జనవరి 25న మినీ బ్రహ్మోత్సవం…ఒకే రోజు 7 వాహనాల దర్శనం | Tirumala Ratha Saptami 2026
Tirumala Ratha Saptami 2026 : తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) 2026 జనవరి 25వ తేదీన తిరుమతలలో రథ సప్తమి పర్వాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించబోతోంది. ఈ పవిత్రమైన రోజును సూర్య జయంతిగా కూడా పరిగణిస్తారు. ఈ రోజు శ్రీ మలయప్ప స్వామి ఒకటే రోజు 7 వాహనాలపై ఊరేగింపుగా బయల్దేరి భక్తులకు దర్శనం ఇస్తారు.
రథ సప్తమిని మేఘ సప్తమి అని కూడా పిలుస్తారు. మేఘ మాసంలో శుక్ల పక్ష సస్తమి రోజు సూర్య దేవుడు జన్మించిన రోజుగా వేలాల్లో వర్ణించారు. ఈ పర్వదినం అనేది తిరుమలలో మినీ బ్రహ్మోత్సవంగా తిరుమలలో ప్రసిద్ధి చెందింది. ఈ సమయంలో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో తితిదే తగిన ఏర్పాట్లు చేసింది.
రథ సస్తమి సేవా టైమింగ్స్ | Ratha Saptami Vahana Seva Timings
- 5.30 AM – 8.00 AM: సూర్య ప్రభ వాహనం
- (సూర్యోదయం – 6.45 AM)
- 9.00 AM – 10.00 AM: చిన్న శేష వాహనం
- 11.00 AM – 12.00 Noon: గరుడ వాహనం
- 1.00 PM – 2.00 PM: హనుమంత వాహనం
- 2.00 PM – 3.00 PM: చక్ర స్నానం
- 4.00 PM – 5.00 PM: కల్పవృక్ష వాహనం
- 6.00 PM – 7.00 PM: సర్వభూపాళ వాహనం
- 8.00 PM – 9.00 PM: చంద్ర ప్రభ వాహనం
ఈ వాహన సేవలు శ్రీవారి మాడ వీధుల్లో జరుగుతాయి. భక్తులు ప్రత్యక్షంగా దర్శనం చేసుకోవచ్చు.
ఆర్జిత సేవ రద్దు | Arjitha Sevas Cancellation
రథ సస్తమి సందర్భంగా కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్త్ర దీపాళంకరణ సేవలను రద్ధు చేశారు. కానీ సుప్రభాతం, తోమాల సేవ, అర్చన మాత్రం ఏకాంతంగా నిర్వహించబడతాయి.
భక్తులకు సూచన | Prayanikudu TTD Tips
రథ సప్తమి రోజు తిరుమలకి వచ్చే భక్తులు ఎర్లీ మార్నింగ్ అరైవల్ ప్లాన్ చేసుకోవడం బెటర్.
- వాహన సేవా సమయంలో మాడ వీధులో క్రౌడ్ రెస్ట్రిక్షన్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి తితిదే సూచనలు పాటించగలరు.
- సీనియర్ సిటిజన్లు, పిల్లలతో ఉన్న మహిళలు, దివ్యాంగుల కోసం ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేయనున్నారు.
ఉదయం సమయంలో చలి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే లైట్ వులెన్ దుస్తువలు తీసుకెళ్లడం బెటర్.
తిరుమల తిరుపతి, టిటిడి అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి. అధికారిక సమాచారం, పరిశోధన చేసిన కంటెంట్ , కచ్చితత్వంతో అందిస్తాము.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు చిట్ చాట్
