా సంబంధాన్ని పేర్కొంటూ ఏదైనా వయోజన కుటుంబ సభ్యుడి సంతకం”
ఇది చదివి చాలా మంది “మేము లేకపోతే మా పేరెంట్స్ లేదా బంధువులు మా తరపున ఫామ్ నింపి సబ్మిట్ చేయవచ్చు” అని పొరపాటుగా అర్థం చేసుకున్నారు.
వార్నింగ్ ఇచ్చిన యూపీ కేస్ | UP Incident Gave Clarity
ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో SIR సమయంలో ఒక ఘటన జరిగింది. దుబాయ్, కువైట్‌లో నివసిస్తున్న తమ పిల్లల తరపున వారి తల్లి Enumeration Form నింపి సబ్మిట్ చేసింది.
తరువాత UP ఎలక్టోరల్ అధికారులు మీడియాతో మాట్లాడుతూ —
NRI ఓటర్లకు సంబంధించిన Enumeration Form ను బంధువులు తమ తరపున నింపడం చట్టరీత్యా అనుమతించబడదు అని స్పష్టంగా తెలిపారు.
ఈ వ్యాఖ్యల తర్వాత దేశవ్యాప్తంగా “NRI కి చెందిన SIR ఫామ్‌ను బంధువులు నింపవచ్చా?” అనే అంశంపై గందరగోళం మొదలైంది.
యూపీ ఘటనతో వచ్చిన స్పష్టత
Key Takeaway from UP Case
• NRI ఓటర్ల విషయంలో డిక్లరేషన్ లేదా సంతకం ఓటరు నుంచే రావాలి
• బంధువులు పూర్తిగా ఫామ్ నింపి తమ తరపున సబ్మిట్ చేయడం సరైన విధానం కాదు
• తప్పు ప్రక్రియ ఓటర్ స్టేటస్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది
ఇక తెలంగాణ విషయానికి వస్తే | Telangana SIR
Telangana SIR – Official Update

తెలంగాణ రాష్ట్ర Chief Electoral Officer ప్రకారం:
• తెలంగాణను SIR తదుపరి దశలో (Next Phase) కవర్ చేస్తారు
• బీహార్‌లో నిర్వహించిన SIR ఎలాంటి సమస్యలు లేకుండా పూర్తయింది
• అదే మోడల్‌ను తెలంగాణలో అమలు చేయాలనే ఉద్దేశం ఉంది
• తెలంగాణను దేశానికి Role Model State గా నిలబెట్టడమే లక్ష్యం
Niagara Falls, మాన్యుమెంట్ వ్యాలీ.. అమెరికాలో తప్పకుండా చూడాల్సిన 10 నేచురల్ వండర్స్
కన్ఫ్యూజన్ క్లియర్ చేసే ముఖ్యమైన పాయింట్లు
Clear & Safe Understanding
• యూపీ ఘటన తర్వాత, NRI విషయంలో బంధువులతో SIR ప్రక్రియ చేయించరాదని తెలుసుకోవాలి
• తెలంగాణ SIR ప్రక్రియ ఇంకా అమలులోకి రానుంది
• ఎన్నారైలు తమ స్థితికి సరిపోయే విధంగా Form 6A (లింక్ ఆర్టికల్ చివరిలో) ద్వారా కొనసాగాలి
• డిక్లరేషన్ లేదా సంతకం డైరెక్ట్‌గా ఓటరు నుంచే రావాలి
• తప్పు సబ్మిషన్ వల్ల ఓటర్ లిస్ట్ నుంచి పేరు తొలగించే అవకాశం ఉంది
• సరైన కేటగిరీలో రిజిస్టర్ అవ్వడమే అత్యంత ముఖ్యమైనది
ఇక Prayanikudu Advice
భారతదేశం నుంచి విదేశాలకు వెళ్లిన తర్వాత రూల్స్‌ను సరిగా ఫాలో కాకపోతే డాక్యుమెంటేషన్ సమస్యలు వస్తాయి. Travel Without Mistake అంటే ట్రిప్ మాత్రమే కాదు — ఓటింగ్, రిజిస్ట్రేషన్, ఎలిజిబిలిటీ లాంటి విషయాల్లో కూడా తప్పులు లేకుండా ఉండటం.
గమనిక | Disclaimer
ఈ ఆర్టికల్ విదేశాల్లో ఉన్న హైదరాబాద్ ఎన్నారైలకు ప్రజా మాధ్యమాల్లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఆధారంగా తీసుకుని వివరించబడింది. అధికారిక , తాజా సమాచారం కోసం తప్పనిసరిగా భారత ఎన్నికల సంఘం విడుదల చేసే నోటిఫికేషన్లు పరిశీలించండి.
🔗 Official Links for Verification
• Election Commission of India – Overseas Voters
https://eci.gov.in/overseas-voters
• Form 6A (Overseas Elector Registration)
https://voters.eci.gov.in•
Chief Electoral Officer – Telangana
https://ceotelangana.gov.in
Travel Without Mistakes అనేది ప్రయాణికుడు థీమ్. అందుకే ఇప్పటి నుంచి ఎక్కడికైనా వెళ్లే ముందు Prayanikudu.com చెక్ చేయండి.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
