సాహసాలను ఇష్టపడే వారి కోసం తెలంగాణ పర్యాటక శాఖ సరికొత్త యాక్టివిటీస్‌ను అందుబాటులోకి తెచ్చింది. జలపర్యాటంలో భాగంగా హుస్సేన్ సాగర్‌లో వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ( Water Sports ) తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు.
ముఖ్యాంశాలు
అడ్వంచర్ టూరిజాన్ని ప్రోత్సాహించేందుకు టూరిజం శాఖ, అమరావతి బోటింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ యాక్టివిటీస్‌ను ప్రారంభించింది.
తెలంగాణలో సాహస క్రీడలకు( Adventure Tourism ) అపారమైన అవకాశం ఉందని ఈ సందర్బంలో మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు, చారిత్రాత్మక, పురాతన ప్రాంతాలతో పాటు టెంపుల్ టూరిజం ( Temple Tourism ), వాటర్, అడ్వంచర్ టూరిజానికి మంచి అవకాశాలు ఉన్నాయన్నారు.
ఇది కూడా చదవండి : Laknavaram : లక్నవరంలో మూడవ ద్వీపం ప్రారంభం..ఎలా ఉందో చూడండి
ప్రపంచ స్థాయి యాక్టివిటీస్‌కు కేంద్రంగా..
ఈ మధ్య కాలంలో వాటర్ స్పోర్ట్స్‌కు మంచి ఆదరణ లభిస్తోంది అన్నారు మంత్రి జూపల్లి. ఈ సందర్భంగా ప్రపంచ స్థాయి వాటర్ యాక్టివిటీస్‌ను తెలంగాణలో తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. జల టూరిజాన్ని ( Water Tourism ) అభివృద్ధి చేసే విధంగా తెలంగాణ వ్యాప్తంగా పర్యాటకానికి అనుకూలమైన ప్రాంతాలను గుర్తించే పనిలో ఉన్నాం అని తెలిపారు.
ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్‌ను ప్రారంభించిన అనంతరం తెలంగాణ టూరిజం కార్పోరేషన్ ( Telangana Tourism Corporation ) చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డితో కలిసి మంత్రి జూపల్లి జైట్ స్కి పై హుస్సేన్ సాగర్‌లో కాసేపు విహారించారు.
వాటర్ టూరిజానికి అనుకూలం | Water Sports & Tourism
తెలంగాణలో వాటర్ టూరిజం, అడ్వంచర్ టూరిజం కోస కృష్ణా నది పరిహాక ప్రాంతంలోని సోమశిల బ్యాక్ వాటర్స్ ( Somasila ) , నాగర్జున సాగర్, ఇతర రిజర్వాయర్లు, హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్, తదితర ప్రాంతాలను అనుకూలమైనన్నారు మంత్రి జూపల్లి. వీటిని ఆధారంగా చేసుకుని జలపర్యాటకాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఉపాధి అవకాశాలు, ఆదాయాన్ని పెంచవచ్చన్నారు.
ఇది కూడా చదవండి : Ramappa : రామప్ప ఆలయం వీకెండ్ ప్యాకేజీ తీసుకొచ్చిన తెలంగాణ టూరిజం శాఖ
అమరావతి బోటింగ్ క్లబ్
విజయవాడ కేంద్రంగా వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ నిర్వహిస్తున్న అమరావతి బోటింగ్ క్లబ్ ( Amaravati Boating Club ), తెలంగాణ టూరిజం సంయుక్తంగా ఈ వాటర్ స్పోర్ట్స్‌ను ప్రజల కోసం ముందుకు తీసుకువచ్చాయి. రెవెన్యూ షేరింగ్ విధానంలో మొదటి విడతలో హుస్సేన్ సాగర్‌లో జెట్ స్కీ, జెట్ ఎటాక్, వాటర రోలర్, కయాక్ యాక్టివిటీస్‌ను పర్యాటకుల కోసం ప్రవేశ పెట్టారు.
లుంబినీ పార్కులో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, మెనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, అమరావతి బోటింగ్ క్లబ్ సీఈవో తరుణ్ కాకాని తదితరులు పాల్గొన్నారు.
ఈ travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.