Sankranti Sweets : ఈ సంక్రాంతికి బేగంబజార్‌లో ట్రై చేయాల్సిన స్వీట్స్ ఇవే!

షేర్ చేయండి

సంక్రాంతి అంటే ముందు పిండి వంటలే గుర్తుకు వస్తాయి. అయితే హైదరాబాద్ఓ ల్డ్ సిటీ వాళ్లకు పిండి వంటలతో పాటు బేగంబజార్‌లో దొరికే నార్త్ ఇండియన్ స్వీట్స్ ( Sankranti Sweets ) కూడా గుర్తొస్తాయి. రక్షాబంధన్, దీపావళి, సంక్రాంతి సమయంలో బేగంబజార్‌లో ప్రతీ గల్లీలో కొన్ని ప్రత్యేకమైన స్వీట్స్ అమ్ముతుంటారు. రోడ్డుపైనే కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేస్తారు.

Ghevar or Ghewar : ఇది ఒక రాజస్థానీ స్వీట్ డిష్. చూడటానికి ఒక గిన్నెలా ఉండే ఘేవర్‌ కింది భాగం మెత్తగా టేస్టీగా ఉంటుంది. దీనిని పిండి, చక్కర, మంచి నీరు, నెయ్యితో తయారు చేస్తారు. అయితే ఇందులో పాలతో చేసిన వెరైటీలు కూడా అందుబాటులో ఉంటాయి. కిలో ధర వచ్చేసి రూ.450 నుంచి మొదలు అవుతుంది. బేగంబజార్లో బేరం నేరం కాదు. తగ్గించమని అడగండి.
Peni : పేని లేదా పేనీలు అనేవి రంజాన్, సంక్రాంతి సమయంలో పాతబస్తిలో ఎక్కువ సేల్ అవుతాయి. ఏడాది పొడవునా వీటిని స్వీట్ షాపుల్లో అమ్ముతారు. మహారాష్ట్రకు చెందిన ఈ స్వీట్‌ పెళ్లిల్లో సర్వ్ చేస్తారు. వేడి వేడి పాలల్లో కొన్ని పేనీలు వేసుకుని ఒక నిమిషం ఆగి తింటే బాగుంటుంది. పాలు అంటే నచ్చని వాళ్లు ఛాయ్‌లో ట్రై చేయొచ్చు.పేనీలను మీరు మంచి షాపుల్లోనే క్వాలిటీవి కొనండి. అది కూడా నెయ్యితో చేసినవే కొనండి. టేస్టు బాగుంది కదా అనీ మరీ ఎక్కువగా తినేయకండి.
Til Laddu : నువ్వుల లడ్డూ అనేది నేషనల్ స్వీట్‌లాంటిది అన్నమాట. బెల్లంతో చేసిన నువ్వుల లడ్డును చలికాలం చాలా మంది ఇష్టంగా తింటారు. ఇందులో ఉండే ఐరన్‌ వేగంగా శక్తిని ఉత్పత్తి చేస్తుంది. బాడీని వేడిగా ఉంచుతుంది. ఇది ఊపిరి తిత్తుల ఆరోగ్యానికి కూడా మంచిది. నువ్వులో ఐరన్‌తో పాటు క్యాల్షియం, హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
బేగంబజార్లోని సత్యనారాయణ మిఠాయి భండార్‌తో పాటు నగరంలోని ఇతర ప్రముఖ స్వీట్ హౌజుల్లో కూడా ఇవి లభ్యం అవుతాయి.
Ghevar with Nuts : ఘేవర్ అనే ఈ రాజస్థానీ స్వీట్‌ అనేక వైరైటీల్లో మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. వీటి రుచిని పెంచడానికి ఘేవర్లపై డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ ముక్కలుగా చేసి పై భాగంలో చల్లుతారు. దీని వల్ల ప్రోటీన్స్, హెల్దీ ఫ్యాట్స్ వంటి పోషకాల సంఖ్య పెరుగుతుంది.
ఒక వేళ మీరు వీటిని సంక్రాంతికి మిస్ అయితే రక్షాబంధన్ టైమ్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు.
ఘేవర్‌ను కుకుర్ లేదా వంటపాత్రల్లో తయారు చేస్తారు. అందుకే దీని షేపు ఒక గిన్నెలా ఉంటుంది. మరుగుతూ మరుగుతూ ఇది గట్టిపడిపోతుంది. చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. వండిన తరువాత దీన్ని చెక్కర పాకంలో వేస్తారు. దీంతో ఘేవర్‌లో ప్రతీ అణువు పాకంతో ఏకం అవుతుంది. అందుకే దీనిని ఇష్టంగా తినాలి. అంతే కానీ ఏదో కాంట్రాక్ట్ తీసుకున్నట్టు అదే పనిగా తీసుకోవద్దు.
నువ్వుల లడ్డూను కొనే ముందు అది బెల్లంతో చేసిందా లేదా చక్కర పాకంతో చేసిందా కనుక్కోండి. బెల్లంతో చేసింది తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇందులో సెలేనియం, మెగ్నీషియం వంటి మినరల్స్ ఉంటాయి.
Safron Peni : పేనీలలో కూడా ఎన్నో వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వును చల్లి కూడా సర్వ్ చేస్తారు. కుంకుమ పువ్వులో యాంటిఆక్సిడెంట్ మెండుగా ఉంటాయి.
Type and Prices Of Ghevar : ఘేవర్ స్వీట్‌లో వాడిన పదార్థాలను బట్టి దాని ధరను నిర్ణయిస్తారు. చెక్కర, పిండి అనేవి కామన్. అయితే వీటితో పాటు పిండిని కలిపేందుకు ఏం వాడుతారో దాన్ని బట్టి ప్రైస్ ఉంటుంది. పాలతో చేసిన దాని కన్నా నెయ్యితో చేసింది కాస్త కాస్ట్‌లీ. ఇక్క పచ్చరంగులో ఉన్నది నెయ్యితో చేసింది పక్కనే ఉన్నవి పాలతో చేసినవి.

మీకు వీలైతే ఎప్పుడైనా ట్రై చేసి చెప్పండి. ఇక రుచి బాగుంది అని మరీ ఎక్కువగా తినేయకండి. స్వీట్ కొద్దిగా తీసుకుంటే లైఫ్ స్వీట్‌‌గా ఉంటుంది. పరిమితి మించితే శరీరంలో మధుమేహానికి స్వీట్ స్పాట్ అవుతుంది. ఇక మీ ఏరియాలో ఇలాంటి స్పెషల్ డిషెస్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి.

| Pandharpur : ఒక ఆధ్యాత్మిక ప్రపంచం | 7 Temple Darshan In 7 Hours In Pandharpur

Most Popular Stories

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!