Khairatabad Ganesh : అడుగు విగ్రహంతో ప్రారంభమైన మహాగణపతి ప్రస్థానం.. 71 ఏళ్ల అద్భుత ప్రయాణం
Khairatabad Ganesh : హైదరాబాద్ నగరంలో గణేష్ ఉత్సవాలు అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చే పేరు ఖైరతాబాద్ గణపతి. ప్రతి సంవత్సరం ఒక వినూత్న రూపంలో భక్తులకు దర్శనమిచ్చే ఈ మహాగణపతి, ఈసారి తన 71వ ఏట శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి అవతారంలో కొలువుదీరారు. ప్రపంచ శాంతిని కోరుతూ పూర్తిగా మట్టితో తయారు చేసిన ఈ పర్యావరణహిత విగ్రహం, భక్తులకు కనుల పండుగగా మారింది. ఇటీవల జరిగిన ఆగమన కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, మరాఠా బ్యాండ్ వాయిద్యాలు, మహిళల సంప్రదాయ స్వాగతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఒక్క అడుగుతో మొదలైన చరిత్ర
ఖైరతాబాద్ గణేష్ ఉత్సవానికి 71 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. 1893లో లోకమాన్య బాల గంగాధర్ తిలక్ సామాజిక ఐక్యత కోసం మహారాష్ట్రలో గణపతి ఉత్సవాలను ప్రారంభించారు. ఆయన స్ఫూర్తితో, హైదరాబాద్‌కి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ కౌన్సిలర్ సింగరి శంకరయ్య 1954లో ఖైరతాబాద్‌లో కేవలం ఒక అడుగు ఎత్తు విగ్రహాన్ని ప్రతిష్టించారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది విగ్రహం ఎత్తును ఒక్కో అడుగు పెంచుతూ వచ్చారు.

ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
ప్రతి ఏటా ఒక కొత్త రూపం
ఖైరతాబాద్ గణనాథుడి ప్రత్యేకత కేవలం ఎత్తు మాత్రమే కాదు, ఆయన ఆకృతిలో ఉన్న వైవిధ్యం కూడా. గడిచిన దశాబ్దాలుగా వివిధ రూపాల్లో దర్శనమిస్తూ భక్తులను ఆకట్టుకుంటున్నారు. 2014 నాటికి విగ్రహం ఎత్తు 60 అడుగులకు చేరుకుని షష్టిపూర్తి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ ఏడాది 71వ సంవత్సరం కావడంతో 69 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈసారి గణపతి విగ్రహం 3 తలలతో నిల్చున్న భంగిమలో ఉండగా, తలపై పడగవిప్పిన 5 సర్పాలు, మొత్తం 8 చేతులు ఉంటాయి. అలాగే, ఇరువైపులా శ్రీ జగన్నాథ స్వామి, శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, శ్రీ లలితా త్రిపుర సుందరి, శ్రీ గజ్జలమ్మ దేవి విగ్రహాలను కూడా ప్రతిష్టించారు. ఈ విగ్రహం తయారీకి 84 రోజులు శ్రమించిన 150 మంది కళాకారులు పర్యావరణహితంగా మట్టిని ఉపయోగించారు.
ఇది కూడా చదవండి : Egypt Travel Guide: ఈజిప్ట్..ఇక్కడ డబ్బు కట్టి సమాధులను చూస్తారు.. 15 Facts
లడ్డుపై తగ్గిన సందడి.. జంజం, కండువాల సంప్రదాయం
కొన్నాళ్ల క్రితం ఖైరతాబాద్ గణపతి లడ్డు కూడా వార్తల్లో ప్రముఖంగా నిలిచేది. గతంలో తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరం నుంచి భారీ లడ్డును నైవేద్యంగా తీసుకొచ్చేవారు. ఈ లడ్డు పలుమార్లు గిన్నిస్ బుక్ రికార్డుల్లో కూడా చోటు సంపాదించుకుంది. అయితే, లడ్డు పంపిణీలో జరిగిన తొక్కిసలాట కారణంగా ఈ సంప్రదాయాన్ని నిలిపివేశారు. ఇప్పుడు కేవలం ప్రతీకాత్మకంగా గణపతి చేతిలో ఒక చిన్న లడ్డును మాత్రమే ఉంచుతున్నారు. ఇక, పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా 55 అడుగుల జంజం, 50 అడుగుల కండువాను సమర్పించడం కూడా ఈ ఉత్సవంలో ఒక ముఖ్యమైన సంప్రదాయం.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.