TGSRTC : టీజీఎస్ఆర్టీసీ ఆఫర్ అదుర్స్.. తక్కువ ధరకే కాశీ, అయోధ్యలకు బస్సుల్లో యాత్ర!
TGSRTC : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) భక్తుల కోసం సరికొత్త యాత్ర ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకురానుంది. ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటన ప్రకారం.. త్వరలో కాశీ, అయోధ్య వంటి పవిత్ర పుణ్యక్షేత్రాలకు బస్సులను నడపనున్నారు. ఈ ప్యాకేజీలతో భక్తులు తక్కువ ధరకే సులభంగా ఈ క్షేత్రాలను సందర్శించవచ్చు. ఇప్పటికే తిరుమల, శ్రీశైలం, విజయవాడ వంటి పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తున్న టీజీఎస్ఆర్టీసీకి మంచి స్పందన లభించింది. ఇదే స్ఫూర్తితో సంస్థ తమ సేవలను ప్రజలకు మరింత దగ్గర చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా త్వరలో కాశీ, అయోధ్యతో పాటు పలు ఇతర ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు బస్సు టూర్ ప్యాకేజీలను రూపొందించాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ టూర్ల కోసం ప్రత్యేక సౌకర్యాలతో కూడిన బస్సులను సిద్ధం చేస్తున్నట్లు సజ్జనార్ తెలిపారు. ప్యాకేజీల పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

- ఇది కూడా చదవండి: Thailand 2024 : థాయ్లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రజలకు తమ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి అనేక కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు సైతం ఆర్టీసీ సేవలను విస్తరించేందుకు కృషి చేస్తున్నారు. ఇటీవల ప్రారంభించిన యాత్ర దానం కార్యక్రమం గురించి ఆయన వివరించారు. ఈ పథకం కింద, ఎవరైనా తమ శుభ సందర్భాలలో పేద విద్యార్థులు, అనాథలు, వృద్ధులు మరియు దివ్యాంగులను పుణ్యక్షేత్రాలు లేదా పర్యాటక ప్రదేశాలకు ఉచితంగా తీసుకెళ్లవచ్చు. ఈ కార్యక్రమానికి ప్రజల నుండి వస్తున్న దాతృత్వం ప్రశంసనీయం అని సజ్జనార్ కొనియాడారు.
ఇది కూడా చదవండి : Milaf Cola : ఖర్జూరంతో సాఫ్ట్ డ్రింక్ లాంచ్ చేసిన సౌదీ అరేబియా
కార్గో సేవలు, పెళ్లిళ్లు, శుభకార్యాలకు బస్సులను అద్దెకు ఇవ్వడం వంటి సేవలను కూడా ప్రజలకు తెలియజేయాలని సజ్జనార్ అధికారులను ఆదేశించారు. మే 2023లో ప్రారంభించిన గ్రామ కాలనీ బస్ ఆఫీసర్ కార్యక్రమం ద్వారా ఆర్టీసీ సేవలను ప్రతి గ్రామానికి, కాలనీకి తీసుకువెళ్తున్నారు. ఈ అధికారులు ప్రతి 15 రోజులకు ఒకసారి గ్రామస్తులతో సమావేశమై బస్సుల రాకపోకలు, సమయాలు, కొత్త రూట్లు, సమస్యల గురించి సమాచారం సేకరిస్తున్నారు. వివాహాలు, పండుగల వంటి సందర్భాలలో ట్రిప్పులను పెంచాలని అధికారులు ముందుగానే సలహా ఇస్తున్నారు. ఈ కార్యక్రమాలు టీఎస్ఆర్టీసీని ప్రజలకు మరింత చేరువ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.